తెలుగు న్యూస్ / ఫోటో /
Dasara Utsavalu : కొబ్బరి బొండాలు అమ్ముకునే సామాన్యుడు దుర్గమ్మకు భారీ కానుక, రూ.16.5 లక్షల విలువైన మంగళసూత్రాలు సమర్పణ
- Indrakeeladri Dasara Utsavalu : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కొండేపికి చెందిన అంకులయ్య, రాజేశ్వరి దంపతులు అమ్మవారికి రూ.16.5 లక్షల విలువ చేసే మంగళసూత్రాలు సమర్పించారు.
- Indrakeeladri Dasara Utsavalu : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కొండేపికి చెందిన అంకులయ్య, రాజేశ్వరి దంపతులు అమ్మవారికి రూ.16.5 లక్షల విలువ చేసే మంగళసూత్రాలు సమర్పించారు.
(1 / 6)
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చే బెజవాడ దుర్గమ్మను దర్శంచుకుని, తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎంతోమంది భక్తులు అమ్మవారికి కానుకలు సమర్పించుకుంటున్నారు.
(2 / 6)
దుర్గమ్మకు కొబ్బరి బొండాలు కొట్టుకుని జీవించే సామాన్యుడు భారీ కానుకను సమర్పించుకున్నారు. ప్రకాశం జిల్లా కొండేపికి చెందిన అంకులయ్య, రాజేశ్వరి దంపతులు అమ్మవారికి రూ.16.5 లక్షల విలువ చేసే మంగళసూత్రాలు సమర్పించారు. తన సంపాదనలో ప్రతీరోజు కొంత దాచి అమ్మవారికి మంగళసూత్రాలుగా సమర్పించినట్లు ఆ భక్తుడు తెలిపారు.
(3 / 6)
భక్తులకు కొంగు బంగారంగా ఇంద్రకీలాద్రిపై వెలసిన జగజ్జననికి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు కానుకలు సమర్పిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సమయంలో అమ్మవారికి కానుకలు సమర్పిస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. గుంటూరుకు చెందిన చేబ్రోలు పుల్లయ్య అనే భక్తుడు వెండితో తయారు చేయబడిన నెమలిని శనివారం దుర్గమ్మకు సమర్పించుకున్నారు. ఈ బహుమతిని అందజేసిన దాతలకు ఆలయ కార్య నిర్వహణ అధికారి కె.ఎస్. రామారావు శేష వస్త్రంతో పాటు, తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
(4 / 6)
ఇంద్రకీలాద్రి వెలసిన కనకదుర్గా అమ్మవారికి బంగారం, వజ్రాలతో తయారుచేసిన రూ.2.5 కోట్ల విలువైన కిరీటాన్ని ఓ భక్తుడు సమర్పించారు. ముంబయికు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సౌరబ్ గౌర్ అమ్మవారికి ఈ కిరీటం బహూకరించారు.
(5 / 6)
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో మూడో రోజైన శనివారం జగన్మాత అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శనివారం వేకువనే భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో దర్శనానికి తరలివచ్చారు.
(6 / 6)
అన్నపూర్ణేశ్వరి మాతను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు తరలివచ్చారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, దేవదాయ శాఖ, పోలీస్, రెవెన్యూ, నగరపాలక సంస్థ ఏర్పాట్లు చేశాయి. క్యూలైన్లలో భక్తుల అవసరాలను గుర్తించి ప్రతి భక్తుడికి సంతృప్తికర దర్శన భాగ్యం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇతర గ్యాలరీలు