Sun transit: మీన రాశిలో సూర్య సంచారం.. ఈ రాశుల జాతకులకు మంచి రోజులు-sun transit in meena rashi on march 14th 2024 these zodiac signs get money rain ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Transit: మీన రాశిలో సూర్య సంచారం.. ఈ రాశుల జాతకులకు మంచి రోజులు

Sun transit: మీన రాశిలో సూర్య సంచారం.. ఈ రాశుల జాతకులకు మంచి రోజులు

Gunti Soundarya HT Telugu
Mar 07, 2024 03:30 PM IST

Sun transit: గ్రహాల రాజు తన రాశి చక్రం మార్చుకోబోతునాడు. ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్న సూర్యుడు మరో వారం రోజుల్లో మీన రాశి ప్రవేశం చేస్తాడు.

మీనరాశి ప్రవేశం చేయబోతున్న సూర్యుడు
మీనరాశి ప్రవేశం చేయబోతున్న సూర్యుడు

Sun transit: గ్రహాల రాకుమారుడు బుధుడు మార్చి 7వ తేదీన మీన రాశి ప్రవేశం చేశాడు. బుధుడు తర్వాత ఇప్పుడు గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు వారం రోజుల తర్వాత మీన రాశి ప్రవేశం చేయబోతున్నాడు.

జ్యోతిషశాస్త్రంలో సూర్యభగవానుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. సూర్య సంచారం శుభప్రదంగా ఉన్నప్పుడు వ్యక్తి గౌరవం, సంపద పెరుగుతుంది. సూర్యుడు సంపద, శ్రేయస్సు, ఆనందం, నాయకత్వం వంటి వాటికి కారకుడిగా భావిస్తారు. ఇప్పటికే రాహువు మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఇక్కడ రాహువు, సూర్యుడి కలయిక జరుగుతుంది.

అలాగే బుధుడు, సూర్యుడు సంయోగం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. సూర్యుడు స్థానం బలంగా ఉంటే వారికి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. అదే ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడి స్థానం బలహీనంగా ఉంటే ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. మీనరాశిలో సూర్యుడు ప్రవేశించగానే కొన్ని రాశులకు మంచి రోజులు మొదలవుతాయి. ఏఏ రాశుల వారికి మేలు జరుగుతుంది చూద్దాం.

వృషభ రాశి

సూర్య సంచారం వృషభ రాశి జాతకులకు శుభ ఫలితాలు ఇస్తుంది. మరింత ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కెరీర్ పరంగా లాభపడతారు. ఉద్యోగం మారాలని అనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్థులు బాగా డబ్బు సంపాదిస్తారు. మీరు చేసే ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. క్లిష్టమైన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.

మిథున రాశి

మిథున రాశి వారికి సూర్యుడి సంచారం అనేక విధాలుగా మేలు చేస్తుంది. కెరీర్ కి సంబంధించి కొన్ని నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. ఈ సమయంలో కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులు విదేశీయులతో ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మెరుగవుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరమైన సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

సింహ రాశి

మీనరాశిలో సూర్యుని ప్రవేశం సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ కోసం తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. కొన్ని సార్లు లాభదాయకంగా ఉన్నప్పటికీ ఆచితూచి వ్యవహరించడం మంచిది. వివాహక జీవితంలో సంతోషం నెలకొంటుంది. సమాజంలో మీ గౌరవం రెట్టింపు అవుతుంది. కీర్తి, ప్రతిష్ట, హోదా పెరుగుతాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. అదృష్టం పూర్తి మద్దతుతో ఆర్థిక పరంగా బలోపేతం అవుతారు. సూర్యుడి స్థానం బలపరుచుకునేందుకు సింహ రాశి జాతకులు ఆదివారం పేదలకు అన్నదానం చేయడం మంచిది.

కన్యా రాశి

సూర్యుని సంచారం కన్యా రాశి వారికి ప్రయోజనాలు ఇస్తుంది. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఈ సమయంలో ఉన్నత స్థానాలు అధిరోహిస్తారు. పోటీదారులకు గట్టి పోటీ ఇస్తారు. డబ్బు పొదుపు చేసే అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపార పరంగా రెట్టింపు లాభాలు పొందుతారు. విద్యారంగానికి సంబంధించి శుభ ఫలితాలు లభిస్తాయి. కార్యాలయంలో మీరు చేసే పనికి ప్రశంసలు దక్కుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో రొమాంటిక్ గా గడుపుతారు. సూర్యుడు స్థానం మరింత బలపడేందుకు ఆదివారం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.

Whats_app_banner