Venus transit: చంద్రుడి నక్షత్రంలో శుక్రుడు- భారీగా ఆర్థిక లాభాలు పొందే లక్కీ రాశులు ఇవే-venus transit in moon hasta nakshtram three zodiac signs get lucky ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Venus Transit: చంద్రుడి నక్షత్రంలో శుక్రుడు- భారీగా ఆర్థిక లాభాలు పొందే లక్కీ రాశులు ఇవే

Venus transit: చంద్రుడి నక్షత్రంలో శుక్రుడు- భారీగా ఆర్థిక లాభాలు పొందే లక్కీ రాశులు ఇవే

Gunti Soundarya HT Telugu
Sep 11, 2024 02:09 PM IST

Venus transit: సంపదను ఇచ్చే శుక్రుడు ప్రస్తుతం చంద్రుడికి చెందిన హస్తా నక్షత్రంలో ఉన్నాడు. దీని ప్రభావంతో మూడు రాశుల వారికి భారీగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. విజయ శిఖరాలు చేరుకుంటారు. ఆ లక్కీ రాశులు ఏవో మీరే చూడండి.

చంద్రుడి నక్షత్రంలో శుక్రుడు
చంద్రుడి నక్షత్రంలో శుక్రుడు

Venus transit: వేద జ్యోతిషశాస్త్రంలో శుక్రుడిని రాక్షసుల గురువుగా పరిగణిస్తారు. ప్రతి 26 నుండి 28 రోజులకు ఒకసారి శుక్రుడు తన రాశి చక్రం స్థానం మార్చుకుంటాడు. అదేవిధంగా శుక్రుడు కూడా ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన నక్షత్రాన్ని మారుస్తాడు.

ప్రస్తుతం శుక్రుడు హస్తా నక్షత్రంలో ఉన్నాడు. 13 సెప్టెంబర్ 2024 వరకు ఇదే నక్షత్రంలో ఉంటాడు. శుక్రుడి నక్షత్ర మార్పు జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ కాలంలో గొప్ప ప్రయోజనాలు పొందుతారు. హస్తా నక్షత్రం చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. అందం, ప్రేమ, విలాసవంతమైన జీవితానికి కారకంగా భావించే శుక్రుడు ఈ నక్షత్రంలో సంచరించడం వల్ల కొందరికి అనేక లాభాలు కలుగుతాయి. శుక్రుడు హస్తా నక్షత్రంలో ఉండటం వల్ల ఎవరికి అదృష్టం కలుగుతుందో చూద్దాం.

మకర రాశి

హస్తా నక్షత్రంలో శుక్రుడి సంచారం మకర రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. అదృష్టం పూర్తి మద్దతు ఇస్తుంది. కెరీర్ రంగంలో సానుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనే వారి కల ఇప్పుడు నెరవేరుతుంది. కార్యాలయంలో మీ కృషికి తగిన ప్రశంసలు లభిస్తాయి. ఈ కాలంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీతం కూడా పెరగవచ్చు. వ్యాపారస్తులు భారీ లాభాలను ఆర్జిస్తారు. ఆర్థిక స్థితి మరింత బలంగా మారుతుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభించడం మీకు సంతృప్తిని కలిగిస్తుంది.

కన్యా రాశి

కన్యా రాశికి చెందిన లగ్న గృహంలో శుక్రుడు ఉంటాడు. ఈ కాలంలో వారు ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతి రంగంలో ఉన్నత విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు. విశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అండదండలు లభిస్తాయి. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో నెలకొన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగం సంతృప్తికరంగా ఉంటుంది. ఈ కాలంలో అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

సింహ రాశి

హస్తా నక్షత్రంలో శుక్రుని రాక సింహ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో ఆదాయ స్థాయిలలో పెరుగుదలను చూస్తారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. డబ్బును ఆదా చేసుకోగలగుతారు. గతంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు. కెరీర్ ఉన్నత స్థాయికి చేరుకోవడంలో మీ కలలన్నీ నెరవేరుతాయి. మీ భవిష్యత్, కుటుంబానికి సంబంధించిన కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. షేర్ మార్కెట్ నుంచి మంచి లాభాలు పొందే అవకాశం ఉండి. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. విదేశాలలో వ్యాపారం చేసే వ్యక్తులు ఈ కాలంలో భారీ లాభాలను పొందుతారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందుతారు. కుటుంబంతో కొంత నాణ్యమైన సమయాన్ని పొందుతారు. ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.