Simha Rashi Today : సింహ రాశి వారికి ఇంటర్వ్యూ కోసం ఈరోజు పిలుపు, వాదనలకు దూరంగా ఉండండి-simha rashi phalalu august 17 2024 in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Simha Rashi Today : సింహ రాశి వారికి ఇంటర్వ్యూ కోసం ఈరోజు పిలుపు, వాదనలకు దూరంగా ఉండండి

Simha Rashi Today : సింహ రాశి వారికి ఇంటర్వ్యూ కోసం ఈరోజు పిలుపు, వాదనలకు దూరంగా ఉండండి

Galeti Rajendra HT Telugu
Aug 17, 2024 08:18 AM IST

సింహ రాశి వారికి ఈరోజు అనేక ఆదాయ మార్గాల్లో డబ్బు వస్తుంది. న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న తోబుట్టువులకి ఆర్థిక సాయం చేయాల్సి రావొచ్చు. హెచ్‌ఆర్‌తో సామరస్యంగా మాట్లాడండి.

సింహ రాశి
సింహ రాశి (Pixabay)

Leo Horoscope August 17, 2024: సింహ రాశి వారు ఈరోజు వైవాహిత జీవితంలో ఉత్తమ క్షణాలను అనుభవిస్తారు. ఆఫీసులో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. కెరీర్‌లో గొప్ప విజయాన్ని అందుకుంటారు. మీరు ఆర్థికంగా ధనవంతులుగా మారడానికి అవకాశాలు దొరుకుతాయి.

ప్రేమ

సింహ రాశి వారు ఈరోజు భాగస్వామ్యులతో వాదనలకు దూరంగా ఉండాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ప్రశాంతమైన మనస్సుతో నిర్ణయాలు తీసుకోండి. ఈ రోజు కొంతమంది వ్యక్తుల రాకతో కొత్త ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి.

ఒంటరిగా ఉన్న సింహ రాశి వారి పెళ్లికి తల్లిదండ్రుల ఆమోదం లభించొచ్చు. రొమాంటిక్ డిన్నర్ ప్లాన్ చేసుకోండి. ప్రయాణం, ఆఫీస్‌ మీటింగ్‌లో ఆసక్తికరమైన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఈరోజు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి.

కెరీర్

ఈ రోజు ఆఫీసులో పనితీరుకు సంబంధించి చిన్నచిన్న సమస్యలు ఎదురవుతాయి. మీ ఉద్యోగంపై దృష్టి పెట్టండి. అహంకారాన్ని మానుకోండి. డెవలపర్లు కొత్త ఆలోచనలతో పనిచేయాలి. హెచ్‌ఆర్‌లతో సత్సంబంధాలు కొనసాగించాలి. సింహ రాశి వారు ఈ రోజు ఉద్యోగాలు మారవచ్చు. జాబ్ పోర్టల్లో మీ ప్రొఫైల్ను అప్డేట్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ షెడ్యూల్ ఉన్నవారికి ఈ రోజు కాల్ వస్తుంది.

ఆర్థిక

ఈ రోజు మీకు అనేక ఆదాయ మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. ఆస్తిని అమ్మడానికి లేదా కొనడానికి ప్లాన్ చేయవచ్చు. వ్యాపార భాగస్వామి నుంచి డబ్బు విషయంలో చిన్నచిన్న సమస్యలు ఎదురవుతాయి. అయితే జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు. న్యాయ వివాదాల్లో చిక్కుకున్న తోబుట్టువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో చదువుకునే వారికి ట్యూషన్ ఫీజుల కోసం ఆర్థిక సహాయం అవసరం.

ఆరోగ్యం

ఈ రోజు మీకు ఆరోగ్యం బాగుంటుంది. వృద్ధులకు జీర్ణ సమస్యలు రావొచ్చు. కాబట్టి జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఏదైనా సమస్యగా అనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. ఈ రోజు పిల్లలు ఆడుకునేటప్పుడు గాయపడవచ్చు. కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.