Sun ketu conjunction: సూర్యుడు, కేతువు కలిసి ఈ రాశుల వాళ్ళకు కనక వర్షం కురిపించబోతున్నారు-these 3 zodiac signs will play with money in september surya ketu together will do wonders ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Ketu Conjunction: సూర్యుడు, కేతువు కలిసి ఈ రాశుల వాళ్ళకు కనక వర్షం కురిపించబోతున్నారు

Sun ketu conjunction: సూర్యుడు, కేతువు కలిసి ఈ రాశుల వాళ్ళకు కనక వర్షం కురిపించబోతున్నారు

Gunti Soundarya HT Telugu
Aug 09, 2024 10:00 AM IST

Sun ketu conjunction: గ్రహాలు, నక్షత్రాల స్థానాల పరంగా సెప్టెంబర్ నెల చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో సూర్యుడు, కేతువులు సంవత్సరాల తర్వాత కన్యారాశిలో కలిసి వస్తున్నారు. సూర్య-కేతువుల కలయిక వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకోండి.

సూర్యుడు, కేతువు కలయిక
సూర్యుడు, కేతువు కలయిక

Sun ketu conjunction: గ్రహాల రాజు సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. సూర్య సంచారము మానవ జీవితంతో పాటు దేశం, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆగస్ట్ 16 నుంచి సూర్యుడు తన సొంత రాశి సింహ రాశిలో సంచరించబోతున్నాడు. ఏడాది తర్వాత తన సొంత రాశిలో ప్రయాణం చేయబోతున్నాడు.

అనంతరం సూర్యుడు సెప్టెంబర్ 16న కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే కేతువు కన్యా రాశిలో తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. పద్దెనిమిది నెలల పాటు కేతువు ఒక రాశిలో ఉంటాడు. అలా గతేడాది డిసెంబర్ లో కేతువు కన్యా రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు సూర్య సంచారము వలన కన్యా రాశిలో సూర్యుడు, కేతువు కలయిక ఏర్పడుతుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం సుమారు 18 సంవత్సరాల తర్వాత కన్యా రాశిలో సూర్యుడు, కేతువు కలయిక ఏర్పడుతోంది.

సూర్యుడు, కేతువుల కలయిక అద్భుతాలు చేస్తుంది

సూర్యుడు ధైర్యం, ఆత్మవిశ్వాసం, కీర్తి, గౌరవం, తండ్రి, ఆత్మకు కారకంగా పరిగణిస్తారు. సూర్యుడు, కేతువుల కలయిక కూడా గ్రహణ యోగాన్ని సృష్టిస్తుంది. ఇది జ్యోతిషశాస్త్రంలో మంగళకరమైనదిగా పరిగణించరు. కొన్ని రాసులకు గ్రహణ యోగం అశుభ ఫలితాలు ఇస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి కన్యా రాశిలో సూర్య-కేతువుల కలయిక జీవితంలో అద్భుతమైన మార్పులను తెస్తుంది. సూర్య-కేతువుల కలయిక ఏ రాశుల వారికి మేలు చేస్తుందో తెలుసుకోండి.

వృషభ రాశి

సూర్య-కేతు కలయిక వృషభ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది. ఈ సంయోగ ప్రభావం వలన మీరు జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. ప్రమోషన్‌తో జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కెరీర్‌లో కొత్త గుర్తింపు తెచ్చుకోవడంలో విజయం సాధిస్తారు. ఊహించని ధనలాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మనసు సంతోషంగా ఉంటుంది.

సింహ రాశి

సూర్య-కేతువుల కలయిక సింహ రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సంయోగం ప్రభావం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభం చేకూరుతుంది. అప్పుల నుండి విముక్తి పొందవచ్చు. ఈ కాలంలో మీ పెండింగ్‌లో ఉన్న ఏదైనా పనిని పూర్తి చేయవచ్చు. సెప్టెంబర్ నెల సింహ రాశి వారికి అదృష్ట మాసంగా మారబోతుంది.

మేష రాశి

సూర్యుడు-కేతువులు కలిసి మేష రాశి వారికి కెరీర్‌లో విజయాన్ని అందిస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు ఇది లాభదాయకమైన సమయం. మీరు ఆర్థికంగా విజయం సాధిస్తారు.

ధనుస్సు రాశి

సూర్యుడు-కేతువులు సంయోగం ధనుస్సు రాశి వారికి ధనవర్షం కురిపిస్తారు. పురోగతికి కొత్త దారులు తెరుచుకుంటాయి. వ్యాపారస్తులకు డబ్బు సంపాదించే అవకాశాలు లభిస్తాయి. సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.