Visa Free Sri Lanka : ఇప్పుడు శ్రీలంకను సందర్శించడానికి మీకు వీసా అవసరం లేదు.. కొత్త రూల్
- Visa Free Sri Lanka : శ్రీలంకను సందర్శించడానికి మీకు వీసా అవసరం లేదు. శ్రీలంకలో వెళ్లేందుకు కొత్త నియమాలు తెలుసుకోండి. మెుత్తం 35 దేశాలకు వీసా లేకుండా అవకాశం కల్పిస్తుంది.
- Visa Free Sri Lanka : శ్రీలంకను సందర్శించడానికి మీకు వీసా అవసరం లేదు. శ్రీలంకలో వెళ్లేందుకు కొత్త నియమాలు తెలుసుకోండి. మెుత్తం 35 దేశాలకు వీసా లేకుండా అవకాశం కల్పిస్తుంది.
(1 / 4)
మీరు శ్రీలంకను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా? అక్టోబర్ 1, 2024 నుండి శ్రీలంక భారతీయులకు వీసా రహితంగా మారుతుంది.(Bloomberg)
(2 / 4)
వీసా లేకుండా భారతీయులు ఆరు నెలల పాటు శ్రీలంకలో ఉండొచ్చు. శ్రీలంకను సందర్శించడానికి వీసా కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. టూరిస్ట్ వీసాలు రాగానే జారీ చేస్తారు.
(3 / 4)
కొన్ని దేశాల పౌరులు ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. శ్రీలంకకు వచ్చే ముందు దరఖాస్తు చేసుకోవాలి. ఈ స్కీమ్ కింద టూరిస్టుకు 30 రోజుల ఉచిత వీసా పీరియడ్ లభిస్తుంది. ఉచిత వీసా పొంది, 30 రోజులకు మించి శ్రీలంకలో ఉండాల్సిన వారు తగిన వీసా ఫీజు చెల్లించవచ్చు. ఈ వీసా రహిత విధానం కొన్ని దేశాల పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. పర్యాటకులను ప్రోత్సహించేందుకు శ్రీలంక ఈ కొత్త విధానం పెట్టింది.
(4 / 4)
ఈ ప్రయోజనాలు పొందాలంటే ఎలాంటి డాక్యుమెంట్లు ఉండాలనేది ఇప్పుడు ప్రశ్న. అప్రూవ్డ్ పాస్పోర్ట్, రిటర్న్ టికెట్, సరిపడా నిధులు వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. అయితే భారతీయులకే కాకుండా చైనా, ఇండోనేషియా, రష్యా, థాయ్ లాండ్, మలేషియా, జపాన్ పౌరులకు కూడా వీసా రహిత ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ. మెుత్తం 35 దేశాలు ప్రయోజనం పొందుతున్నాయి.
ఇతర గ్యాలరీలు