Yadadri Brahmotsavam 2024 : రేపటి నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు, వాహన సేవల వివరాలివే?-yadagirigutta news in telugu yadadri brahmotsavam 2024 starts march 11th vahana sevas details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Yadadri Brahmotsavam 2024 : రేపటి నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు, వాహన సేవల వివరాలివే?

Yadadri Brahmotsavam 2024 : రేపటి నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు, వాహన సేవల వివరాలివే?

Mar 10, 2024, 04:46 PM IST Bandaru Satyaprasad
Mar 10, 2024, 04:46 PM , IST

  • Yadadri Brahmotsavam 2024 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 11నుంచి 21వ తేదీ వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 11నుంచి 21వ తేదీ వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు. 

(1 / 7)

ఈ నెల 11న స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేరాధన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. మొదటి రోజు బ్రహ్మోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఆరుగురు మంత్రులు పాల్గొననున్నారు. 

(2 / 7)

యాదాద్రిలో ఈ నెల 17న స్వామి వారి ఎదుర్కోలు, 18న స్వామి వారి తిరు కల్యాణోత్సవం, 19న దివ్య విమాన రథోత్సవం, 20న  మహాపూర్ణాహుతి, చత్రతీర్థం నిర్వహించనున్నారు. 21న అష్టోత్తర శతఘటాభిషేకం, డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 

(3 / 7)

పదిరోజుల పాటు సాగే యాదాద్రి బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  ఈ నెల 18న ప్రధానాలయ ఉత్తర ప్రాంతంలోని వాయుదిశలో నిర్మించిన లిప్టు, రథశాల ప్రాంతంలో స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 

(4 / 7)

యాదగిరిగుట్ట స్వామి వారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 11 నుంచి 21 వరకు నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలను రద్దు చేశారు.

(5 / 7)

మార్చి 11న -విశ్వక్సేన ఆరాధన, స్వస్తీ వాచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురారోపణమార్చి 12న -అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వానంమార్చి 13న- ఉదయం మత్స్య అలంకారం, సాయంత్రం శేష వాహనం సేవలుమార్చి 14న -ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవమార్చి 15న- ఉదయం మురళీ కృష్ణుడి అలంకారం, రాత్రి పొన్న వాహన సేవమార్చి 16న -ఉదయం గోవర్థనగిరిధారి అలంకారం, రాత్రి సింహవాహన సేవ

(6 / 7)

మార్చి 17న- ఉదయం జగన్మోహిన అలంకారం, రాత్రి స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మార్చి 18న- హనుమంత వాహనంపై స్వామివారి ఊరేగింపు, రాత్రి గజవాహనసేవ, తిరు కల్యాణం  మార్చి 19న- ఉదయం శ్రీమహావిష్ణు అలంకార సేవ, గరుఢ వాహనంసేవ, రాత్రి దివ్య విమాన రథోత్సవంమార్చి 20న- ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థ స్నానం, మార్చి 21న- ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు సమాప్తం 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు