Name plate vastu tips: ఇంటి ముందు నేమ్ ప్లేట్ ఈ దిశలో పెట్టారంటే.. సంపద, శ్రేయస్సుకి లోటే ఉండదు-follow these vastu tips for name plate to bring success and prosperity ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Name Plate Vastu Tips: ఇంటి ముందు నేమ్ ప్లేట్ ఈ దిశలో పెట్టారంటే.. సంపద, శ్రేయస్సుకి లోటే ఉండదు

Name plate vastu tips: ఇంటి ముందు నేమ్ ప్లేట్ ఈ దిశలో పెట్టారంటే.. సంపద, శ్రేయస్సుకి లోటే ఉండదు

Gunti Soundarya HT Telugu
Feb 24, 2024 03:00 PM IST

Name plate vastu tips: ఇంటి ముందు నేమ్ ప్లేట్ ఉంటే చూసేందుకు అందంగా ఉంటుంది. ఇది అందం మాత్రమే కాదు సానుకూల శక్తిని కూడా ఆకర్షిస్తుంది. మీ ఇంట సంపద, శ్రేయస్సు పెరుగుతాయి.

నేమ్ ప్లేట్ వాస్తు టిప్స్
నేమ్ ప్లేట్ వాస్తు టిప్స్ (pixabay)

Name plate vastu tips: ఈ మధ్యకాలంలో ఇళ్ల ముందు నేమ్ ప్లేట్ పెట్టుకునే ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది. ఇంటికి తగినట్టుగా దేవుడు పేరుతోనో, తమకి ఇష్టమైన కుటుంబ సభ్యుల పేర్లతో నేమ్ ప్లేట్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంటి బయట పెట్టె నేమ్ ప్లేట్ వాస్తు సరిగా ఉందో లేదో చూసుకోవాలి. నేమ్ ప్లేట్ తప్పుగా పెట్టడం వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయి.

ఇంటికి సంబంధించి వాస్త నియమాలు సరిగా పాటించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. కెరీర్, ప్రేమ, ఆర్థికం, ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే కుటుంబంలోని సభ్యులందరు ప్రతి రంగంలో అపారమైన విజయాలు పొందుతారు. డబ్బు కొరత ఎప్పుడు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అందుకే నేమ్ ప్లేట్ విషయంలో మీరు ఈ వాస్తు చిట్కాలు పాటించడం మంచిది.

నేను ప్లేట్ వాస్తు చిట్కాలు

నేమ్ ప్లేట్ ఎప్పుడూ మురికిగా ఉండకుండా చూసుకోవాలి. దుమ్ముని ఎప్పటికప్పుడు చేసే విషయం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాస్తు ప్రకారం దీర్ఘచతురస్రాకార నేమ్ ప్లేట్ శుభప్రదంగా భావిస్తారు. ఇంటికి కుడివైపున ఇది ఉండాలి. నేమ్ ప్లేట్ మీద రాసిన పదాలు స్పష్టంగా కనిపించాలి.

నేమ్ ప్లేట్ మీద వినాయకుడు లేదా స్వస్తిక్ చిహ్నాన్ని ఉంచుకుంటే చాలా మంచిది. వాస్తు ప్రకారం ప్లాస్టిక్ తో చేసిన నేమ్ ప్లేట్లు పొరపాటున కూడా ఉపయోగించొద్దు. రాగి, ఉక్కు లేదా ఇత్తడి లోహంతో తయారు చేసిన నేమ్ ప్లేట్లు ఉపయోగించుకోవచ్చు. వీటితోపాటు కలప లేదా రాతితో చేసిన నేమ్ ప్లేట్ పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. నేమ్ ప్లేట్ సరైన దిశలో ఉండటం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.

ఏ దిశకు ఏ రంగు నేమ్ ప్లేట్ పెట్టుకోవచ్చు

మీ ఇంటి దిశనే అనుసరించి నేమ్ ప్లేట్ రంగు ఎంచుకోవడం మంచిది. వాస్తు ప్రకారం మీ ఇల్లు తూర్పు ముఖంగా ఉంటే పసుపు రంగు నేమ్ ప్లేట్ పెట్టుకోండి. ఉత్తర ముఖం ఉన్న ఇల్లు అయితే ఆకుపచ్చ రంగు నేమ్ ప్లేట్ పెట్టుకుంటే మంచి జరుగుతుంది. దక్షిణం వైపు ఉన్న ఇంటి కోసం ఎరుపు రంగు నేమ్ ప్లేట్, వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఇంటి కోసం పసుపు లేదా సిల్వర్ కలర్ నేమ్ ప్లేట్ ఎంచుకోవడం ఉత్తమం.

చాలామంది తలుపులు మీద నేమ్ ప్లేట్ పెట్టుకుంటారు. చెక్క తలుపు మీద నేమ్ ప్లేట్ పెట్టుకోవడం శుభప్రదంగా పరిగణిస్తారు. తెలుపు రంగు నేమ్ ప్లేట్ పెట్టుకుంటే అది మీ ఇంటికి శాంతిని కలిగిస్తుంది. కొంతమంది నేమ్ ప్లేట్ ని వేలాడదీస్తారు. ఇందుకోసం ఓవెల్ షేప్ నేమ్ ప్లేట్ వేయించుకోవడం మంచిది. ఇది మీ విలాసాన్ని సూచిస్తుంది. నలుపు రంగు నేమ్ ప్లేట్ అందుకు తగినదిగా ఉంటుంది. ఇది ఇంటికి ఎడమవైపు ఉంచుకోవాలి.

చతురస్రాకారంలో ఉన్న నేమ్ ప్లేట్ మీద కుటుంబ సభ్యుల పేర్లు రాసుకోవచ్చు. మరి కొంతమంది పారదర్శకంగా కనిపించే నేమ్ ప్లేట్ పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అటువంటి వాళ్ళు గాజుతో తయారు చేసిన నేమ్ ప్లేట్ పెట్టుకోవచ్చు. అయితే ఎప్పుడూ అది శుభ్రంగా, దుమ్ము లేకుండా ఉండేలా చూసుకోవాలి. చెక్క తలుపు మీద గోల్డ్ కలర్ నేమ్ ప్లేట్ పెట్టుకుంటే మీ ఇంటికి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఇది ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

నేమ్ ప్లేట్ పగిలిపోయి, వదులుగా ఉండడం, రంధ్రాలు పెట్టడం వంటివి ఎప్పుడూ చేయకూడదు. నేమ్ ప్లేట్ పగిలిపోయిన, రంగు మారిపోయిన వెంటనే దాన్ని స్థానంలో కొత్తదాన్ని భర్తీ చేయాలి. వాటి వెనుక సాలె పురుగులు, బల్లి లేదా పక్షి గూడులు ఉండకూడదు. తెలుపు, పసుపు, కుంకుమపువ్వు రంగులు కలిగిన నేమ్ ప్లేట్ ఎంచుకోవచ్చు.

 

Whats_app_banner