Store room: స్టోర్ రూమ్ ఎక్కడ ఉంటే మంచిది? ఈ గదిలో ఎటువంటి ఎలాంటివి ఉంచకూడదు?
Store room: వాస్తు శాస్త్రంలో వంటగది, పడకగది, వాష్‌రూమ్, లివింగ్ రూమ్‌తో సహా అన్ని గదులకు ముఖ్యమైన వాస్తు చిట్కాలు ఉన్నాయి. ఈ వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సానుకూలత వస్తుందని నమ్ముతారు.
Store room: వాస్తు నియమాలను పాటించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. వాస్తు సరిగ్గా ఉంటే ఇంట్లో సానుకూల శక్తి ప్రసారం చేయబడుతుందని, జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తాయని నమ్ముతారు.
వాస్తు ప్రకారం వంటగది, పూజ గది, పడకగదితో పాటు అనవసరమైన వస్తువులు ఉంచే స్టోర్ రూమ్ కూడ సరైన నియమాలు ఉన్నాయి. ఇందులో ఉంచే వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే నెగటివ్ ఎనర్జీ పెరిగిపోయి ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగిపోతుంది.
అరుదుగా ఉపయోగించే వస్తువులు నిర్దిష్ట ప్రదేశంలో ఉంచబడతాయి. దీన్నే స్టోర్ రూమ్ అంటారు. ఇంట్లో కూడా ఈ గదికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎక్కువ మంది ఇందులో పనికి రాని వస్తువులు ఉంచుతారు. విరిగిపోయిన చెక్క వస్తువులు, నిరుపయోగంగా పడి ఉండే ఇనుప సామాన్లు ఉంచుతారు. కానీ ఇలా పాత ఇనుము ఎక్కువ కాలం ఉంచడం వల్ల శని ప్రభావం కూడా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ స్టోర్ రూమ్ ఏ దిశలో ఉండాలి. ఇందులో ఎలాంటి వస్తువులు ఉండాలో తెలుసుకుందాం.
స్టోర్ రూమ్ వాస్తు
వాస్తు ప్రకారం ఇంటికి నైరుతి మూలలో (నైరుతి దిశలో) స్టోర్ రూమ్ నిర్మించాలి. స్టోర్ రూమ్‌లో కనీసం ఒక కిటికీ లేదా స్కైలైట్ ఉండాలి. ఈశాన్య దిశలో, ఆగ్నేయ, దక్షిణ దిశలో నిర్మించకూడదు. ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుందని నమ్ముతారు.
వాస్తు ప్రకారం గది చాలా పెద్దదిగా ఉండకూడదు. దాని పరిమాణం చిన్నదిగా ఉండాలి. వంటగదిలో స్టోర్ రూమ్ కూడా నైరుతి దిశలో నిర్మించాలి. వాస్తులో మెట్ల క్రింద, బ్రహ్మ స్థలంగా పిలిచే ప్రదేశం వద్ద స్టోర్ రూమ్ నిర్మించడం శ్రేయస్కరం కాదు.
వాస్తు ప్రకారం బెడ్ రూమ్‌లో ఎలాంటి స్టోర్ రూమ్ వస్తువులు ఉంచకూడదు. అంతే కాకుండా స్టోర్ రూమ్ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇక్కడ ఎలాంటి అపరిశుభ్రతను వ్యాపించనివ్వవద్దు.
ఈ వస్తువులు పెట్టకండి
స్టోర్ రూమ్ కదా అని అపరిశుభ్రంగా ఉంచకూడదు. ఎప్పుడు దీన్ని దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి. వస్తువులు చిందరవందరగా ఉంచకూడదు. పనికిరాని, నిరుపయోగంగా ఉంచే వస్తువులు పెట్టకండి. వాటిని బయట పారేయడమే మంచిది.
అలాగే పగిలిన అద్దాలు, అరిగిపోయిన చీపుర్లు, పని చేయని ఎలక్ట్రానిక్ వస్తువులు, విరిగిపోయిన చెక్క సామాన్లు ఉంచడం మంచిది. ఇది ఇంటి ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురకోలేనా చేస్తుందని పండితులు సూచిస్తున్నారు. అందుకే స్టోర్ రూమ్ లో ఉంచే వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.
టాపిక్