Sun Transit: సూర్యుడి వృశ్చిక రాశి ప్రవేశం ఈ రాశుల వారికి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది- జాగ్రత్తగా ఉండండి!-suns entry into scorpio will bring trouble to the people of these signs be careful ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Transit: సూర్యుడి వృశ్చిక రాశి ప్రవేశం ఈ రాశుల వారికి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది- జాగ్రత్తగా ఉండండి!

Sun Transit: సూర్యుడి వృశ్చిక రాశి ప్రవేశం ఈ రాశుల వారికి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది- జాగ్రత్తగా ఉండండి!

Ramya Sri Marka HT Telugu
Nov 16, 2024 11:40 AM IST

Sun Transit: జ్యోతిషశాస్త్రంలో సూర్యభగవానుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యదేవుడిని అన్ని గ్రహాలకు రాజు అంటారు. ఈరోజు నవంబర్ 16 సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. వృశ్చిక రాశిలో సూర్యుని ప్రవేశం కొన్ని రాశులకు అత్యంత శుభదాయకంగా ఉంటుంది. అలాగే కొన్ని రాశులకు ఇబ్బందులు తెచ్చిపడుతుంది.

sun transit
sun transit

జ్యోతిషశాస్త్రంలో సూర్యభగవానుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యదేవుడిని అన్ని గ్రహాలకు రాజు అంటారు. సూర్యభగవానుడు నవంబర్ 16న ఈ రోజున సూర్యభగవానుడు తులా రాశి నుండి వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు. వృశ్చిక రాశిలో సూర్యుని ప్రవేశం వల్ల కొన్ని రాశుల వారు ప్రయోజనం పొందుతారు. అలాగే మరికొన్ని రాశుల వారు ఈ నెలంతా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వృశ్చిక రాశిలోకి సూర్యభగవానుడి ప్రవేశం ఏయే రాశుల వారిని ఇబ్బందుల పాలు చేస్తుందో చూద్దాం.

మేష రాశి :

వృశ్చిక రాశిలోకి సూర్యుడి ప్రవేశం మేష రాశి వారిలో ప్రశాంతాలోపాన్ని తీసుకొస్తుంది. వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో శారీరక సౌలభ్యం పెరుగుతుంది. అయినప్పటికీ విరలో ఈ నెలంతా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. తండ్రికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కుటుంబంతో కలిసి ధార్మిక ప్రదేశానికి యాత్రకు వెళ్లవచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. సంయమనం పాటించండి.

వృషభ రాశి :

ఈ రాశి వారికి కార్యాలయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. క్షణాల పాటు కోపం, బుజ్జగింపు భావాలు కలుగుతాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక ఆచూతూచీ అడుగులు వేయాల్సి ఉంటుంది.

మిథునం:

వృశ్చిక రాశిలోకి సూర్యుడి ప్రవేశం మిథున రాశి వారిని ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బంది పెడుతుంది. జీవిత భాగస్వామితో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. మానసిక ప్రశాంతత ఉంటుంది. కొందరు పాత మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి.

కన్య:

మనస్సు కలత చెందుతుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. మీరు కుటుంబానికి దూరంగా ఉండవలసి ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆశ, నిరాశ అనే మిశ్రమ భావాలు మనసులో ఉండిపోతాయి. పిల్లలు బాధపడతారు. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. అమ్మ దగ్గర డబ్బులు పొందొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అకడమిక్ పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తులా రాశి:

ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది. అయినా మనసు కలత చెందుతుంది. కోపంతో కూడిన క్షణాలకు మానసిక స్థితి ఉంటుంది. స్వీయ నియంత్రణతో ఉండండి. వ్యాపారంలో సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి విషయంలో వివాదం తలెత్తవచ్చు.

వృశ్చికం:

కార్యాలయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. మాటల్లో కఠినత ప్రభావం ఉంటుంది. సంభాషణలో సమతూకం పాటించండి. మనసు అశాంతిగా ఉంటుంది. మితిమీరిన కోపాన్ని నివారించండి. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. తండ్రికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కుటుంబానికి దూరంగా ఉండవచ్చు.

ధనుస్సు రాశి:

మనస్సులో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రతికూల ఆలోచనలు ప్రభావం చూపుతాయి. స్వీయ నియంత్రణతో ఉండండి. మితిమీరిన కోపాన్ని నివారించండి. జీవిత భాగస్వామితో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. అసౌకర్య జీవనం ఉంటుంది. వ్యాపార విస్తరణకు ఖర్చులు పెరుగుతాయి.

కుంభం:

సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఖర్చులు పెరుగుతాయి. మనసులో నెగిటివిటీ ప్రభావం ఉంటుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. తీపి ఆహారం వైపు మొగ్గు పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు తలెత్తుతాయి. పిల్లలు బాధపడతారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner