Raksha bandhan 2024: రక్షాబంధన్ రోజున మీ సోదరికి ఈ 4 వస్తువులను బహుమతిగా ఇవ్వకండి, అశుభం
Raksha bandhan 2024: రాఖీ కట్టిన తర్వాత సోదరికి ఏదో ఒకటి బహుమతిగా ఇవ్వడం ఆచారంగా వస్తుంది. అయితే ఈ పవిత్రమైన రోజున సోదరికి కొన్ని వస్తువులు బహుమతిగా ఇవ్వడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. రక్షా బంధన్ కానుకగా సోదరికి ఇవ్వకూడని బహుమతులు ఏమిటో తెలుసుకుందాం.
Raksha bandhan 2024: రక్షాబంధన్ అన్నాచెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమకు ప్రసిద్ధి. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి వారికి జీవితాంతం రక్షణగా నిలవమని అడుగుతారు. అలాగే సోదరులు కూడా తమ సోదరీమణులను ఆదుకుంటామని హామీ ఇస్తారు.
ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. రక్షా బంధన్ సోమవారం అనేక శుభ కార్యక్రమాలతో వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ప్రతి సంవత్సరం రక్షాబంధన్ జరుపుకుంటారు. ఈ రోజు కూడా రాఖీ కట్టడానికి శ్రేయస్కరం కాని భద్ర కాలమే అవుతుంది. దీనిని నివారించేందుకు ఆగస్ట్ 19వ తేదీ మధ్యాహ్నం 1.26 గంటల నుంచి సాయంత్రం 6.25 గంటల వరకు రాఖీ కట్టేందుకు అనువైన సమయం.
సుమారు 90 ఏళ్ల తర్వాత ఈ ఏడాది రక్షాబంధన్ నాడు సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం, శోభన యోగం, శ్రవణా నక్షత్రం అనే నాలుగు శుభ మహా సంయోగాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఈ గొప్ప యాదృచ్చికలు జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును తెస్తాయి. శ్రవణా నక్షత్రం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది.
రాఖీ కట్టిన తర్వాత అన్న లేదా తమ్ముడు తమ సోదరీమణులకు బహుమతులు ఇస్తూ ఉంటారు. వారికి నచ్చిన చీరలు, స్టైలిష్ బ్యాగ్స్, వాచ్, స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా ఇస్తారు. అయితే ఎంతో పవిత్రమైన ఈరోజున కొన్ని వస్తువులు బహుమతులుగా ఇవ్వడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు.
మీ సోదరికి ఈ వస్తువులు బహుమతిగా ఇవ్వకండి
రక్షా బంధన్ రోజు ఈ నాలుగు వస్తువులను ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు. లెదర్ బ్యాగ్‌లు లేదా లెదర్‌తో చేసిన ఇతర స్టైలిష్ వస్తువులు వంటి లెదర్ సంబంధిత వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదట. తోలు వస్తువులు శని దేవుడికి సంబంధించినవి కావున వీటిని మీ సోదరికి ఎప్పుడూ ఇవ్వకండి. ఇవి ఇవ్వడం వల్ల ఆమె సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
అలాగే మీ సోదరీమణులకు బహుమతిగా నలుపు రంగు వస్తువులను కొనకండి. అది మాత్రమే కాదు సోదరుడికి కట్టే రాఖీ ఎరుపు, పసుపు రంగు ఉన్నవి అయితే మంచిది. నలుపు రంగు రాఖీలు పొరపాటున కూడా ఎంచుకోకూడదు. నలుపు రంగు ఎవరి జీవితంలోనైనా ప్రతికూలతను తెస్తుంది. అందుకే నలుపు రంగు వస్తువులు కూడా బహుమతిగా ఇవ్వడం అశుభం. మూడవది బూట్లు, చెప్పులు బహుమతిగా ఇవ్వవద్దు.
షూలు, చెప్పులు శని దేవుడికి సంబంధించినవి అని నమ్ముతారు. ఇది ఆమె జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. ఇక వాచ్ కూడా ఇవ్వకూడదని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి మంచి, చెడు సమయాలు గడియారంతో ముడిపడి ఉన్నందున గడియారాన్ని అత్యంత అశుభకరమైనదిగా పరిగణిస్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.