Venus Transit: కన్య రాశిలోకి శుక్రుడి ప్రవేశంతో 8 రాశుల వారికి ఈరోజు నుంచి శుభ ఫలితాలు, మిగిలిన 4 రాశుల వారికి చికాకులు-venus transit in virgo detailed predictions for 12 zodiacs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Venus Transit: కన్య రాశిలోకి శుక్రుడి ప్రవేశంతో 8 రాశుల వారికి ఈరోజు నుంచి శుభ ఫలితాలు, మిగిలిన 4 రాశుల వారికి చికాకులు

Venus Transit: కన్య రాశిలోకి శుక్రుడి ప్రవేశంతో 8 రాశుల వారికి ఈరోజు నుంచి శుభ ఫలితాలు, మిగిలిన 4 రాశుల వారికి చికాకులు

Galeti Rajendra HT Telugu
Aug 25, 2024 01:19 PM IST

Venus Transit In Virgo: ఆగస్టు 25న సింహం నుంచికన్య రాశిలోకి శుక్రుడు ప్రవేశించాడు. జ్యోతిష్య లెక్కల ప్రకారం శుక్రుడి ఈరోజు గమనం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశిలోకి శుక్రుడు
కన్య రాశిలోకి శుక్రుడు

సింహం రాశి నుంచి ఈరోజు కన్య రాశిలోకి శుక్రుడు ప్రవేశించాడు. జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహం అనేది వైవాహిక ఆనందం, కీర్తి, కళ, ప్రతిభ, అందం, శృంగారం, కామం, ఫ్యాషన్ డిజైనింగ్, శారీరక ఆనందాల సంకేత గ్రహం.  జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం చాలా కీలకంగా భావిస్తారు.

ఈ గ్రహాల గమనం రాశులపై శుభ, అశుభకరమైన ప్రభావాన్ని చూపుతుంది.  శుక్రుడు శుభప్రదంగా ఉన్నప్పుడు జీవితం రాజులా మారుతుంది. 

శుక్రుడు కన్య రాశిలోకి ప్రవేశించినప్పుడు మొత్తం 12 రాశుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 

మేష రాశి

విద్యాపరమైన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. స్నేహితుల సహాయంతో వ్యాపారం పెరుగుతుంది. మనసు అశాంతిగా ఉంటుంది. కోపానికి దూరంగా ఉండండి. సంభాషణలో సమతూకం పాటించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.

వృషభ రాశి

అనవసరమైన కోపానికి దూరంగా ఉండండి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉంటాయి. పనిభారం పెరుగుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. మనసు కలతగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. స్వీయ నియంత్రణ అవసరం.

మిథున రాశి

స్వీయ నియంత్రణ కలిగి ఉండండి. అనవసర కోపానికి, వాదోపవాదాలకు దూరంగా ఉండండి. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కానీ మనసు చంచలంగా ఉంటుంది. ఉద్యోగంలో సహాయ సహకారాలు లభిస్తాయి. పురోగతికి బాటలు పడతాయి. మితిమీరిన కోపాన్ని మానుకోండి.

సింహ రాశి 

అకడమిక్ పనుల పట్ల ఆసక్తి చూపుతారు. ఫలితాలు కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. లైఫ్ కాస్త హడావిడిగా ఉంటుంది. కానీ మనసు మాత్రం సంతోషంగా ఉంటుంది. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు.

కర్కాటక రాశి

ఇంట్లో వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. జీవితం దుర్భరంగా ఉంటుంది. తండ్రి సాంగత్యం లభిస్తుంది. సంతానంతో ఆనందం పెరుగుతుంది. ఆశ, నిరాశ భావనలు మనసులో ఉండవచ్చు.

తులా రాశి 

అనవసరమైన తగాదాలు, వాదోపవాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగ పురోభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. శ్రమ పెరుగుతుంది. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కానీ అతిగా మాట్లాడటం మానుకోండి.

కన్య రాశి

జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. పూర్వీకుల ఆస్తి విషయంలో వివాదం రావొచ్చు.  కానీ ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది. సంభాషణలో సమతూకం పాటించండి.

ధనుస్సు రాశి 

ధార్మిక ప్రదేశానికి యాత్రకు వెళ్ళవచ్చు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉంటాయి. వాహన ఆనందం పెరుగుతుంది. మనసు సంతోషంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

మకర రాశి 

జీవనం కష్టంగా ఉంటుంది. వాహన సౌలభ్యం తగ్గుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉంటాయి. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కానీ స్వీయ నియంత్రణతో ఉండండి. మితిమీరిన కోపం, వ్యామోహానికి దూరంగా ఉండాలి.

కుంభ రాశి

వ్యాపారంలో మరింత హడావిడిగా ఉంటుంది. స్నేహితుల సహాయంతో వ్యాపార అవకాశాలు లభిస్తాయి. రీడింగ్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మాట ప్రభావం పెరుగుతుంది.

మీన రాశి 

మీరు ఎడ్యుకేషన్ విషయంలో ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. హడావిడితో పాటు శ్రమ కూడా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉంటుంది కానీ మనసులో ఒడిదొడుకులు ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.