మిథునంలో సూర్య గ్రహ సంచారం.. 3 రాశులకు మంచి రోజులు-transit of sun in gemini will bring good days for these 3 moon signs according to vedik astrology ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మిథునంలో సూర్య గ్రహ సంచారం.. 3 రాశులకు మంచి రోజులు

మిథునంలో సూర్య గ్రహ సంచారం.. 3 రాశులకు మంచి రోజులు

HT Telugu Desk HT Telugu
Jun 08, 2023 08:53 AM IST

మిథునంలో సూర్య గ్రహ సంచారం కారణంగా మూడు రాశులకు మంచి రోజులు వచ్చాయని వైదిక జ్యోతిష శాస్త్రం చెబుతోంది.

సూర్య గ్రహ సంచారంతో తులా రాశి సహా 3 రాశులకు శుభ ఘడియలు
సూర్య గ్రహ సంచారంతో తులా రాశి సహా 3 రాశులకు శుభ ఘడియలు

సూర్యుడు జూన్ 15, 2023న సాయంత్రం 6.09 గంటలకు మిథున రాశిలో సంచరించనున్నాడు. సూర్యుడు నెలకోసారి రాశి మార్చి సంచరిస్తాడు. ఈ సంచారం కారణంగా పలు రాశులపై సానుకూల ప్రభావం పడుతుంది.

సూర్యుడు ఆత్మకారకుడు. మిథున రాశి కమ్యూనికేషన్‌కు చెందిన రాశి. ఈ రాశి బుధుడు అధిపతి. మిథునంలోకి సూర్యుడు సంచరించినప్పుడు మేథస్సు వికసిస్తుంది. సమాజానికి దశాదిశా నిర్దేశించే మార్గాలు చూపుతారు. వ్యూహ రచనలు, ప్రణాళికలు చేస్తారు. రచన, సృజానత్మక రంగంలో ఉన్న వారిలో నైపుణ్యం పెరుగుతుంది. మార్కెటింగ్‌లో ఉన్న వారు తమదైన మాట శైలితో ఆకట్టుకుంటారు. నాయకత్వ ప్రతిభ చాటుతారు. అందరి మన్ననలు పొందుతారు. అదృష్టం వెన్నంటి ఉంటుంది. ఏయే రాశులు ఈ పరిణామం వల్ల ప్రయోజనం పొందుతారో ఇక్కడ చూడండి.

మిథున రాశి

మిథున రాశిలోనే సూర్య గ్రహ సంచారం కావడం వల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. కెరీర్‌లో ఉన్నతస్థానానికి వెళతారు. సహోద్యోగాలతో సత్సంబంధాల వల్ల ప్రయోజనం కలుగుతుంది. మీ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. అన్ని రంగాల్లో విజయం మీదే అవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. పొదుపు కూడా చేస్తారు. శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. పలుకుబడి ఉన్న వ్యక్తుల మద్దతు లభిస్తుంది.

తులా రాశి

మిథున రాశిలో సూర్యుడు సంచరించడం వల్ల మీకు శుభం కలుగుతుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. పదోన్నతి లభిస్తుంది. ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు కూడా. లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ పోతే విజయం మీదే అవుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. జీవిత భాగస్వామి అండగా ఉంటారు. అనవసర వాదనలకు దిగొద్దు. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభ రాశి

సూర్య గ్రహ సంచారం కుంభ రాశి జాతకులకు ప్రయోజనం కలిగిస్తుంది. సంతానానికి సంబంధించి శుభ వార్తలు వింటారు. కొత్త ప్రాజెక్టుల నిర్వహణలో ఓర్పుగా సాగండి. విజయం మీదే అవుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు అన్ని వేళలా అండగా ఉంటారు. పరస్పర అవగాహనతో ముందుకు సాగుతారు. అవివాహితుల ప్రేమ బంధం పెళ్లికి దారితీస్తుంది.

Whats_app_banner