Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఉద్యోగస్తులకు సమస్యలు ఎక్కువగా ఉంటాయి.. జాగ్రత్తగా ఉండండి..
Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? నవంబర్ 30వ తేదీ 2022న కెరీర్ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (30-11-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు కొంత కలిగిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహిస్తే మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.
వృషభ రాశి
ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శుభవార్తను వింటారు. శారీరక శ్రమ, మానసిక అలసట ఉంటుంది. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగుతాయి. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
మిధున రాశి
ఈరోజు మీకు అంత అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శారీరక సౌఖ్యము కలుగుతుంది. ధనపరమైన విషయాలలో లాభము పొందుతారు. కుటుంబములో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రయాణమునందు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.
కర్కాటక రాశి
ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా చేస్తారు. శారీరక సౌఖ్యము పొందుతారు. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని ఉన్న సమస్యలు తొలగుతాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం మంచిది.
సింహ రాశి
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధిస్తే మంచిది.
కన్యా రాశి
ఈరోజు మీకు అనుకూలంగా లేదు. శారీర శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణములు ఎక్కువగా ఉంటాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
తులా రాశి
ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంది. ప్రతీ పనిని ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. శరీర సౌఖ్యం కోసం ఖర్చు చేస్తారు. మానసిక ఆనందము పొందుతారు. ధనలాభము ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబ సౌఖ్యము పొందుతారు. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రుల ద్వారా సహాయము పొందుతారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధిస్తే మంచిది.
వృశ్చిక రాశి
ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగములో ఒత్తిడి, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ధనలాభము, కుటుంబ సౌఖ్యము పొందుతారు. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
ధనూ రాశి
ఈరోజు మీకు మద్యస్తమునుంచి అనుకూలంగా ఉంది. చేసే ప్రతీ పనిని ఆచితూచి జాగ్రత్తగా చేయండి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. మానసిక ఆందోళన కలుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఎక్కువగా ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధిస్తే మంచిది.
మకర రాశి
ఈరోజు మీకు మధ్యస్తమునుంచి అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మకరరాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణం చేస్తే మంచిది.
కుంభ రాశి
ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలోని వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రతీ పనిని ఆచితూచి చేయాల్సిన సమయమిది. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయండి.
మీన రాశి
ఈరోజు మీకు మధ్యస్తమునుంచి అనుకూల ఫలితములున్నాయి. కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆందోళన పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ప్రతీ పనిలో విజయాన్ని పొందుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Contact : 9494981000
సంబంధిత కథనం
టాపిక్