సెప్టెంబర్ 30, నేటి రాశి ఫలాలు- శుక్రుడి శుభ దృష్టితో వీరికి ధనలాభాలు అధికం-september 30th today rasi phalalu in telugu check all zodiac wise horoscope predicitons ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  సెప్టెంబర్ 30, నేటి రాశి ఫలాలు- శుక్రుడి శుభ దృష్టితో వీరికి ధనలాభాలు అధికం

సెప్టెంబర్ 30, నేటి రాశి ఫలాలు- శుక్రుడి శుభ దృష్టితో వీరికి ధనలాభాలు అధికం

HT Telugu Desk HT Telugu
Sep 30, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ30.09.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

సెప్టెంబర్ 30 నేటి రాశి ఫలాలు
సెప్టెంబర్ 30 నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 30.09.2024

వారం: సోమ‌వారం, తిథి : త్ర‌యోద‌శి ,

నక్షత్రం: మఖ, మాసం: భాద్రపదము,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

శుభకాలం కొనసాగుతోంది. ఆశయాలు నెరవేరతాయి. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలి. దైవబలు సహకరిస్తుంది. జీవితంలో సుస్థిరత ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపును పొందుతారు. మిత్రుల సాయం అందుతుంది. వ్యాపార విస్నూలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త. లక్ష్మీదేవిని ధ్యానించాలి.

వృష‌భం

మనోబలంతో విజయాలు సాధిస్తారు. లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. చిన్నపాటి ఆపదల నుంచి బయటపడతారు. అధైర్యం వద్దు. పనులు వాయిదా వేయకండి. ఒత్తిడికి గురికావద్దు. ఓ శుభవార్త వింటారు. ఇష్టదైవాన్ని ధ్యానించండి.

మిథునం

శుక్రుడి అనుగ్రహంతో ధనలాలు కలుగుతుంది. క్రమకు తగిన ప్రతిపలం లభిస్తుంది. కొన్ని విఘ్నాలు ఎదురైనా సులభంగా అధిగమిస్తారు. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. మనోబలంతో వ్యాపార సమస్యలను పరిష్కరిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి.

కర్కాటకం

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. ప్రారంబించిన పనులు త్వరగా పూర్తవుతాయి. విజయానికి చేరువ అవుతారు. సరైన ప్రణాళిక అవసరం. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి సూచనలున్నాయి. కొందరికి మేలు జరుగుతుంది. అదృష్టం కలిగిస్తుంది. శుభవార్త వింటారు. లక్ష్మీదేవిని పూజించండి.

సింహం

ఉత్సాహంగా పనులు మొదలు పెట్టండి. కార్యసిద్ధి ఉంది. మనసులోని కోరికలు నెరవేరతాయి. వృత్తి ఉద్యోగాల్లో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు. పెట్టుబడులు కలిగిస్తాయి. ఆత్మీయుల మధ్య అపార్థాలకు తావివ్వకండి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఓ మేలు జరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.

కన్య

ధనయోగం ఉంది. మీ బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తించండి. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. పొదుపు గురించి ఆలోచించాలి. కొన్ని అవకాశాలు చేజారిపోతాయి. అయినా నిరాశ వద్దు. కోపతాపాలకు పోకుండా వ్యవహరించండి. కీర్తి పెరుగుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. దుర్గాదేవిని ధ్యానించండి.

తుల

వ్యాపారంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ముఖ్య నిర్ణయాల్లో బుద్ధిబలం అవసరం. సమాజంలో గుర్తింపు పొందుతారు. గృహ, భూ, వాహనాది యోగాలున్నాయి. ఉద్యోగులు ఓర్పుతో వ్యవహరించి ఆపదల్ని తప్పించుకుంటారు. ఆవేశం పనికిరాదు. స్థిర నిర్ణయాలు తీసుకోండి. దీర్ఘకాలిక ఆశయం నెరవేరుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించాలి.

వృశ్చికం

శుభయోగాలున్నాయి. మీ ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో కనిపిస్తుంది. గుర్తింపు లభిస్తుంది. సమాజంలో గౌరవాన్ని పొందుతాడు. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. వాటిని సమర్థంగా అమలు చేయండి. తగిన జాగ్రత్తలతో వ్యాపార నష్టాలను అధిగమిస్తారు. కుజ గ్రహాన్ని ధ్యానించండి.

ధనుస్సు

శుభప్రదమైన కాలం పనులు వేగవంతంగా పూర్తవుతాయి. ధనయోగం ఉంది. కాకపోతే ఆ సంపదను జాగ్రత్తగా వాడుకోవాలి. మనోబలం కూడా ముఖ్యమే. ఉద్యోగులకు ఉన్నత స్థితి గోచరిస్తోంది. సమాజంలో గుర్తింపును పొందుతారు. పెద్దల ఆశీస్సులు అందుతాయి. విఘ్నాలను అధిగమిస్తారు. వేంకటేశ్వరుడిని ఆరాధించండి.

మకరం

ఉత్సాహంగా కార్యక్రమాలు మొదలు పెట్టండి. మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు అవసరం కావచ్చు. ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించాడు. కీలక సమయాల్లో ఆత్మీయుల సలహా తీసుకోండి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. అపోహలు తొలగిపోతాయి. వ్యయాలను అదుపులో ఉంచుకోండి. లక్ష్మీదేవిని ధ్యానించండి.

కుంభం

ఆర్ధికంగా మేలు జరుగుతుంది. ధ‌న‌లాభం సూచితం. రుణ సమస్యలు తొలగిపోతాయి. గ్రహ దోషం అధికంగా ఉంది కాబట్టి, ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. బుద్ధిబలంతో ఆపదలను అధిగమిస్తారు. ఉత్సాహాన్నిచ్చే వార్త వింటారు. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి.

మీనం

వ్యాపారం శుభప్రదం. నిర్ణయాల్లో బుద్ధిబలం అవసరం. సాంకేతిక విషయాలపై పట్టు పెంచుకుంటారు. ఆలోచనల్లో స్థిరత్వం అవసరం. వివాదాలకు అస్కారం ఇవ్వొద్దు. ఉద్యోగులు మరింత శ్రద్ధగా పనిచేయాలి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ