Ayodhya ram mandir: బాల రాముడు ధరించిన బంగారు ఆభరణాల ప్రత్యేకత ఏంటో తెలుసా?
Ayodhya ram mandir: అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వైభవంగా జరిగింది. ప్రత్యేక ఆభరణాలతో బాల రాముడిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
Ayodhya ram mandir: 500ఏళ్ల నాటి కల సాకారం అయ్యింది. అయోధ్య రామ మందిరంలో వేద మంత్రోచ్చారణల మధ్య బాల రాముడు కొలువు దీరాడు. బాల రాముడి దివ్య రూపం చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారు. దివ్య ఆభరణాలు, అందమైన బట్టలతో అలంకరించిన రామ్ లల్లా విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రామ్ లల్లాకి వేసిన ఆభరణాలు, వస్త్రాలకి సంబంధించిన సమాచారాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
దైవికం ఉట్టిపడే విధంగా వస్త్రాలు
ఆధ్యాత్మికత, దైవికం ఉట్టి పడే విధంగా ఆభరణాలు, వస్త్రధారణలో రాముల వారు మెరిసిపోతూ కనిపించారు. ఆధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణం, రామ చరిత మానస్, అలవందర్ స్తోత్రం వంటి గ్రంథాలలో రాముడి వైభవం ఎలా ఉంటుందో పరిశోధన చేసిన తర్వాత వాటి ఆధారంగా దివ్య ఆభరణాలు రూపొందించారు. యతీంద్ర మిశ్రా కాన్సెప్ట్ డైరెక్షన్ ప్రకారం ఈ ఆభరణాలని శ్రీ అంకుర్ ఆనంద్ సంస్థ, లక్నోలోని హర్షహైమల్ షియామ్ లాల్ జ్యూయలర్స్ రూపొందించారు.
బాల రాముడు ధరించి వస్త్రం కూడా ప్రత్యేకంగా తయారు చేయించారు. పసుపు ధోతి, ఎరుపు రంగు పతాక అంగవస్త్రాలు స్వచ్చమైన బంగారు జారీ దారాలతో అలంకరించారు. వాటి మీద విష్ణువు చిహ్నాలైన శంఖం, పద్మం, సుదర్శన చక్రం, నెమలి ఉన్నాయి. ఈ వస్త్రాలని అయోధ్య ధామ్ లో పని చేసిన ఢిల్లీ టెక్స్ టైల్ డిజైనర్ మనీష్ త్రిపాఠి రూపొందించారు. అయోధ్య రాముడు ధరించిన ఆభరణాలకి ఒక్కోదానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది.
కిరీటం
బాల రాముడికి పెట్టిన కిరీటం సుమారు 1.7 కిలోల బరువు ఉంటుంది. ఇందులో 22 క్యారెట్ల బంగారంతో రూపొందించారు. ఇందులో 75 క్యారెట్ల డైమండ్లు, 135 క్యారెట్ల జాంబియన్ ఎమరాల్డ్, 262 క్యారెట్ల రూబీలుతో దీన్ని తయారు చేశారు. ఐదున్నర సంవత్సరాల బాలుడికి సరిపోయే విధంగా దీన్ని రూపొందించారు. ఈ కిరీటం మధ్యలో సూర్య భగవానుడి చిహ్నం ఉంటుంది. ఉత్తర భారతదేశ సంప్రదాయంలో బంగారంతో దీన్ని తయారు చేశారు.
కుందల్
కిరీటానికి సరిపోలే విధంగా ఊ కుందల్ తయారు చేశారు. నెమలి ఆకారంలో ఉంటాయి. వీటిని కూడా బాగారం, వజ్రాలు, రూబీస్, ఎమరాల్డ్ తో అలంకరించారు.
కంఠాభరణం
బాల రాముడికి పెట్టిన కంఠాభరణం మొత్తం రాళ్ళతో పొదిగింది. దీని మధ్య భాగంలో కూడా సూర్య దేవుని బొమ్మ ఉంటుంది. ఇందులో ఎమరాల్డ్ తీగలు ఉంచారు. బంగారంతో దీన్ని తయారు చేశారు. అందులో వజ్రాలు, ఎమరాల్డ్ అమర్చారు.
కౌస్తభా మణి
బాల రాముడి గుండెల మీ ఈ మణి ఉండే విధంగా చేశారు. ఇందులో మొత్తం రూబీలు, వజ్రాలతో తయారు చేశారు. విష్ణు మూర్తి అవతారాలు అన్నింటిలోనూ ఈ మణి హారం తప్పకుండా కనిపిస్తుంది.
పాదిక
గొంతు కింద భాగంలో ఈ నెక్లెస్ పెట్టారు. వజ్రాలు, ఎమరాల్డ్, ముత్యాలు పొదిగిన హారాన్ని నాభి వద్ధ అలంకరించారు. ఐదు తీగల వజ్రం పెట్టారు. దీనికి ఒక పెద్ద పెండెంట్ జత చేశారు.
విజయమాల
ఇది మూడోది, అతి పెద్ద నెక్లెస్. బంగారం, రూబీలతో దీన్ని రూపొందించారు. విజయానికి చిహ్నంగా దీన్ని ధరింపజేశారు. వైష్ణవ ట్రెడిషన్ లో దీన్ని తప్పకుండా ధరిస్తారు. ఇందులో సుదర్శన చక్రం, తామర పువ్వు, శంఖం, మంగళ కలశం ఉంటుంది. దేవతలకి ఇష్టమైన పువ్వులు కమలం, చంపా, పారిజాతం, తులసి, కుండ గుర్తులు కూడా దీని మీద ఉన్నాయి.
కంచి
రత్నాలతో తయారు చేసిన ఈ కంచి లేదా కర్దాని మణికట్టుకి వేశారు. బంగారంతో దీని తయారు చేశారు. ఇందులోనూ వజ్రాలు, ముత్యాలు, ఎమరాల్డ్ పొదిగి ఉన్నాయి. స్వచ్చత భావాన్ని స్పురించేలా ఇందులో ఐదు చిన్న గంటలు కూడా అమర్చారు. ముత్యాలు, రూబీలు, ఎమరాల్డ్ తీగలు ఈ గంటల నుంచి వేలాడుతూ కనిపిస్తాయి.
భుజ బంద్
ఇవి రెండు చేతులకి వేశారు. బంగారం, విలువైన రత్నాలతో వీటిని రూపొందించారు.
కంగన
రాళ్ళతో చేసిన ఈ ఆభరణాలు రెండు చేతులకి వేశారు.
ముద్రిక
బంగారం, రత్నాలు, ముత్యాలతో తయారు చేసిన ఉంగరాలు పెట్టారు.
నుదుటి తిలకం
వజ్రాలు, రూబీస్ తో రూపొందించి తిలకం బాల రాముడి నుదుట పెట్టారు.
బంగారు బాణం
ఎడమ చేతిలో బంగారంతో తయారు చేసిన విల్లు, కుడి చేతిలో బాణం ఏర్పాటు చేశారు.
కాళ్ళ దగ్గర బంగారంతో తయారు చేసిన కమల పూల దండ వేశారు. వీటితో పాటు బాల రాముడి ఆడుకునేందుకు వీలుగా ఏనుగు, గుర్రం, ఒంటె, బొమ్మ బండి మొదలైన వాటిని పెట్టారు. అలాగే బాల రాముడి ట్ల మీద బంగారంతో చేసిన గొడుగు ఏర్పాటు చేశారు.