నవంబర్ నెల కార్తీకమాసం రాశిఫలాలు- పన్నెండు రాశులకు ఎలా గడుస్తుందో చూసేయండి-november month karthika masam rasi phalalu in telugu check zodiac wise horoscope prediction ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నవంబర్ నెల కార్తీకమాసం రాశిఫలాలు- పన్నెండు రాశులకు ఎలా గడుస్తుందో చూసేయండి

నవంబర్ నెల కార్తీకమాసం రాశిఫలాలు- పన్నెండు రాశులకు ఎలా గడుస్తుందో చూసేయండి

HT Telugu Desk HT Telugu
Oct 31, 2024 12:50 PM IST

నవంబర్ నెల రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. 2వ తేదీ నుంచి కార్తీకమాసం ప్రారంభం కాబోతుంది. ఈ నెల మొత్తం మేష రాశి నుంచి మీన రాశి వరకు ఎలాంటి ఫలితాలు కలుగబోతున్నాయో ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

నవంబర్ నెల రాశి ఫలాలు
నవంబర్ నెల రాశి ఫలాలు

మేష రాశి

2024 నవంబర్ మేష రాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా దృఖ సిద్ధాంత పంచాంగ గణనం ఆధారంగ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో వ్యతిరేక భావనలు ఎదురుకావచ్చు. ఆదాయం స్థిరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. క్రమంగా ఖర్చులు కూడా నియంత్రణలోకి వస్తాయి. కుటుంబ సంబంధాలు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, సమయానికి పరిష్కారం కనిపిస్తుంది. శాంతి పరిరక్షించడానికి ప్రయత్నించాలి. అనారోగ్య సూచనలు కనిపిస్తాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడితో కూడిన సమస్యలు. యోగ, ధ్యానం చేయడం ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు పదవిలో మార్పులు లేదా ప్రాజెక్టులలో జాప్యాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కానీ సమర్థతతో ముందుకు సాగితే మంచి అవకాశాలు రావచ్చు. ఖర్చులను నియంత్రించాలి. పొదుపు పథకాలు లేదా పెట్టుబడులలో చురుకుగా పాల్గొంటే భవిష్యత్తుకు బలమైన స్థిరత్వం ఏర్పడుతుంది. శ్రీ హనుమంతునికి నెయ్యాభిషేకం చేయడం, హనుమాన్ చాలీసా పఠించడం ఉపయోగకరం. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుని ఒత్తిడి తగ్గించుకోవడం అవసరం.

వృషభ రాశి 

వృషభ రాశి వారికి నవంబర్ నెల ఉన్నతి కలుగును. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు చేయగలరు, కానీ రిస్క్ తక్కువగా ఉండే విషయాల్లోనే దృష్టి పెట్టడం మంచిది. శని, బృహస్పతి గ్రహాల ప్రభావం వల్ల ఖర్చులు పెరగవచ్చు, అందువల్ల ఆర్థిక యోచనతో ముందుకెళ్లాలి. ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తి అవుతాయి, కానీ కొన్ని అనుకోని సమస్యలు ఎదురవొచ్చు.ఈ నెలలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ అవసరం. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం, యోగా వంటి పద్ధతులు దోహదపడతాయి. ప్రాథమిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు, ఎందుకంటే వాటి ప్రభావం పీడకరంగా మారవచ్చు. శుక్రవారం దేవాలయాన్ని సందర్శించడం, పసుపు, కుంకుమ లేదా గోధుమల దానం చేయడం శుభప్రదం. పసుపు రంగు వస్త్రాలు ధరించడం ఆర్థికాభివృద్ధికి ఉపకరిస్తుంది. సత్యనారాయణ వ్రతం నిర్వహించడం శుభప్రదం.

మిథున రాశి

నవంబర్ 2024 మిథున రాశి కొంత సవాళ్లు ఎదురవుతాయి, కానీ నిర్దిష్ట మార్గదర్శకాలు పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. వృత్తి, ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాల్లో పరిణామాలు మిశ్రమంగా ఉంటాయి. వృత్తి రంగంలో ముందుకెళ్లే అవకాశం ఉంది, కానీ నిర్ణయాలను వేగంగా తీసుకోకుండా చర్చించిన తర్వాతే ముందడుగు వేయడం మంచిది. వ్యాపార సంబంధిత నిర్ణయాల్లో కొత్త భాగస్వామ్యాలు లేదా ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం కానే కాదు. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. ఖర్చులను నియంత్రించి, పొదుపు చర్యలు చేపట్టడం మంచిది. అప్పులపై ఎలాంటి ఒత్తిడులు తీసుకోకూడదు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం బలమైన ప్రాధాన్యం పొందుతుంది. ఆదిత్య హృదయం పఠించడం, రోజూ ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యారాధన చేయడం ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. వినాయకుడి పూజతో సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.దుర్గామాత లేదా కాళీ అమ్మవారి పూజ చేయడం వల్ల రాహు గ్రహం నుంచి కలిగే దోషాలు తక్కువ అవుతాయి.

కర్కాటక రాశి 

కర్కాటక రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశముంది. పుణ్య క్షేత్రాలు దర్శిస్తారు. ఆలయాలను దర్శిస్తారు. పాత బాకీ చెల్లింపులు వస్తాయి. తోటివారి నుంచి సహాయం అందుతుంది. వృత్తి విషయాలలో పురోగతి ఉంటుందని సంకేతాలు ఉన్నాయి. కొత్త పనులు చేపట్టవచ్చు. నడుము లేదా ఎముకల సమస్యలు ఉంటే జాగ్రత్తగా చూడండి. వ్యాయామం చేయడం మంచిది. ఈ నెలలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పాజిటివ్ మార్పులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలను పెంచడానికి మంచి సమయం. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. వైద్యుడితో క్రమంగా తనిఖీ చేయించుకోండి. గురువారం పసుపు లేదా కుంకుము దానం చేయడం. వేంకటేశ్వర స్వామిని పూజించడం. శనికి తైలాభిషేకం చేసుకోండి. సోమవారం శివాలయ దర్శనం అభిషేకం శుభ ఫలితాలు ఇస్తారు.

సింహ రాశి

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుగొంటారు. కొత్త ఆర్థిక అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మోసాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో బంధాలు పెరుగుతాయి. సందడితో సమయం గడపడం సంతోషాన్ని ఇస్తుంది.ఆరోగ్యం సాధారణంగా మెరుగ్గా ఉంటుంది, కానీ మీరు మీ ఆహారాన్ని శ్రద్ధగా పర్యవేక్షించాలి. నూతన అవకాశాలు వస్తాయి, కానీ నమ్మకానికి సరైన వ్యక్తులతో సంబంధాలు మెరుగుపర్చండి. కుటుంబ సభ్యులతో గొప్ప సమయాన్ని గడుపుతారు, వివాహ సంబంధాలలో మంచి మార్పులు ఉంటాయి ప్రణాళికలలో జాగ్రత్తలు తీసుకోండి, అలాగే పొదుపు చేయడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం కొంచెం అసాధారణంగా ఉండొచ్చు, కాబట్టి ప్రత్యేకంగా ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. నదీ స్నానాలు, పూజలు చేయడం ద్వారా శుభ ఫలితాలు వస్తాయి. సింహ రాశి వారికి రుద్రాక్ష ధారణ చేయడం మంచిది. ఆదిత్య హృదయం పఠించడం, రోజూ ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యారాధన చేయడం ఆరోగ్యం మెరుగుపరుస్తుంది.

కన్యా రాశి 

కన్యా రాశి వారికి నవంబర్ నెలలో కొత్త అవకాశాలు, ప్రమోషన్ సాధించగలరు. అదనపు ఆదాయాలు వస్తాయి. కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, జాగ్రత్త అవసరం. కుటుంబసభ్యులతో స్నేహభావం పెరగబోతుంది.పెట్టుబడులు చేయడం మంచిది. ప్రాజెక్టులలో మంచి పురోగతి. ఆరోగ్యానికి మరింత శ్రద్ధ. నవంబర్ 2024 కన్య రాశి వారికి కొత్త స్నేహితులు సంపాదిస్తారు. స్త్రీ సౌఖ్యం ఆనందం పొందారు. వ్యాపారభివృద్ధి కలుగును. పుణ్య క్షేత్రాలు దర్శిస్తారు. ఆలయాలను దర్శిస్తారు. గురు దక్షిణమూర్తి స్తోత్రాన్ని  పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం మంచిది. కనకధార స్తోత్రం పఠించండి.

తులా రాశి

నవంబర్ 2024 కన్య రాశి ఫలప్రదమైన ఆదాయాలు, కానీ ఖర్చులను నియంత్రించాలి. గురు బలం లేకపోవుట చేత ఆరోగ్యంనందు జాగ్రత్త వహించాలి. నరఘోష అధికమముగా ఉండును. కార్యదక్షత పెరుగుతుంది, కొత్త అవకాశాలు వస్తాయి. చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, జాగ్రత్త తీసుకోండి. కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయి. ఆదాయాలు మెరుగుపడతాయి, కానీ ఖర్చులను పర్యవేక్షించండి. నూతన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి, చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. పుణ్య క్షేత్రాలు దర్శిస్తారు. దత్తాత్రేయ ఆలయ దర్శనం, దక్షిణామూర్తి ఆలయ దర్శనం శుభఫలితాలను అందించును.

వృశ్చిక రాశి

నవంబర్ 2024 వృశ్చిక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగును. అర్థాష్టమి శని ప్రభావం, రవి బుధ ప్రభావం వలన సమస్యలు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులు నిర్లక్ష్యం చేయకండి. కొత్త అవకాశాలు, మీ ప్రతిభను ప్రదర్శించండి. కుటుంబం మరియు స్నేహితులతో కలసి సమయం కేటాయించండి. కొన్ని కొత్త పెట్టుబడులు చేయాలని ఆలోచించండి. మీ కష్టానికి బహుమతి దక్కవచ్చు. మానసిక శాంతి పెరుగుతుంది. వేంకటేశ్వర స్వామిని పూజించడం. శనికి తైలాభిషేకం చేసుకోండి. సోమవారం శివాలయ దర్శనం అభిషేకం శుభ ఫలితాలు ఇస్తారు. మందపల్లి క్షేత్ర దర్శనం మంచిది. శనికి తైలాభిషేకం నిర్వహించండి. నవగ్రహ ఆలయాలలో ప్రదక్షణ మంచిది.

ధనుస్సు రాశి

నవంబర్ 2024 ధనుస్సు రాశి వారికి ఆర్థిక స్థితి సానుకూలంగా ఉంటుందని ఆశించవచ్చు. కొత్త వ్యాపార అవకాశాలు మీకు లాభాలు తెచ్చే అవకాశం ఉంది.మీ నైపుణ్యాలు మెరుగుపరచండి, ఇది ప్రోత్సహించబడుతుంది. మీ పనిలో ఒత్తిడిని తగ్గించుకోవాలని ప్రయత్నించండి. నవంబర్ 2024 శని మూడవ ఇంట్లో ఉండటం వల్ల ఈ నెలలో మంచి ఫలితాలు ఉండవచ్చు. దీని కారణంగా మీరు మీ కెరీర్‌కు సంబంధించి మంచి ఫలితాలను పొందవచ్చు. ప్రమోషన్, ఇతర ప్రోత్సాహకాలను పొందవచ్చు. మీరు పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు రావచ్చు. మూడవ ఇంటిలో శని స్థానం కారణంగా మీరు సంకల్పం, ధైర్యాన్ని పొందగలుగుతారు. గురు దక్షిణ మూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం మంచిది. కనకధార స్తోత్రం పఠించండి.

మకర రాశి

నవంబర్ 2024 మకర రాశి రాహువు స్థానం అనుకూలంగా ఉంది. బృహస్పతి ఐదవ ఇంట్లో ఉండడం రవి బుధ శుక్రుల అనుకూలత వలన ఈ మాసం మీకు శుభ ఫలితాలు కనపడుతుంది. కుటుంబంలో మరింత ఆనందం, మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధం కలుగును. ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయ వనరులు స్థిరంగా ఉండినా, వ్యయాలపై నియంత్రణ అవసరం ఉంటుంది. మీ కృషి గుర్తింపు పొందే అవకాశం ఉంది, కానీ కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒత్తిడి కారణంగా నిద్రలేమి, మానసిక ప్రశాంతతపై ప్రభావం పడవచ్చు. శనికి తైలాభిషేకం చేసుకోండి. 

కుంభ రాశి

నవంబర్ 2024 కుంభ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగును. వ్యయాలపై జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరుగుతున్నా, కొన్ని కొత్త ఆదాయ వనరులు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్థులకు పదోన్నతులు లేదా కొత్త అవకాశాలు రావచ్చు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఒత్తిడి, అలసట తగ్గించేందుకు విశ్రాంతి అవసరం. కుటుంబంలో స్వల్ప గొడవలు ఉంటే వాటిని పరిష్కరించాలి. శనివారం రోజున శనీశ్వరునికి పూజ చేయడం మంచిది. దానం చేయడం శుభాన్ని తీసుకొస్తుంది. కుంభ రాశి అప్పు చేయదు మరియు అప్పు ఇవ్వదు అని సూచన.శనివారం శనికి తైలాభిషేకం చేయండి. దశరధ ప్రోక్త శని స్తోత్రం పఠించండి. 

మీన రాశి

నవంబర్ 2024 మీన రాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగును. కుటుంబ సౌక్యం ఆనందం కలుగును. ఆదాయం మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ ఖర్చులు నియంత్రించాలి. అప్పులు తిరిగి చెల్లించేందుకు అనుకూలమైన సమయం. కెరీర్‌లో మళ్లీ ఉత్సాహం పొందుతారు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. ఆరోగ్యపరమైన శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది. వివాహానికి సంబంధించి కొన్ని మంచి అవకాశాలు రాగలవు. గురువారం రోజు దానధర్మాలు చేయడం శ్రేయస్కరం. పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభం. శనికి తైలాభిషేకం చేసుకోండి.

అందించిన వారు: ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ 

Whats_app_banner