Lunar eclipse: భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి పితృ పక్షం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 17 పౌర్ణమి వచ్చింది. ఆరోజు నుంచి పదిహేను రోజుల పాటు పితృ పక్ష రోజులుగా పిలుస్తారు. ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యాలు నిర్వహించరు. కేవలం పూర్వీకులను సంతోషపెట్టే పనులు చేస్తారు. వారికి తర్పణాలు వదులుతారు.
ఈ సంవత్సరం పితృ పక్షం సమయంలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రెండూ జరుగుతున్నాయి. అమావాస్య నాడు సూర్యగ్రహణం, పౌర్ణిమ నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇంతకుముందు మార్చి, ఏప్రిల్‌లో సూర్య, చంద్ర గ్రహణాలు రెండూ సంభవించాయి. అయితే ఇవి భారత్ లో మాత్రం కనిపించలేదు.
మార్చిలో హోలీ నాడు చంద్రగ్రహణం ఏర్పడగా, ఏప్రిల్‌లో సూర్యగ్రహణం ఏర్పడింది. ఏప్రిల్ సూర్యగ్రహణం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది యునైటెడ్ స్టేట్స్‌లో అత్యంత పొడవైనది. కొన్ని నిమిషాల పాటు పట్టపగలు చీకటి అలుముకుంది. కొన్నేళ్ళ తర్వాత ఇంతటి సుదీర్ఘమైన సూర్య గ్రహణం ఏర్పడింది.
ఈ ఏడాది రెండో చంద్ర గ్రహణం సెప్టెంబర్ నెలలో ఏర్పడబోతుంది. అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడనుంది. నాసా వెబ్‌సైట్ ప్రకారం సెప్టెంబర్ 18న పాక్షిక చంద్రగ్రహణం ఉంటుంది. దీన్ని పెనుంబ్రల్ చంద్రగ్రహణంగా పిలుస్తారు. ఇది అమెరికా, యూరప్, ఆఫ్రికాలో కనిపిస్తుంది. దీని తరువాత తదుపరి చంద్రగ్రహణం 14 మార్చి 2025 న జరుగుతుంది.
సెప్టెంబర్ 17 నుండి శ్రాద్ధం ప్రారంభమవుతుంది. ఈ గ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. ఇది కాకుండా శ్రాద్ధ పక్ష అమావాస్య రోజున అంటే అక్టోబర్ 2వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే రెండు గ్రహణాలు భారతదేశంలో కనిపించవు. అందువల్ల ఈ రెండు గ్రహణాలకు భారతదేశంలో ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు. అందువల్ల వీటికి సంబంధించిన సూతక్ కాలం పరగణించరు.
టైమ్ అండ్ డేట్ వెబ్‌సైట్ ప్రకారం పాక్షిక చంద్రగ్రహణం ఎప్పుడు మొదలవుతుంది? ఎంతకాలం కొనసాగుతుంది ఇక్కడ చదవండి.
పెనుంబ్రల్ గ్రహణం 18 సెప్టెంబర్- 00:41:07 18 సెప్టెంబర్, 06:11:07 ప్రారంభమవుతుంది.
పాక్షిక గ్రహణం సెప్టెంబర్ 18న ప్రారంభమవుతుంది - 02:12:58 సెప్టెంబర్ 18, 07:42:58
గరిష్ట గ్రహణం 18 సెప్టెంబర్- 02:44:18 18 సెప్టెంబర్, 08:14:18
పాక్షిక గ్రహణం సెప్టెంబర్ 18 - 03:15:38 సెప్టెంబర్ 18, 08:45:38 ముగుస్తుంది
పెనుంబ్రల్ గ్రహణం సెప్టెంబర్ 18- 04:47:27 సెప్టెంబర్ 18న ముగుస్తుంది, 10:17:27
(నిరాకరణ - ఈ సమాచారం మత విశ్వాసాలు మరియు లౌకిక విశ్వాసాలపై ఆధారపడింది, ఇది సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే అందించబడింది. వాటిని అంగీకరించే ముందు, నిపుణుడిని సంప్రదించండి)