Home vastu tips: ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ వస్తువులు పెట్టకండి.. ఆర్థిక కష్టాలు వెంటాడతాయి
Home vastu tips: ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని వస్తువులు ఉంచడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. అందుకే వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వీటిని పెట్టకండి.
Home vastu tips: మనలో చాలా మంది ఇంట్లోకి వచ్చే ముందు చెప్పులు గుమ్మం ముందు చిందరవందరగా వదిలిపెట్టేసి వచ్చేస్తారు. కానీ అలా చేయడం వాస్తు ప్రకారం కూడా మంచిది కాదు. చాలా సార్లు మనం అనుకోకుండా చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వాస్తు లోపాలు ఏర్పడతాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం సంబంధించి కొన్ని పనులు చేయకూడదు. అలా చేస్తే ఆర్థిక పరిస్థితి క్షీణించి, ఖర్చులు పెరిగిపోతాయి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంట్లో సానుకూల శక్తిని పెంచుకోవడం కోసం ఇంటి ప్రధాన ద్వారానికి సంబంధించి కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అలా చేయడం వాలల ఇంట్లో సానుకూల శక్తి ప్రసారిస్తుంది. కుటుంబంలో బాధలు తొలగిపోయి ప్రేమ, సామరస్యం నెలకొంటాయి.
శుభ్రంగా ఉంచాలి
ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి. పగిలిన కుర్చీలు, డస్ట్ బిన్ ఎప్పుడు గుమ్మం దగ్గర ఉంచకూడదు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల ప్రతికూలత పెరుగుతుంది. ఆర్థిక కష్టాలు పెరుగుతాయి.
చెప్పులు ఉండకూడదు
ప్రధాన ద్వారానికి ఎదురుగా చెప్పులు, బూట్లు ఉండకూడదు. ఈశాన్య మూలలో చెప్పులు పెట్టడవం వల్ల ఇంటి సభ్యులు ఇబ్బందులు పడతారు. బూట్లు, చెప్పులు ఎప్పుడు ఇంటికి దక్షిణ దిశలోనే ఉంచాలి. అలా చేయకపోతే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
శబ్దం రాకూడదు
ప్రధాన ద్వారం తెరిచేటప్పుడు తలుపు శబ్ధం వస్తుంది. కాని అలా రాకూడదు. వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం తలుపు తెరిచేటప్పుడు, మూసేటప్పుడు ఎటువంటి శబ్ధం రాకూడదు. అలా వస్తే ఇంటి సభ్యుల సంతోషానికి, శాంతికి ఆటంకం కలిగిస్తుందని నమ్ముతారు. అందుకే శబ్ధం రాకుండా తలుపుకి ఉండే బోల్ట్ దగ్గర నూనె వేయాలి.
వెలుతురు ఉండాలి
ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడు చీకటిగా ఉంచకూడదు. వెలుతురు ఉండేలా లైట్ ఏర్పాటు చేసుకోవాలి. చీకటిగా ఉన్న గుమ్మంలోకి నెగటివ్ ఎనర్జీ త్వరగా ఆకర్షిస్తుంది.
మరొక ద్వారం ఉండకూడదు
ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా స్తంభం ఉంటే దానికి అద్దం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే నెగటివ్ ఎనర్జీని నివారించుకోవచ్చు. అలాగే ఇంటి ప్రధాన ద్వారం పక్కన మరొక ద్వారం ఉండకూడదు. ఇంటికి ఒకటే మెయిన్ డోర్ ఉండాలి.
వంటగది ఉందా?
ప్రధాన ద్వారానికి ఎదురుగా వంట గది ఉంటే ప్రతికూల శక్తిని నివారించడం కోసం గుమ్మం ముందు క్రిస్టల్ బాల వేలాడదీయాలి.
మెయిన్ గేట్ ఫ్లోర్ తాకకూడదు
వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ గేట్ ఫ్లోర్ తాకకూడదు. దీని వల్ల ఆ ఇంటి వ్యక్తికి సమాజంలో గౌరవం తగ్గిపోతుంది. ఆర్థిక పరిస్థితి బలహీనపడుతుందని నమ్ముతారు.
బుక్ షెల్ప్
ఇంటి ప్రధాన ద్వారం చుట్టూ ఒక బుక్ షెల్ఫ్ ఉంచడం శుభప్రదంగా ఉంటుంది. కానీ దీన్ని ఇంటి ప్రధాన ద్వారం ముందు మాత్రం ఉంచకూడదని గుర్తు పెట్టుకోండి.
మొక్కలు నాటండి
ఇంటి ప్రధాన ద్వారం వద్ద పచ్చని చెట్లు, మొక్కలు నాటుకోవడం మంచిది. ఇవి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడమే కాదు చుట్టుపక్కన గాలిని శుభ్రపరుస్తాయి. ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మనీ ప్లాంట్ పెట్టుకోవడం చాలా మంచిది. ఆర్థిక కష్టాలు నివారించుకోవచ్చు.
i
టాపిక్