Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఈరోజు దత్తాత్రేయుని ఆరాధిస్తే.. ఆ రాశుల వారికి మంచిది..-horoscope today check telugu rasi phalalu check your zodiac sign for 1st december 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Horoscope Today Check Telugu Rasi Phalalu Check Your Zodiac Sign For 1st December 2022

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఈరోజు దత్తాత్రేయుని ఆరాధిస్తే.. ఆ రాశుల వారికి మంచిది..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 01, 2022 05:00 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? డిసెంబర్ 1వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (01-12-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. కుటుంబ, అనారోగ్య సమస్యలు.. ఇబ్బంది పెడతాయి. కుజుని ప్రభావంవల్ల ఘర్షణలు, మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్య సమస్యలు కొంత ఎక్కువగా ఉంటాయి. ఆవేశ పూరిత నిర్ణయాలకు దూరంగా ఉంటే మంచిది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి ప్రశాంతంగా వ్యవహరించడం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మధ్యస్తము నుంచి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబ విషయాల పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబంలో వాదనలు, సమస్యలతో కూడిన వాతావరణం ఉండే అవకాశముంది. మనస్తాపము, అనారోగ్యం కలిగే సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలున్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నా.. ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం సాధిస్తారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

మిధున రాశి

మిధున రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఖర్చులు నియంత్రించుకుంటే మంచిది. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు. పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఉంటాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మిధునరాశి వారికి ధన లాభము కలుగుతుంది. ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ధనలాభము, వస్తు లాభము కలుగుతుంది. ఇష్టమైన వస్తువుల కోసం, కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. మీరు చేసే ప్రయత్నాలకు శుభ ఫలితాలు కలుగుతాయి. స్త్రీలతో జాగ్రత్తగా ఉంటే మంచిది. కుటుంబంలో కొన్ని సమస్యలు బాధిస్తాయి. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్తం నుంచి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెడుతుంది. ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభము కలుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ధనలాభము, వస్తులాభము, కీర్తి కలుగుతుంది. అనుకున్న ప్రతీ పనిని అనుకున్న విధముగా పూర్తి చేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. చేసే ప్రతీ పనిలో విజయం పొందుతారు. ప్రయాణములు లాభిస్తాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మధ్యస్త ఫలితాలున్నాయి. ఒత్తిడి తగ్గించుకుని ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్త్రీ సౌఖ్యము కలుగుతుంది. పనుల్లో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కుటుంబమునందు, ఉద్యోగ, వ్యాపారాల్లో చికాకులు ఉంటాయి. విరోధులతో జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకు సమస్యలు అధికముగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిచండి. అప్పుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మిత్రులు హెల్ప్ చేస్తారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని ఆరాధించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి ఈరోజు అంత అనుకూలముగా లేదు. శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబములో వాగ్వివివాదాలు ఉంటాయి. అయినప్పటికీ మీరు సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికి అనుకున్న పని పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. ధనలాభము కలుగుతుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని ఆరాధించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. ధనురాశి వారికి చేసే ప్రతీ పని అనుకూలిస్తుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఇష్టమైన వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయాణములు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. ఆర్ధిక సమస్యలు, పనుల్లో ఆలస్యము ఉంటుంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మానసిక ఆందోళన కలుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. చేసే ప్రతీ పని అనుకూలిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనుకున్న ప్రతీ పని పూర్తి చేస్తారు. ధనలాభము, సౌఖ్యము కలుగుతుంది. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు దత్తాత్రేయుని పూజించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు అనుకూలముగా ఉంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కలసి వస్తుంది. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికీ.. ఏదో రకంగా ముందుకు సాగుతారు. ఖర్చులు నియంత్రించుకుంటే మంచిది. చేసే ప్రతీ పని అనుకూల ఫలితాలు ఇస్తుంది. స్త్రీలకు ఈరోజు అనుకూలంగా ఉంది. విద్యార్థులకు కలసి వస్తుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు దక్షిణామూర్తిని పూజించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు మధ్యస్తముగా ఉంటుంది. కుటుంబలోని సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్త వహించండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. కీర్తి, సౌఖ్యము కలుగుతుంది. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్