విదేశాలకు వెళ్లాలనేది మీ కలా? అయితే ఇక్కడ బొమ్మ విమానం సమర్పిస్తే అది తీరినట్టే
విదేశాలకు వెళ్లేందుకు వీసా, పాస్ పోర్ట్ కోసం చాలా కష్టపడతారు. అవి రాకపోవడం వల్ల విదేశాలకు వెళ్లాలనే వారి కల చేదిరిపోతుంది. ఈ సమస్యల నుంచి బయట పడాలా? అయితే ఈ గురుద్వారాలో బొమ్మ విమానం సమర్పించండి. మీ కోరిక ఇట్టే నెరవేరుతుంది.
ప్రతి ఒక్కరికీ విదేశాలకు వెళ్లాలని బాగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని గడపాలని కోరిక ఉంటుంది. స్తోమత ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంత కష్టం అయినా సరే విదేశాల్లో చదివిస్తారు. మరికొందరు ఆర్థిక సమస్యలు, వీసా నిరాకరణ వంటి కారణాల వల్ల సాధ్యపడకపోవచ్చు.
ఎంత కష్టపడినా వీసా, పాస్ పోర్ట్ లో ఏదో ఒక చిక్కుల వల్ల చివరి నిమిషంలో ఆగిపోతుంది. మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు, మంచి జీవితం కోసం విదేశాలకు వెళ్తుంటారు. అయితే వీసా వంటి సమస్యల వల్ల ఆగిపోయే వాళ్ళు ఈ ఆలయానికి వెళ్తే త్వరగా సమస్య పరిష్కారం అయిపోతుందట. అది మాత్రమే కాదు విదేశాలకు వెళ్లాలనే కల తప్పనిసరిగా నెరవేరుతుంది. ఆ ఆలయం ఎక్కడో కాదు పంజాబ్ లోని గురుద్వారా. షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారా ఇప్పుడు వీసా గురుద్వారాగా మారిపోయింది. స్థల పురాణం ప్రకారం విదేశాలకు వెళ్లాలనే కోరిక కలిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైన కానుకలు ఇచ్చి కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందట.
బొమ్మ విమానమే కానుక
విదేశాలకు వెళ్ళే వాళ్ళు తమ సమస్యలు తీరాలని కోరుకుంటూ ఇక్కడికి తరచూ వస్తుంటారు. అది మాత్రమే కాదండోయ్ ఇక్కడ అందించే కానుకలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణంగా డబ్బులు లేదా మిఠాయిలు తీసుకెళ్తుంటారు. కానీ షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారాకు వచ్చే భక్తులు మాత్రం బొమ్మ విమానాలను అందజేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కోరికకు చిహ్నంగా వీటిని గురుద్వారాకు ఇస్తారు.
తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం అనగానే గుర్తుకు వచ్చేది విమానయాన సంస్థలు బోయింగ్, విస్తారా. వీరి విదేశాలకు వెళ్లాలని అనుకునే వారి కలలు సాకారం చేస్తున్నాయి. అందుకే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆ సంస్థలకు చెందిన విమాన బొమ్మలు ఇస్తారు. అంతే కాదు బోయింగ్, ఎయిర్ ఇండియాకు చెందిన విమాన బొమ్మలు ఉన్న దుకాణాలు కూడా గురు ద్వారా ముందు దర్శనం ఇస్తాయి. వీటిని సమర్పించి మొక్కుకుంటే తప్పకుండా వీసా వస్తుందట.
ఇది ఎలా వచ్చిందంటే
ఒకప్పుడు విదేశాలకు వెళ్లడం తన కోరిక అని వీసా జారీ కోసం ఒక వ్యక్తి మొక్కుకోవడం కోసం గురుద్వారాకు వచ్చాడట. అతడి కోరిక నెరవేరితే విలువైన వస్తువులు సమర్పించడానికి మళ్ళీ తిరిగి వస్తానని అనుకున్నాడు. అలాగే అతడి కోరిక నెరవేరి విదేశాలకు వెళ్ళాడు. మొక్కుకున్నట్టుగా విలువైన వస్తువులతో పాటు ఒక బొమ్మ విమానాన్ని సమర్పించాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట చేరి ఈ వీసా గురుద్వారా గురించి అందరికీ తెలిసిపోయింది. అలా విదేశాలకు వెళ్లాలని అనుకునే వాళ్ళు ఈ షహీద్ నిహాల్ సింగ్ గురుద్వారాకు రావడం మొదలు పెట్టారు.
వీసా బాలాజీ టెంపుల్
ఇదొక్కటే ఇలాంటిది ఉంది అనుకునేరు. వీసా టెంపుల్ అని పేరు చెప్పగానే అందరి నోట వచ్చేది చిలుకూరి బాలాజీ టెంపుల్. విదేశాలకు వెళ్లాలని అనుకునే భక్తులు కూడా వీసా ఆమోదం కోసం ఈ ఆలయానికి వచ్చి స్వామి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. అందుకే ఈ ఆలయానికి వీసా టెంపుల్ అనే పేరు కూడా వచ్చింది. దీనితో పాటు ఇలాంటిదే చెన్నైలో శ్రీ లక్ష్మీ వీసా గణపతి ఆలయం కూడా ఉండి. ఇది కూడా వీసా ఆమోదాలకు ప్రసిద్ధి చెందింది. భక్తులు తమ వీసా దరఖాస్తు ప్రక్రియలో ఉన్న అడ్డంకులు తొలగించమని వేడుకుంటూ ఇక్కడ మొక్కుకుంటారు.