Sun Transit In Leo: రాఖీ పండగ ముందే సింహ రాశిలోకి సూర్యుడు.. ఈ 3 రాశులకు మంచి రోజులు
Sun Transit In Leo: ఆగస్టు 19న రక్షా బంధన్. అంతకంటే ముందు ఆగస్టు 16న సూర్యుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఫలితంగా పలు రాశుల వారికి మేలు జరుగుతుంది. రాఖీ పౌర్ణమికి ముందు ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకోండి.
(1 / 5)
జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు ఒక నెల తరువాత తన స్థానాన్ని మార్చుకుంటాడు. ఫలితంగా రాఖీ పౌర్ణమికి ముందు సూర్యుని సంచారం అనేక రాశులకు మేలు చేస్తుంది. గ్రహాల రారాజు అయిన సూర్యుడు ఆగస్టు 16 న సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా కొన్ని రాశుల వారు ఈ పరివర్తన నుండి ప్రయోజనం పొందుతారు.
(2 / 5)
ఆగష్టు 19న రక్షా బంధన్ లేదా రాఖీ పూర్ణిమ. ఆగష్టు 16న రాత్రి 7.53 గంటలకు సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫలితంగా పలు రాశుల వారికి మేలు జరుగుతుంది.
(3 / 5)
సింహం : మీ రాశిచక్రంలోకే సూర్యుడు ప్రవేశించనున్నాడు. ఈ సమయం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.మీ పాపులారిటీ రోజురోజుకు పెరుగుతుంది. ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది. సంపద పరంగా లాభాలు ఉండవచ్చు. కారు లేదా ఇల్లు కొనుగోలు చేయవచ్చు. వివాహితులకు ఇది మంచి సమయం.అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి.
(4 / 5)
ధనుస్సు రాశి : ఈ సమయంలో మీరు చేసే ఏ పని అయినా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధార్మిక ప్రయాణాలు చేస్తారు. కొన్ని రంగాల వారికి ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలున్నాయి. ఈ సారి మీకు ప్రయోజనం కలిగించే ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. విదేశాలకు వెళ్ళవచ్చు. పోటీ పరీక్షల్లో మీరు గొప్ప ప్రయోజనం పొందుతారు.
ఇతర గ్యాలరీలు