Raja yogam: భద్ర, మాలవ్య రాజయోగాలు- మూడు రాశులకు అదృష్టానికి ఏ కొదువ ఉండదు-bhadra malavya rajayogam forms mercury and venus three zodiac signs get lucky ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Raja Yogam: భద్ర, మాలవ్య రాజయోగాలు- మూడు రాశులకు అదృష్టానికి ఏ కొదువ ఉండదు

Raja yogam: భద్ర, మాలవ్య రాజయోగాలు- మూడు రాశులకు అదృష్టానికి ఏ కొదువ ఉండదు

Gunti Soundarya HT Telugu
Sep 13, 2024 03:18 PM IST

Raja yogam: శుక్రుడు, బుధుడు తమ సొంత రాశులలో చేరడం వల్ల శుభప్రదమైన భద్ర, మాలవ్య రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని వల్ల మూడు రాశులకు అదృష్టం, ఆస్తి రెండూ కలిసి వస్తాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు దక్కుతాయి.

భద్ర, మాలవ్య రాజయోగాలు
భద్ర, మాలవ్య రాజయోగాలు

Raja yogam: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు కాలానుగుణంగా సంచరిస్తాయి. రాశులు మారడం వల్ల వివిధ శుభ యోగాలు, ఇతర గ్రహాలతో కలయికలు ఏర్పడతాయి. సెప్టెంబర్ లో గ్రహాల సంచారం వల్ల మాలవ్య, భద్ర రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఒకటి బుధుడు ఏర్పరిస్తే మరొకటి శుక్రుడు ఇస్తున్నాడు.

18 సెప్టెంబర్ 2024న శుక్రుడు కన్యా రాశిని వదిలి తులా రాశిలో సంచరిస్తాడు. 23 సెప్టెంబర్ 2024న బుధుడు ఉదయం 09:59 గంటలకు కన్యారాశిలో ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాలు పవిత్రమైన మాలవ్య, భద్ర రాజయోగం ఇస్తున్నాయి. శుక్రుడు తన స్వంత రాశి వృషభం, తుల రాశిలో సంచరించినప్పుడు మాళవ్య యోగం ఏర్పడుతుంది. బుధుడు తన సొంత రాశి అయిన కన్య, మిథున రాశిలో సంచరించినప్పుడు భద్ర రాజయోగం ఏర్పడుతుంది. పంచమహా పురుష రాజయోగాలలో ఇవి రెండూ ఉన్నాయి. మాలవ్య, భద్ర రాజయోగం వల్ల అదృష్టం పొందే రాశులు ఏవో తెలుసుకుందాం.

మకర రాశి

మకర రాశి వారికి మాలవ్య, భద్ర రాజయోగాలు చాలా ఫలవంతంగా ఉంటాయి. శుక్రుడు ఈ రాశి నుండి పదవ ఇంటిలో ఉంటాడు. బుధుడు కూడా అదే ఇంట్లో సంచరిస్తాడు. దీని వల్ల వ్యాపారాలు పురోగమిస్తాయి. వివిధ ఒప్పందాల నుంచి భారీ లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ఆఫర్లు కూడా లభిస్తాయి. గతంలో నిలిచిపోయిన పని ఇప్పుడు పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. వ్యాపారస్థులకు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ కాలం వీరికి అనుకూలంగా ఉంటుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు మాలవ్య, భద్ర రాజయోగాల నుండి అపారమైన ప్రయోజనాలను పొందబోతున్నారు. మూడో ఇంట్లో బుధుడు, నాలుగో ఇంట్లో శుక్రుడు సంచరిస్తాడు. భౌతిక ఆనందం పెరుగుతుంది. అన్నీ రకాల ఆనందాలు పొందుతారు. ఈ రాజయోగాల వల్ల ధైర్యం, పరాక్రమాలు పెరుగుతాయి. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు దక్కుతాయి. వాహనం లేదా ఆస్తి మొదలైనవి కొనుగోలు చేస్తారు. తల్లితో సంబంధం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు సద్దుమణుగుతాయి. కుటుంబం పూర్తి మద్ధతు ఇస్తుంది.

మిథున రాశి

భద్ర, మాలవ్య రాజయోగాల వల్ల మిథున రాశి వాళ్ళు లాభపడతారు. ఈ రాశి నాలుగో ఇంట్లో బుధుడు, ఐదో ఇంట్లో శుక్రుడు సంచరిస్తారు. జీవితంలో అన్నీ రకాల భౌతిక ఆనందాలు పొందుతారు. వాహనం, అస్తి నుంచి ఆనందం పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. అనేక మార్గాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా డబ్బు చేతికి అందుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమలో ఉన్న వాళ్ళు పెళ్లి పీటలు ఎక్కుతారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.