Bhadra raja yogam: భద్ర మహా పురుష రాజయోగం- మూడు రాశుల వారికి గోల్డెన్ టైమ్ రాబోతుంది
Bhadra raja yogam: గ్రహాల రాకుమారుడు బుధుడు సొంత రాశిలో సంచరించడం వల్ల అత్యంత శుభకరమైన రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు. పంచమహా పురుష రాజయోగాలలో ఒకటైన భద్ర రాజయోగం మరో రెండు రోజుల్లో ఏర్పడబోతుంది. దీని ప్రభావం వల్ల మూడు రాశుల వారికి గోల్డెన్ టైమ్ రాబోతుంది.
Bhadra raja yogam: గ్రహ సంచారం మానవ జీవితాలను ప్రభావితం చేసినట్లే గ్రహాల పెరుగుదల, దహనం జీవితంలోని వివిధ రంగాలపై గొప్ప ప్రభావాలను చూపుతాయి. గ్రహాల రాకుమారుడు బుధుడు అత్యంత వేగంగా రాశిని మార్చుకోగలుగుతాడు. ప్రస్తుతం సింహ రాశిలో ఉన్న బుధుడు సెప్టెంబర్ 23 ఉదయం 9.59 గంటలకు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడి సంచారం ఫలితంగా భద్ర రాజయోగం ఏర్పడుతుంది.
ఈ నెలలో బుధుడు రెండు సార్లు తన కదలికను మార్చుకుంటున్నాడు. మొదటగా సింహ రాశిలోకి ప్రవేశించిన బుధుడు రెండు రోజుల్లో కన్యా రాశిలోకి వెళతాడు. బుధుడు తన సొంత రాశి అయిన కన్య, మిథున రాశిలో సంచరించినప్పుడు భద్ర రాజయోగం ఏర్పడుతుంది. పంచ మహా పురుష రాజయోగాలలో భద్ర రాజయోగం ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భద్ర రాజయోగం వల్ల మూడు రాశుల చాలా ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. భద్ర రాజయోగం నుండి బహుళ ప్రయోజనాలను పొందే అవకాశం ఉన్న రాశులు ఏవో చూద్దాం.
వృషభ రాశి
వృషభ రాశి వారికి భద్ర రాజయోగం చాలా శుభప్రదమైనది. వారు తమ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను అందుకుంటారు. సంతానం కోసం ఆస్తి, ఇల్లు లేదా వాహనం మొదలైనవి కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు తమ వృత్తిలో అద్భుతమైన విజయాలను పొందే అవకాశం ఉంది. జీవితంలో శుభ ఫలితాలను పొందిన తర్వాత వారు సంతృప్తిగా, సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించడంతో పాటు జీతాలు పెరుగుతాయి. ఈ కాలంలో వారి కోరికలన్నీ నెరవేరుతాయి. డబ్బును విజయవంతంగా ఆదా చేయవచ్చు.
కన్యా రాశి
కన్యా రాశి వారికి భద్ర రాజయోగం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. పని విధానం కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. పని రంగంలో పురోగతి సాధిస్తారు. మీరు పెట్టుబడి పెట్టే డబ్బు రెట్టింపు లాభాలను ఇస్తుంది. ఈ రాజయోగంలో ధనలాభాలు కలుగుతాయి. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. వైవాహిక జీవితంలో శాంతి, సంతోషాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఈ శుభ సమయములో వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
మకర రాశి
మకర రాశి వారికి భద్ర రాజయోగం చాలా లాభదాయకంగా ఉంటుంది. అదృష్టం పెరుగుతుంది. ఈ సమయంలో వారు పని కోసం ప్రయాణం చేయవలసి ఉంటుంది. మంచి నైపుణ్యంతో పనులు చేసుకుంటారు. ఉద్యోగస్తులు విజయం సాధించేందుకు ఇది సరైన కాలం. ఈ కాలంలో మకర రాశి వారి జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. మతపరమైన లేదా శుభ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని కూడా పొందుతారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అందువల్ల మనసు సంతోషంగా, సంతృప్తిని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.