మార్చి 16, నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల జాతకులు నవగ్రహ ఆలయాలు దర్శించడం మంచిది-today march 16th 2024 rasi phalalu check your zodiac signs result for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today March 16th, 2024 Rasi Phalalu Check Your Zodiac Signs Result For Daily Horoscope In Telugu

మార్చి 16, నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల జాతకులు నవగ్రహ ఆలయాలు దర్శించడం మంచిది

HT Telugu Desk HT Telugu
Mar 16, 2024 12:04 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ16.03.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 16, నేటి రాశి ఫలాలు
మార్చి 16, నేటి రాశి ఫలాలు (pixabay)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 16.03. 2024

ట్రెండింగ్ వార్తలు

వారం: శనివారం, తిథి : సప్తమి,

నక్షత్రం : రోహిణి, మాసం : ఫాల్గుణం

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వ్యాపారంలో ఇబ్బందులుంటాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో శ్రద్ద అవసరం. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇంటిలో శుభాలు జరుగుతాయి. ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాలు కలసివస్తాయి. ఒత్తిడిని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. మేష రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి, నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికిఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. తోటివారి వల్ల మేలు జరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆగ్రహావేశాలతో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. బుద్ధిబలంతో ఆపదలు దూరం అవుతాయి. అవనసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశివారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. అవసరాలకు పనులు పూర్తవుతాయి. అనవసర విషయాలతో సమయాన్ని వృథా చేయవద్దు. ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శుభవార్త వింటారు. శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞులను సంప్రదించకుండా తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలగుతాయి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. గొడవలకు దూరంగా ఉండండి. ధన వ్యయ సూచనలున్నాయి. కర్మాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దశరథప్రోక్త శనిస్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మంచి పనులు చేపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. వినాయకుడిని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. అనుకున్నది సాధిస్తారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. ఆత్మీయుల సలహా వల్ల మంచి జరుగుతుంది. బంధుమిత్రులతో ఆనందముగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. గృహ, వాహనయోగాలున్నాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం తులా రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపాపరంగా అనుకూల ఫలితాలున్నాయి. ప్రారంభించిన పనులలో కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఒత్తిడి పెరగడం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. ముఖ్య విషయాలలో సందర్భోచిత నిర్ణయాలు తీసుకోవాలి. గొడవలు వచ్చే అవకాశముంది. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు చేస్తారు. ఉత్సాహంగా పనిచేయాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఏ పనిని ప్రారంభించినా సులువుగా పూర్తి చేస్తారు. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడిపెదరు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనా పెద్ద ఇబ్బందులు కలిగించవు. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. సకాలంలో పనులు పూర్తవుతాయి. మీమీ రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేస్తారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవానుగ్రహంతో శుభాలున్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని, నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు. మిత్రుల సహకారం ఉంటుంది. దైవబలంతో పనులు పూర్తిచేస్తారు. బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. తొందరపాటు వద్దు. కీలకమైన పనులలో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలుంటాయి. చక్కటి ఆలోచనా విధానంతో విజయా లను అందుకుంటారు. మకర రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దశరథప్రోక్త శనిస్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుని మీ భావాలను పంచుకుంటారు. అదనపు ఆదాయం రావడం వల్ల రుణ బాధలు తొలగుతాయి. వాహనాలు, స్థలం కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులకు ఉన్నత పదవులు దక్కుతాయి. గణపతిని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. భూ, గృహ యోగాలున్నాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కోర్టు వివాదాల పరిష్కారం. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగులకు ఊహించని ప్రమోషన్లు దక్కుతాయి. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రుణవిమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel