Mercury retrograde: నవంబర్ 27 నుంచి ఈ మూడు రాశుల వారికి కొద్దిరోజులు కష్టకాలమే, నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి-mercury will be retrograde in scorpio difficulties of these 3 zodiac signs will increase ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mercury Retrograde: నవంబర్ 27 నుంచి ఈ మూడు రాశుల వారికి కొద్దిరోజులు కష్టకాలమే, నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి

Mercury retrograde: నవంబర్ 27 నుంచి ఈ మూడు రాశుల వారికి కొద్దిరోజులు కష్టకాలమే, నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి

Gunti Soundarya HT Telugu

Mercury retrograde: గ్రహాల రాకుమారుడు బుధుడు ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో తిరోగమన దశలోకి వెళ్లబోతున్నాడు. దీని వల్ల మూడు రాశుల వారికి కష్టకాలం రాబోతుంది. ఉద్యోగం, వ్యాపారంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించుకోవాలి.

బుధుడి తిరోగమనం

జ్యోతిష్యంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. అక్టోబర్ 29న గ్రహాల రాకుమారుడు బుధుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి పెను మార్పులు వస్తాయి. 

బుధుడు మేధస్సు, తర్కం, కమ్యూనికేషన్, గణితం, తెలివి మరియు స్నేహానికి బాధ్యత వహించే గ్రహంగా చెప్తారు. బుధుడిని యువరాజు అంటారు. బుధుడు శుభంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తికి శుభ ఫలితాలు లభిస్తాయి. అయితే బుధుడు అశుభంగా ఉన్నప్పుడు అతను అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. నవంబర్ 27 నుంచి బుధుడు వృశ్చిక రాశిలో తిరోగమన దశలో సంచరించబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మేషం 

బుధుడి తిరోగమనం కారణంగా మేష రాశి వారికి వృత్తి, వ్యక్తిగత జీవితంలో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. పని, వ్యాపారంలో వాతావరణం మీకు తక్కువ అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రణాళికలతో పనులు ప్రారంభించకపోవడం మంచిది. చేసే పనులలో ఆటంకాలు ఎదురుకావచ్చు. దీని వల్ల తీవ్ర నిరాశకు గురవుతారు. వివాదాల పరిస్థితులకు దూరంగా ఉండండి. మీ ప్రసంగంలో మాధుర్యాన్ని కొనసాగించండి. లేదంటే ఎదుటి వాళ్ళ మనసు మీ మాటల వల్ల గాయపడుతుంది. వాతావరణంలో మార్పు కుటుంబంలోని ఒకరి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వాహనాలు, యంత్రాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వహించాలి.

ధనుస్సు 

బుధుడి తిరోగమనం కారణంగా మీ కార్యాలయంలో, వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు మీకు తక్కువ అనుకూలంగా ఉంటాయి. అదృష్టం చాలా అరుదుగా మీ వైపు ఉంటుంది. సహోద్యోగులతో ఏదో ఒక విషయంలో వాగ్వాదం రావచ్చు. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు ఉన్నాయి, కానీ అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. ఏదైనా ఒప్పందం చేసుకునే ముందు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులకు అవకాశాలు రావచ్చు. మానసికంగా కలత చెందవచ్చు. ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరగవచ్చు. వాహనాలు, యంత్రాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

మీనం 

బుధుడి తిరోగమనం కారణంగా మీన రాశి వారికి ఉద్యోగం చేసే ప్రదేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. పెట్టుబడులు పెట్టె వాళ్ళు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త బాధ్యతలు స్వీకరించవచ్చు. ప్రమాదకర విషయాల్లో నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేయండి. లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు మీకు తక్కువ అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో లాభదాయక అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించాలి. వివాద పరిస్థితులు తలెత్తవచ్చు. ఉదర వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. 

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.