Hyderabad : దొంగతనం చేశాడని..! నడిరోడ్డుపై యువకుడిని కొట్టి చంపిన పండ్ల వ్యాపారి-the fruit seller who beat the thief to death in madhuranagar hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : దొంగతనం చేశాడని..! నడిరోడ్డుపై యువకుడిని కొట్టి చంపిన పండ్ల వ్యాపారి

Hyderabad : దొంగతనం చేశాడని..! నడిరోడ్డుపై యువకుడిని కొట్టి చంపిన పండ్ల వ్యాపారి

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 25, 2024 11:10 AM IST

హైదరాబాద్ లోని మధురానగర్ లో దారుణం వెలుగు చూసింది. దొంగతనం చేయడానికి వచ్చిన యువకుడిపై ఓ పండ్ల వ్యాపారి ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. దెబ్బల దాటికి సదరు యువకుడు నడిరోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయాడు.

దొంగను కొట్టి చంపిన పండ్ల వ్యాపారి
దొంగను కొట్టి చంపిన పండ్ల వ్యాపారి (Image Source Twitter)

హైదరాబాద్ లో ని మధురానగర్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.  దొంగతనం చేశాడన్న కారణంలో ఓ యువకుడిని పండ్ల వ్యాపారి చంపేశాడు. తన షాపులోకి దొంగతనం చేసేందుకు వచ్చిన క్రమంలో ఇనుపరాడుతో దాడికి దిగాడు. విచక్షణరహితంగా కొట్టడంతో సదరు యువకుడు  ప్రాణాలు కోల్పోయాడు.

అయితే చనిపోయిన వ్యక్తి పలుమార్లు ఇదే షాపులో దొంగతనం చేసినట్లు తెలిస్తోంది. గల్లా పెట్టెలో ఉన్న డబ్బులను తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా దొంగతనం చేస్తుండగా పండ వ్యాపారి మహమ్మద్ ఉస్మాన్ పట్టుకున్నాడు. కోపోద్రిక్తుడైన ఉస్మాన్… షాపులో ఉన్న ఇనుపరాడుతో దాడి చేశాడు. దెబ్బల దాటికి నడిరోడ్డుపైనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనపై KPHB పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని దత్తు (26)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కన్నతల్లి గొంతుకోసి హత్య చేసిన కొడుకు:

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. నిడమనూరు మండల కేంద్రంలో  కన్నతల్లిని గొంతుకోసి  కొడుకు హత్య చేశాడు. ఆ తర్వాత అదే కత్తిలో గొంతు కోసుకొని బలవనర్మణానికి పాల్పడ్డాడుర.

వివరాల్లోకి వెళ్తే ఏడాది క్రితం శివ(36)కు వివాహమైంది. ఇటీవలనే భార్యతో విడాకులు తీసుకున్నాడు. అయితే శివి మానసికస్థితి సరిగా లేదని బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తల్లిని చంపటంతో అతను కూడా సూసైడ్ చేసుకున్నాడని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

టాపిక్