Ganga jalam: గంగాజలాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నారా? అయితే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే
Ganga jalam: చాలా మంది పవిత్రమైన గంగాజలాన్ని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటారు. అయితే ఇంట్లో గంగా జలం ఉంచుకోవాలంటే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
Ganga jalam: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు గంగా జలం చాలా పవిత్రమైనది, ఆధ్యాత్మికమైనది, స్వచ్ఛమైనదిగా భావిస్తారు. గంగా జలానికి ఎంతో గౌరవం ఇస్తారు. సాధారణ నీటి వనరులలో లేని శుద్ధీకరణ సామర్థ్యాలు గంగాజలానికి ఉన్నాయని కొన్ని అధ్యయనాలు కూడా రుజువు చేశాయి.
దైవిక గుణాలను కలిగి ఉన్న గంగా జలాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పెట్టుకోవాలని అనుకుంటారు. పాపాలను కడిగి వేయగల శక్తి గంగా జలానికి ఉందని నమ్ముతారు. అందుకే చాలామంది ఇంట్లో గంగా జలం భద్రపరుచుకుంటారు. అయితే ఈ పవిత్రమైన జలాన్ని ఇంట్లో ఉంచుకునేటప్పుడు కొన్ని పనులు చేయకూడదు అవి ఏమిటో తెలుసుకుందాం.
తామసిక ఆహారాన్ని పరిమితం చేయాలి
గంగా నది నుంచి తీసుకువచ్చిన గంగా జలం స్వచ్చతకు ప్రతిరూపం. అందుకే ప్రజలందరూ దీన్ని చాలా గౌరవిస్తారు. ఈ స్వచ్ఛతను నిలబెట్టేందుకు గంగా జలాన్ని సాత్వికంగా పరిగణించాలి. స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. తామసిక ఆహారాన్ని ముఖ్యంగా మాంసాహారాన్ని గంగా జలం ఉంచే ప్రదేశానికి దూరంగా ఉంచాలి. గంగా జలం ఉంచిన గదిలో మాంసాహారం తినడం అపవిత్రంగా పరిగణిస్తారు. ఇది గంగాజలం పవిత్రతకు విరుద్ధంగా ఉంటుంది. అందుకే అటువంటి ఆహారాన్ని గంగా జలంఉన్న ప్రదేశంలోకి పొరపాటున కూడా తీసుకురాకూడదు.
ప్లాస్టిక్ సీసాలో ఎప్పుడూ ఉంచుకోకూడదు
ప్రజలు తమతో పాటు పెద్ద పెద్ద ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ని తీసుకువెళ్లి గంగా జలాన్ని నింపి ఇంటికి తెచ్చుకుంటారు. అయితే ఈ పద్ధతి చాలా తప్పు. ప్లాస్టిక్ బాటిల్ లో గంగా జలం నిల్వ చేయడం మానుకోవాలి. ఎందుకంటే ప్లాస్టిక్ నీటిలోకి రసాయనాలను చేరవేస్తుంది. ఇది దాన్ని స్వచ్చతను దెబ్బతీస్తుంది. పర్యావరణానికి హానిచేస్తుంది. అందువల్ల సంప్రదాయ బద్ధమైన రాగి, వెండి లేదా గాజు పాత్రలలో గంగా జలాన్ని నిల్వచేసుకోవాలి. ముఖ్యంగా రాగి పాత్రలో గంగా జలాన్ని ఉంచడం వల్ల యాంటీ మైక్రోబయల్ లక్షణాలు మెరుగుపడతాయి. ఈ నీటి ప్రయోజనాలు మరింత మెరుగవుతాయి.
మురికి చేతులతో తాకకూడదు
గంగాజలాన్ని మురికిగా ఉన్న చేతులతో తాకకూడదు. అలా చేయడం వల్ల నీటి స్వచ్ఛతను అగౌరవపరిచినట్టు అవుతుంది. మలినాలు కూడా చేరతాయి. అందుకే మీరు పాత్రను లేదా బాటిల్ ని తాకడానికి ముందు మీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
ఈ గదుల దగ్గర పెట్టకూడదు
గంగా జలాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దానిని సరైన స్థలంలో ఉంచడం కూడా చాలా ముఖ్యం. నిపుణులు, పెద్దలు చెప్పే దాని ప్రకారం గంగాజలాన్ని ఎప్పుడు టాయిలెట్ లేదా బెడ్ రూమ్ దగ్గర ఉంచుకోకూడదు. మరుగుదొడ్లు అపరిశుభ్రమైన ప్రదేశాలు. వ్యర్ధాలు, సూక్ష్మ క్రిములకు నిలయంగా ఉంటాయి. అందువల్ల గంగా జలాన్ని వాటికి దగ్గరగా ఉంచడం వల్ల అది కూడా అపవిత్రం అవుతుంది. అది ఉంచిన పాత్రవైపులను సూక్ష్మక్రిములను ఆకర్షిస్తుంది. అలాగే పడకగది దగ్గర కూడా ఉంచకూడదు. ఇది అగౌరవంగా పరిగణిస్తారు. అలా ఎప్పటికీ చేయకూడదు.
ఎక్కువ రోజులు స్తబ్దుగా ఉంచకూడదు
గంగా ప్రవాహం శక్తికి ప్రసిద్ధి చెందింది. హరిద్వార్ నుంచి రిషికేశ్ వరకు గంగా ప్రవాహం ఉంటుంది. పాపాలను కడిగి వేస్తుంది. అందుకే గంగాజలాన్ని ఎక్కువ కాలం స్తబ్దుగా ఉంచకూడదు. చాలా కాలం పాటు తాజాగా ఉండే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందినప్పటికీ నిలిచిపోయిన నీరు నాచు లేదా ఫంగస్ ని అభివృద్ధి చేస్తుంది. ఇది దానికి స్వచ్ఛతను ప్రభావితం చేస్తుంది.
అవసరం లేకుండా గంగాజలం ఉపయోగించకూడదు
ఇటువంటి ప్రయోజనంలో లేకుండా గంగా జలాన్ని తాకడం లేదా ఇంటి చుట్టూ చల్లడం వంటిది అసలు చేయకూడదు. అందరూ గంగాజలాన్ని చాలా గౌరవిస్తారు. సాధారణమైన మంచి నీళ్లు తాగినట్లు గంగా జలం తాగకుండా ఉండటం చాలా ముఖ్యం. ఈ పాత్రను తాకడానికి ముందు మీ మనసులో స్పష్టమైన ఉద్దేశం ఉండాలి. ఆ తర్వాతే దానిని తీసుకోవాలి. గంగాజలాన్ని తాగే ముందు గంగాదేవికి ప్రార్థన చేయాలి.