Pitru paksham: సెప్టెంబర్ 17 నుండి పితృ పక్షం ప్రారంభం- ఈ కాలంలో పిండ దానం ఎందుకు చేస్తారు?
Pitru paksham: పితృ పక్షం సమయంలో పూర్వీకులను సంతోషపెట్టడం కోసం వారికి నచ్చిన పనులు చేయాలని చెప్తారు. వారి కోసం పిండ దానం, తర్పణాలు వదలడం వంటి కార్యక్రమాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతారు.
Pitru paksham: భాద్రపద మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజు నుండి పితృ పక్షం ప్రారంభమవుతుంది. పితృ పక్షం కృష్ణ పక్షం అమావాస్య తేదీ వరకు ఉంటుంది. హిందూ మతంలో పితృ పక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది.
పితృ పక్షాన్ని శ్రద్ధ పక్షం, మహాలయ పక్షాలు అని కూడా అంటారు. పితృ పక్షం సమయంలో పూర్వీకులకు శ్రాద్ధం, తర్పణం వంటివి వదులుతారు. మత విశ్వాసాల ప్రకారం పితృ పక్షంలో పూర్వీకులకు సంబంధించిన పనులు చేయడం ద్వారా, పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. 17 సెప్టెంబర్ 2024న స్నానదాన పూర్ణిమ జరిగిన వెంటనే పితృ పక్షం ప్రారంభమవుతుంది. పితృ పక్షం సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమై అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది. బ్రహ్మ పురాణం ప్రకారం మనిషి తన పూర్వీకులను పూజించాలి, వారికి నైవేద్యాలు సమర్పించాలి. శ్రాద్ధం ద్వారా పూర్వీకుల రుణం తీర్చుకోవచ్చు.
తర్పణం ఎలా చేయాలి?
శ్రాద్ధ సమయంలో ఉదయాన్నే తలస్నానం చేసి చేతిలో ఉన్న జలం, కుశ, అక్షతం, నువ్వులు మొదలైన వాటితో పూర్వీకులకు సమర్పించడాన్ని తర్పణం అంటారు. దీని తరువాత ముకుళిత హస్తాలతో పూర్వీకులను ధ్యానం చేసి, నీరు త్రాగడానికి వారిని ఆహ్వానిస్తారు.
తర్పణం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్మకం. అంతేకాకుండా వ్యక్తి వారి ఆశీర్వాదాలను కూడా పొందుతాడు. భగవంతుడిని పూజించాలి. దీని తరువాత ఒక వ్యక్తి తన పూర్వీకులను స్మరించుకోవాలి. వారికి గౌరవం ఇవ్వాలి. వారి పేరు మీద అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలి. పూర్వీకుల ఆశీస్సులు కుటుంబం మీద ఉంటే ఎటువంటి ఆర్థిక కష్టాలు ఉండవని నమ్ముతారు. పుత్ర సంతానం కూడా కలుగుతుందని విశ్వసిస్తారు. పితృ దోషం కలిగిన వాళ్ళు ఈ సమయంలో తప్పనిసరిగా తర్పణాలు వదలడం చేయాలి. ఇలా చేయడం వల్ల దోషం నుంచి విముక్తి కలుగుతుంది.
పిండ దానం ఎలా చేయాలి?
పిండ దానం అంటే ఒకరి పూర్వీకులకు ఆహారాన్ని దానం చేయడం. పితృ పక్షం సమయంలో మన పూర్వీకులు కాకులు, ఆవు, కుక్క, బావి, చీమ లేదా దేవతల రూపంలో వచ్చి ఆహారం తీసుకుంటారని నమ్ముతారు. అందుచేత పితృ పక్షం సమయంలో ఐదు వంతుల ఆహారాన్ని తొలగించాలనే నియమం ఉంది. పిండ దాన సమయంలో చనిపోయిన వ్యక్తి కోసం బార్లీ లేదా బియ్యపు పిండిని పిసికి గుండ్రంగా ఉండే బంతులను తయారు చేస్తారు. అందుకే దీనిని పిండ దానం అంటారు. పిండ దానం చేసేందుకు గయా ప్రదేశం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
(ఈ కథనంలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు మరియు లౌకిక విశ్వాసాలపై ఆధారపడింది, ఇది సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే అందించబడింది.)
టాపిక్