Good Friday 2023 । గుడ్ ఫ్రైడే.. మానవాళి పాపాలను కడగటం కోసం, యేసుక్రీస్తు చేసిన తాగ్యం!
Good Friday 2023: యేసుక్రీస్తును శిలువ వేసిన రోజు 'గుడ్ ఫ్రైడే' గా పాటిస్తారు. మరి ఈ విచారకరమైన రోజును గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తారు? చరిత్ర ఏం చెబుతుందో తెలుసుకోండి.
Good Friday 2023: క్రైస్తవ మతంలో ఈస్టర్‌కు ముందు శుక్రవారం నాడు పాటించే ఒక స్మారక రోజును గుడ్ ఫ్రైడేగా చెబుతారు. ఈ ఏడాది గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 7న వచ్చింది. ఇది యేసుక్రీస్తును శిలువ వేసిన రోజు. కల్వరిలో ఆయన మరణాన్ని గుర్తుచేసుకునే క్రైస్తవ సెలవుదినం. ఈ రోజుకు జ్ఞాపకార్థంగా యేసును స్మరించుకుంటూ గుడ్ ఫ్రైడే గా పాటిస్తారు. క్రైస్తవ మత చరిత్ర గ్రంథాల ప్రకారం, గుడ్ ఫ్రైడే అనేది ఒక సంతాప దినం.
ఈ విచారకరమైన రోజును గుడ్ ఫ్రైడే అని ఎందుకు పిలుస్తారో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. గుడ్ అంటే మంచి., ఆ మంచికి ప్రతిరూపమే దేవుడు. త్యాగం చేయడం మంచి గుణం, యేసు పవిత్ర త్యాగంతో ప్రపంచంలోని మానవాళికి మంచి జరిగింది. అందుకే యేసు మంచితనాన్ని, త్యాగ నిరతిని చాటిచెప్పేందుకే ఈరోజును గుడ్ ఫ్రైడేగా పిలవడం ప్రారంభమైంది. హోలీ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే, గ్రేట్ అండ్ హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు.
క్రిస్మస్, ఈస్టర్ మాదిరిగా గుడ్ ఫ్రైడే రోజున ఎలాంటి సంబరాలు జరుపుకోరు. గుడ్ ఫ్రైడే సంతోషకరమైన సందర్భం కాదు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతం ఆచరించే వారు ఈరోజు మౌనాన్ని పాటిస్తారు. చర్చిని సందర్శిస్తారు, శుక్రవారం సేవకు హాజరవుతారు. కొందరు ఉపవాసం ఉంటారు, సంతాపం వ్యక్తం చేస్తారు. యేసుక్రీస్తు చేసిన త్యాగాలను గుర్తుచేసుకోవడానికి ఇది ఒక పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. తనను నమ్మిన వారి పాపాలను విమోచించడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన రోజుగా భావిస్తారు.
Good Friday Date and Significance- గుడ్ ఫ్రైడే తేదీ, ప్రాముఖ్యత
ఏసుక్రీస్తును శుక్రవారం నాడు శిలువ వేశారని నమ్ముతారు. ఈస్టర్ కు ముందు వచ్చే శుక్రవారాన్ని పవిత్ర దినంగా జరుపుకుంటారు. అందుకే ఈరోజును గుడ్ ఫ్రైడేగా పాటిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 7న గుడ్ ఫ్రైడే జరుపుకోనున్నారు.
తమ దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమిస్తాడని క్రైస్తవ భక్తులు నమ్ముతారు, అతను మొత్తం మానవాళి పాపాలను కడిగేందుకు తన కుమారుని జీవితాన్ని త్యాగం చేశాడు. యేసుక్రీస్తును విశ్వసించిన ప్రజల పాపాల కోసం, అతను తన జీవితాన్ని అర్పించాడు. అందుకే ఈ రోజును సంతాపం దినంగా చూస్తారు. ప్రజల పాపాల నీడల నుండి మానవాళిని రక్షించడానికి యేసు త్యాగం చేశాడు. యేసు త్యాగాలకు గుర్తుగా గుడ్ ఫ్రైడే నాడు ప్రజలు తమ శోకాన్ని తెలియజేస్తారు. ఆహారము భుజించారు, వేడుకలు జరుపుకోరు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది ఒక విచారకరమైన రోజు కాబట్టి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేయడం గానీ, హ్యాపీ గుడ్ ఫ్రైడే అనే గ్రీటింగ్ చేయడం గానీ ఈరోజు నిషేధించడమైనదిగా క్రైస్తవ మతపెద్దలు సలహా ఇస్తారు.
Good Friday History - గుడ్ ఫ్రైడే చరిత్ర
క్రీస్తును అతని శిష్యులలో ఒకరైన జుడాస్ ఇస్కారియోట్ మోసం చేశాడు, ఇది యేసుక్రీస్తును అరెస్టు చేయడానికి దారితీసింది, యేసుక్రీస్తు తనను తాను యూదుల రాజుగా ప్రకటించుకున్నందుకు దోషిగా తేలిందని సువార్త పేర్కొంది. తరువాత యేసుక్రీస్తును రోమన్ అధికారులు అరెస్టు చేసి తీవ్రంగా కొట్టారు. యేసును కనికరం లేకుండా హింసించారు, ఆయన తలకు ముళ్లకిరీటాన్ని తగిలించి చిత్రవధ చేశారు. అనంతరం ఆయన శరీరానికి పదునైన మొలలను దింపుతూ కల్వరి పర్వతాలలో శిలువ వేస్తారు. ఆ తర్వాత యేసు జీసస్ క్రీస్తుగా అవతరిస్తాడు. గుడ్ ఫ్రైడే ఈస్టర్ వారం ప్రారంభాన్ని సూచిస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్