Budhaditya yogam: నవంబర్ 16 నుంచి బుధాదిత్య యోగం- ఉద్యోగంలో ప్రమోషన్, భారీగా డబ్బు చేతికందుతుంది
Budhaditya yogam: మరికొద్ది రోజుల్లో సూర్య సంచారం జరగబోతుంది. వృశ్చిక రాశిలోకి సూర్యుడు రాగానే బుధుడితో కలిసి బుధాదిత్య యోగం ఇస్తాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. అలాగే నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది.
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం తన రాశిని నిర్ణీత సమయంలో మారుస్తుంది. గ్రహ సంచార ప్రభావం మేషం నుండి మీనం వరకు మొత్తం పన్నెండు రాశుల మీద పడుతుంది.
నవంబర్లో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు దేవ్ దీపావళి జరుపుకుంటారు. ఆ తర్వాత గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు తులా రాశిని విడిచి పెట్టి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఇప్పటికే అక్టోబర్ 29 నుంచి గ్రహాల రాకుమారుడు బుధుడు సంచరిస్తున్నాడు. సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన తర్వాత అది బుధుడుతో కలయికను ఏర్పరుస్తుంది. దీని వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో దీన్ని శుభ యోగంగా పరిగణిస్తారు. సూర్యుడు, బుధుడు కలయిక కొన్ని రాశులపై సానుకూల ప్రభావం చూపుతుంది. బుధుడు, సూర్యుని కలయిక మూడు రాశుల వారికి చాలా శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రాశుల గురించి ఇక్కడ తెలుసుకోండి.
వృశ్చిక రాశిలోకి సూర్యుడు
గ్రహాలకు రాజు అయిన సూర్యుడు నవంబర్ 16వ తేదీ ఉదయం 07:41 గంటలకు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్ని వృశ్చిక సంక్రాంతి అని పిలుస్తారు. ఈ రాశికి అధిపతికి కుజుడు. దీని తరువాత డిసెంబర్ 15 న సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. వృశ్చిక రాశిలో సూర్యుని సంచార ప్రభావం ఇలా ఉండబోతుంది.
తులా రాశి
సూర్యుడు, బుధ గ్రహాల కలయిక తులా రాశి వారిపై చాలా శుభ ప్రభావం చూపుతుంది. ఈ కాలంలో మీరు డబ్బు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. మీరు మీ కెరీర్లో పురోగతిని పొందవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది.
వృశ్చిక రాశి
సూర్యుడు ఇదే రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఫలితంగా ఈ రాశిలోనే బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వ్యాపారస్తులకు సూర్యుడు, బుధుని కలయిక వల్ల లాభిస్తుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. మీరు శారీరక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
మకర రాశి
బుధుడు, సూర్యుని కలయిక మకర రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో భూమి, భవనం, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల సహకారంతో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులకు మంచి రోజులు వస్తాయి.
కుంభ రాశి
వృశ్చికరాశిలో సూర్యుడు, బుధుడు కలయిక వల్ల కుంభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఆదాయం పెరుగుదల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు శుభవార్త అందుకుంటారు. కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది. పిల్లల నుండి కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.