Sun transit: సూర్యుడి సంచారం.. వీరి వైవాహిక జీవితంలో గొడవలు, ప్రేమ వివాహానికి అడ్డంకులు-sun transit in aries these zodiac signs get trouble in their love and marriage life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Transit: సూర్యుడి సంచారం.. వీరి వైవాహిక జీవితంలో గొడవలు, ప్రేమ వివాహానికి అడ్డంకులు

Sun transit: సూర్యుడి సంచారం.. వీరి వైవాహిక జీవితంలో గొడవలు, ప్రేమ వివాహానికి అడ్డంకులు

Gunti Soundarya HT Telugu

Sun transit: సూర్యుడు త్వరలోనే మేష రాశిలో సంచరించబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారి ప్రేమ జీవితం చిక్కుల్లో పడబోతుంది. వైవాహిక జీవితంలో గొడవలు వస్తాయి. ప్రేమ వివాహానికి అడ్డంకులు ఏర్పడతాయి.

సూర్య గ్రహ సంచారంతో ఈ రాశుల వైవాహిక జీవితంలో ఇబ్బందులు

Sun transit: జ్యోతిష శాస్త్రంలో గృహాల సంచారం కీలకంగా పరిగణిస్తారు. ఒక రాశి నుంచి మరొక రాశికి గ్రహం మారినప్పుడు అది జీవితంలోని అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది. వ్యాపారం, ఉద్యోగం, వైవాహిక జీవితం, ఆర్థిక వ్యవస్థ వంటి రంగాలలో హెచ్చుతగ్గులు ఉంటాయి.

గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు త్వరలో మేషరాశి సంచారం చేయబోతున్నాడు. నెలకు ఒకసారి రాశి చక్రం మారుస్తూ ఉంటాడు. ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఏప్రిల్ 13న సూర్యుడు మీన రాశిని వదిలి మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఖర్మల కాలం కూడా ముగుస్తుంది. సూర్యుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారి ప్రేమ జీవితంపై ప్రభావం చూపనుంది. వైవాహిక జీవితం చిక్కుల్లో పడే అవకాశం ఉంది. భార్యాభర్తలు విడిపోయే ప్రమాదం ఉంది. ప్రేమికులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సూర్యుడు శుభ స్థానంలో ఉన్నప్పుడు సృజనాత్మకత, శక్తి పెరుగుతుంది. ధైర్యంగా ఉంటారు. అదే ఆ శుభ స్థానంలో ఉంటే మాత్రం సహనం స్థాయి తగ్గుతుంది. కోపం పెరుగుతుంది. దీనివల్ల చిన్న విషయాలకే గొడవలు జరిగి విడిపోయే అవకాశాలు ఉన్నాయి. మేష రాశిలో సూర్యుడి సంచారం వల్ల ఏ రాశుల వారికి ప్రేమ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయో చూద్దాం.

వృషభ రాశి

ఈ సమయంలో వృషభ రాశి జాతకులు తమ ప్రేమ జీవితం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు, మీ భాగస్వామికి మధ్య ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో పాటు జీవిత భాగస్వామి మధ్య గొడవలు తలెత్తుతాయి. భార్యపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల ఇద్దరి మధ్య చీలికలు ఏర్పడతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలు నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే మీ మాటల వల్ల ఎదుటివారి మనసు గాయపడే అవకాశం ఉంది. ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకునే వారికి ఇంట్లో పెద్దల నుంచి సహకారం అందకపోవచ్చు.

మీన రాశి

సూర్యుడు మీన రాశిలోనే సంచరించబోతున్నాడు. ఫలితంగా ఈ రాశి వారి ప్రేమ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. భాగస్వామితో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతుంది. సంబంధంలో అపార్ధాలు పెరుగుతాయి. జీవితంలోని సమస్యలు పరిష్కరించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు బెడిసి కొట్టే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో కొనసాగుతున్న సమస్యల వల్ల ఒత్తిడి స్థాయిలు కూడా పెరుగుతాయి. వాటిని పరిష్కరించుకునేందుకు మీ భాగస్వామితో ఓపికగా మాట్లాడేందుకు ప్రయత్నించండి.

మకర రాశి

మేషరాశిలో సూర్యుడి సంచారం వల్ల మకర రాశి వారు తమ ప్రేమ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రిలేషన్షిప్ లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. మీ మనసు నిరాశతో నిండిపోతుంది. ఇద్దరి మధ్య అపార్ధాలు తారస్థాయికి చేరుకుంటాయి. దంపతుల మధ్య మాటలు కూడా తగ్గిపోతాయి. ఇది సంబంధంలో దూరాన్ని పెంచుతుంది. చిన్న చిన్న విషయాలకే గొడవ పడతారు. ఫలితంగా కుటుంబంలో అశాంతి వాతావరణం నెలకొంటుంది. ప్రేమ, సామరస్యాన్ని తిరిగి తీసుకురావడానికి ఓపికగా ఉండాలి. చర్చించుకుని సమస్యల పరిష్కరించుకోవాలి.