Door mat vastu tips: మీ ఇంటి ప్రధాన ద్వారం దిశ ప్రకారం ఏ రంగు డోర్ మ్యాట్ వేస్తే మంచిదో తెలుసా?-do you know which color door mat is best for the direction of the main entrance of your home ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Door Mat Vastu Tips: మీ ఇంటి ప్రధాన ద్వారం దిశ ప్రకారం ఏ రంగు డోర్ మ్యాట్ వేస్తే మంచిదో తెలుసా?

Door mat vastu tips: మీ ఇంటి ప్రధాన ద్వారం దిశ ప్రకారం ఏ రంగు డోర్ మ్యాట్ వేస్తే మంచిదో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Mar 05, 2024 03:11 PM IST

Door mat vastu tips: ఇంటి ముందు వేసే డోర్ మ్యాట్ కేవలం అలంకరణ వస్తువుగా మాత్రమే చూస్తున్నారా? ఇంటి ప్రధాన ద్వారం ఏ దిశలో ఉంటే ఎలాంటి రంగు డోర్ మ్యాట్ వేస్తే శుభం కలుగుతుందో తెలుసా?

డోర్ మ్యాట్ వాస్తు నియమాలు
డోర్ మ్యాట్ వాస్తు నియమాలు (pexels)

Door mat vastu tips: ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వేసే డోర్ మ్యాట్ అందంగా ఆకర్షణీయంగా ఉండే విధంగా చూసుకుంటారు. ఇది మీ ఇంట్లోకి అతిథులను ఆహ్వానించడానికి మాత్రమే కాదు మీ ఇంటికి అందాన్ని కూడా ఇస్తుంది. అందుకే ప్రధాన ద్వారం దగ్గర వేసే డోర్ మ్యాట్ ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

కిచెన్, వాష్ రూమ్, లివింగ్ రూమ్ లో సోఫా దగ్గర, బెడ్ రూమ్ లో మంచాల దగ్గర చాలా మంది డోర్ మ్యాట్స్ వేసుకుంటున్నారు. మీకోక విషయం తెలుసా కాళ్ళు తుడుచుకునేందుకు ఉపయోగించుకునే ఈ డోర్ మ్యాట్ కి కూడా వాస్తు నియమాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం ఏ దిశలో ఉందో దానికి అనుగుణంగా సరైన రంగు డోర్ మ్యాట్ ఎంచుకోవాలి. అప్పుడే ఇంట్లోకి సానుకూల శక్తి ప్రసరిస్తుంది.

ప్రధాన ద్వారం పశ్చిమ దిశలో ఉంటే..

పశ్చిమ దిశ సృజనాత్మకత, సంతానం, ఆనందంతో ముడిపడి ఉంటుంది. అందుకే మీ ఇంటి ప్రధాన ద్వారం పశ్చిమ దిశలో ఉంటే నలుపు రంగు డోర్ మ్యాట్ వేసుకోవడం మంచిది. నలుపు శక్తిని గ్రహిస్తుంది. ఇంట్లో సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తొలగించేసి శ్రావ్యమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది.

ఉత్తరం లేదా ఈశాన్యం

ఉత్తరం లేదా ఈశాన్య దిశలు వృత్తి, అవకాశాలు, వ్యక్తిగత వృద్ధిని సూచిస్తాయి. అందుకే ఈ దిశలో ఉన్న ప్రధాన ద్వారం దగ్గర నీలం లేదా నలుపు రంగు డోర్ మ్యాట్ వేసుకోవాలి. ఇవి నీటి మూలకాలని సూచిస్తాయి. ఇంటికి సమృద్ధిని, శ్రేయస్సుని ఇస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

దక్షిణం లేదా ఆగ్నేయం

దక్షిణ లేదా ఆగ్నేయ దిశలు అభిరుచి, కీర్తి, సంపదతో సంబంధం కలిగి ఉంటాయి. వీటిని సమతుల్యం చేసేందుకు మీ ప్రధాన ద్వారం దక్షిణ దిశలో ఉంటే ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు డోర్ మ్యాట్ ఎంచుకోవాలి. ఎరుపు రంగు శక్తి, అదృష్టాన్ని సూచిస్తుంది. అలాగే ఆకుపచ్చ పెరుగుదల, సమతుల్యతను సూచిస్తుంది. ఎరుపు రంగు వేసుకుంటే మీ ఇంటి మేలు జరుగుతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది.

నైరుతి దిశ

మీ ఇంటి ప్రధాన ద్వారం నైరుతి దిశలో ఉంటే మీరు పసుపు, బంగారు రంగు డోర్ మ్యాట్ వేసుకుంటే మంచిది. ప్రేమ, స్థిరత్వంతో ఈ దిశ ముడిపడి ఉంటుంది. ఈ రంగు డోర్ మ్యాట్స్ వేయడం వల్ల సానుకూల శక్తిని, శ్రేయస్సుని ఆకర్షిస్తాయని నమ్ముతారు. నైరుతి ప్రధాన ద్వారం వద్ద ఈ రంగులతో ఉన్న డోర్ మ్యాట్ ఉంచితే మీ ఇంటి జీవితంలో సంతోషం నెలకొంటుంది.

తూర్పు ద్వారం

మీ ఇంటి ప్రధాన ద్వారం తూర్పు వైపు ఉన్నట్లయితే ఆకుపచ్చ లేదా నీలం రంగు డోర్ మాట్స్ ఎంచుకోండి. ఈ దిశ ఆరోగ్యం, కుటుంబం, మొత్తం శ్రేయస్సు సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు ఆరోగ్యం, పెరుగుదలను సూచిస్తుంది. నీలం ప్రశాంతతను ఇస్తుంది. అందుకే మీ ఇంటి ద్వారాలు తూర్పు వైపు ఉంటే ఈ రంగు డోర్ మ్యాట్స్ వేసుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది.

టాపిక్