Pind daan: పిండ ప్రదానాలు చేసేందుకు గయా ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకుంటారు?-why pind daan ritual is performed in gaya of bihar ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Pind Daan: పిండ ప్రదానాలు చేసేందుకు గయా ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకుంటారు?

Pind daan: పిండ ప్రదానాలు చేసేందుకు గయా ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకుంటారు?

Gunti Soundarya HT Telugu
Jan 27, 2024 09:00 AM IST

Pind daan: పూర్వీకులకి తర్పణాలు వదలడానికి చాలా మంది బీహార్ లోని గయా ప్రాంతానికి వెళతారు. అక్కడికి ఎందుకు వెళ్ళి తర్పణాలు వదులుతారంటే..

గయాలో పిండ దానాలు ఎందుకు చేస్తారు?
గయాలో పిండ దానాలు ఎందుకు చేస్తారు? (pixabay)

Pind daan: హిందూ సంప్రదాయాలలో పిండ ప్రదానానికి అపారమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఆచారంలో పూర్వీకులని తలుచుకుంటూ, మరణించిన వారి ఆత్మలకి శాంతి చేకూరాలని కోరుకుంటూ పిండ ప్రదానం చేస్తారు. ఎక్కువ మంది పిండ దానం చేసేందుకు బీహార్ లోని గయా ప్రదేశానికి వెళతారు. అక్కడకి ఎందుకు చేస్తారో తెలుసా?

పిండ దానం అంటే ఏంటి?

పిండ ప్రదానం అనేది హిందువుల ఆచారం. మరణించిన తమ సొంత వారికి, పూర్వీకులకి నివాళులు అర్పించడం చేస్తారు. పిండ్ అంటే అన్నాన్ని గుండ్రంగా ముద్దగా చేసి వాటి మీద నువ్వులు వంటి ఇతర పదార్థాలు వేస్తారు. ఈ ఆచారం పాటించడం వల్ల మరణించిన వారికి కుటుంబ సభ్యుల ఆత్మకి శాంతి, మోక్షం పొందటంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఇలా చేస్తే పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తాయని విశ్వసిస్తారు. ఈ ఆచారం ఆధ్యాత్మిక శ్రేయస్సుని ఇస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం పూర్వీకుల ఆరాధనకి అంకితమైన పితృ పక్ష కాలం వంటి నిర్ధిష్ట సమయాల్లో నిర్వహించబడుతుంది.

గయా ఎందుకు ఎంచుకుంటారు?

శ్రీ రాముడు తన తండ్రి దశరథ మహా రాజు మరణించిన తర్వాత పిండ దానం చేసేందుకు పవిత్రమైన గయా ప్రదేశానికి వచ్చారని నమ్ముతారు. ఇతిహాసం ప్రకారం రామాయణంతో ఈ ప్రదేశానికి ముడిపడి ఉంది. గయా విష్ణు పాద ముద్రని కలిగి ఉందని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రాంతానికి మతపరమైన ప్రాముఖ్యత మరింతగా పెంచుతుంది. అందుకే యాత్రికులు కూడా తమ పూర్వీకుల పట్ల తమ కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం గయాకి తరలివస్తారు. అన్ని ఆచారాలు పాటిస్తూ పిండ దానం చేయడం వల్ల తమ ప్రియమైన వారి ఆత్మకి శాంతి చేకూరుతుందని నమ్ముతారు. పూర్వీకులని గౌరవించినట్టుగా భావిస్తారు. నిర్మలమైన పరిసరాలు, ఆధ్యాత్మిక వాతావరణం అక్కడి పవిత్రతని తెలియజేస్తుంది.

మహా భారతంతో కూడా సంబంధమే

హిందూ పురాణాల ప్రకారం పాండవుల్లో పెద్దవాడైన యుధిష్ఠిరుడు మహా భారత కాలంలో పిండ ప్రదానం చేసేందుకు గయా ప్రాంతాన్ని ఎంచుకోమని శ్రీకృష్ణుడు మార్గదర్శకం చేసినట్టు చెబుతారు. అలాగే పవిత్రమైన ఫాల్గు నది గయా మీదుగానే ప్రవహిస్తుంది. దీని ఒడ్డున పిండ ప్రదానాలు నిర్వహించడం శుభ ప్రదంగా పరిగణిస్తారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతని పెంచే శుద్ధీకరణ లక్షణాలు ఈ నదికి ఉన్నాయని భక్తుల విశ్వాసం.

పిండ ప్రదానం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు

పిండ ప్రదానంలో అన్నం, నువ్వులు, బార్లీ పిండి కలిపి గుండ్రంగా ముద్దలు చేసి పిండాలు సమర్పిస్తారు. ఇలా చేయడం అనేది మరణానంతర తర్వాత ఇలా చేస్తే వారికి సంతృప్తి ఇస్తుందని నమ్ముతారు. కొంతమంది యాత్రికులు గయాలోని ప్రేత్శిల కొండని సందర్శిస్తారు. ఇక్కడే రాముడు దశరథ మహారాజుకి పిండ దానం చేసిన ప్రదేశంగా చెబుతారు. అందుకే ఇక్కడ ఎక్కువగా పిండ ప్రదాన పూజలు జరుగుతాయి.

బ్రహ్మ కుండ స్నానం: యాత్రికులు గయాలోని పవిత్రమైన బ్రహ్మ కుండలో స్నానం చేస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల శరీరం, మనసు శుద్ధిగా పరిగణించబడుతుంది. పిండ దానం చేసే ముందు ఇక్కడ స్నానం చేయడం ఆచారం.

అక్షయవత్ వృక్ష పూజ: అక్షయవత్ వృక్షాన్ని పూజించడం సర్వ సాధారణం. ఈ పవిత్రమైన అంజూరపు చెట్టు కింద రాముడు పిండ దానం చేశాడని చెబుతారు.

ఫాల్గు నదిలో తర్పణం సమర్పించడం: యాత్రికులు ఫాల్గు నదిలో తర్పణాలు సమర్పిస్తారు. మరణించిన వారి ఆత్మల్ శాంతి కోరుతూ వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక్కడ తర్పణాలు వదిలితే మోక్షం పూర్వీకుల ఆత్మకి మోక్షం లభిస్తుంది.

Whats_app_banner