Ketu transit: కేతువు సంచారం.. రానున్న 9 నెలలు ఈ రాశులకు వరం లాంటి సమయం-ketu transit in kanya rashi next nine months these zodiac signs sees wonders ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ketu Transit: కేతువు సంచారం.. రానున్న 9 నెలలు ఈ రాశులకు వరం లాంటి సమయం

Ketu transit: కేతువు సంచారం.. రానున్న 9 నెలలు ఈ రాశులకు వరం లాంటి సమయం

Gunti Soundarya HT Telugu
Published Mar 11, 2024 10:09 AM IST

Ketu transit: అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహాలలో కేతువు ఒకటి. ప్రస్తుతం కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. ఫలితంగా రానున్న 9 నెలలు ఈ రాశుల వారి అదృష్టానికి తిరుగే ఉండదు.

కేతువు సంచారంతో అదృష్టం పొందే రాశులు ఇవే
కేతువు సంచారంతో అదృష్టం పొందే రాశులు ఇవే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతువు నీడ గ్రహంగా పేర్కొంటారు. అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహాలలో కేతువు ఒకటి. ఎప్పుడు తిరోగమన దిశలోనే సంచరిస్తుంది. గతేడాది అక్టోబర్ 30న కేతువు కన్యా రాశిలోకి ప్రవేశించాడు. ఈ ఏడాది మొత్తం కన్యా రాశిలోనే సంచరిస్తాడు. కేతువు సంచార ప్రభావం కొన్ని రాశుల వారికి సానుకూల ప్రభావాలు ఇస్తే మరికొన్ని రాశులకు కష్టాలు కలిగిస్తుంది.

కేతువు ప్రతికూల ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో అశాంతి వాతావరణం నెలకొంటుంది.చట్టపరమైన సమస్యలతో ఇబ్బందులు పడతారు. 2025 మే నెలలో కన్యా రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. కేతువు కదలిక కొన్ని రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. రానున్న తొమ్మిది నెలలు కన్యా రాశిలో కేతువు ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. కేతు సంచారంతో ఏయే రాశుల వారికి అదృష్టం వరించబోతుందో తెలుసుకుందాం.

మేష రాశి

కేతు సంచారం మేష రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. చేపట్టే అన్ని ప్రయత్నాలలో విజయం సాధిస్తారు, ఈ సమయంలో మీకు పని చేసేందుకు అనేక అవకాశాలు ఎదురవుతాయి. జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. ధైర్యంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు పాటిస్తూ పోషకాహారం తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటారు. వ్యాపారంలో మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తారు. ఫలితంగా మీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు దొరుకుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కెరీరి పుంజుకుంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ధృఢంగా ముందుకు సాగుతారు.

వృశ్చిక రాశి

కేతు గ్రహ సంచారం వృశ్చిక రాశి జాతకులు ఎంతో ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయం మీకు చాలా ఉత్పాదకంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి, లాభదాయకమైన ఒప్పందాలు చేసుకుంటారు. కేతు అనుకూల ప్రభావంతో ఆగిపోయిన పనులు ప్రారంభం అవుతాయి. డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. తెలివితేటలు ఉపయోగించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఈ సమయంలో ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. మీ సామర్థ్యాలు, నైపుణ్యాలను గుర్తిస్తారు. పెట్టుబడులు పెడితే మంచి లాభాలు పొందుతారు. డబ్బు ఆదా చేయడంతో విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి కేతు సంచారం అత్యంత అదృష్టాన్ని ఇస్తుంది. మీరు సాధించాలనుకున్న లక్ష్యాలను ఈ సమయంలో విజయవంతంగా చేరుకుంటారు. అత్యుత్తమ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే మీ ఆశయం ఈ సమయంలో నెరవేరుతుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కొత్త పనిని ప్రారంభించేందుకు అనువైన సమయం. తోబుట్టువులతో ఏర్పడిన భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కేతువు సంచరిస్తున్న సమయంలో మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.

Whats_app_banner