తెలుగు న్యూస్ / ఫోటో /
Monsoon Beverages | మాన్‌సూన్‌లో ఇలాంటి డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి మంచిది!
వర్షాకాలంలోనైనా శరీరానికి హైడ్రేషన్ అనేది తప్పనిసరి. ఈ కాలంలో ఎక్కువసార్లు మూత్రం వెళ్లాల్సి వస్తుంది. అందువల్లలో ఈ సీజన్ లోనూ డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. అయితే మాన్‌సూన్‌లో మీ లిస్ట్‌లో చేర్చాల్సిన రీహైడ్రేటింగ్ డ్రింక్స్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
వర్షాకాలంలోనైనా శరీరానికి హైడ్రేషన్ అనేది తప్పనిసరి. ఈ కాలంలో ఎక్కువసార్లు మూత్రం వెళ్లాల్సి వస్తుంది. అందువల్లలో ఈ సీజన్ లోనూ డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. అయితే మాన్‌సూన్‌లో మీ లిస్ట్‌లో చేర్చాల్సిన రీహైడ్రేటింగ్ డ్రింక్స్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 6)
భారతదేశంలో వర్షాకాలం ప్రారంభమైంది. మనమందరం వర్షపు చినుకులు, పచ్చని తోటలు, మట్టి వాసనలు, రుచికరమైన చిరుతిళ్లను ఆస్వాదిస్తున్నాం. వీటన్నింటితో పాటు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శరీరాన్ని హైడ్రేటింగ్ గా ఉంచుకోవాలి.(Kampus Production)
(2 / 6)
కొబ్బరి నీరు తక్కువ కేలరీలు, ఎక్కువ పోషక విలువలతో నిండిన పానీయం. ఎండాకాలంలో కొబ్బరి నీరు చాలామంది తాగుతారు. అయితే ఈ వర్షాకాలంలోనూ తాగేటు వంటి ఒక మంచి పానీయం ఇది.(Shutterstock)
(3 / 6)
పుచ్చకాయ జ్యూస్: ఈ వర్షాకాలం సీజన్‌లోనూ మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా, రిఫ్రెష్‌గా ఉంచుకోవడానికి పుచ్చకాయ జ్యూస్ మరొక గొప్ప ఛాయిస్. ఇందులో విటమిన్ A, B6, B1, Cలు ఉంటాయి. పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ సమస్య రాదు. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.(Bruno Scramgnon)
(4 / 6)
ఎలక్ట్రోలైట్స్ అనేవి మన శరీరంలో నీటి స్థాయిని సమతుల్యంగా ఉంచేందుకు సహాయపడే ఖనిజ లవణాలు. ఎలక్ట్రోలైట్ పానీయాలలో నీరు, ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. వ్యాయామం తర్వాత శక్తి కోసం, డయేరియా వంటి అనారోగ్య సమస్యల నుంచి కోలుకోవడం కోసం ఇవి తాగాలి. గాటోరేడ్, ORS, ఎలక్ట్రాల్ మొదలైనవి సులభంగా లభించే కొన్ని ఎలక్ట్రోలైట్ డ్రింక్స్.(Unsplash)
(5 / 6)
స్మూతీలు అనేవి పండ్లు, గింజలు, కూరగాయలు మొదలైన పోషక ఆహారాలతో నిండి ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. మీరు కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను ఆరోగ్యకరమైన రీతిలో పొందవచ్చు. వర్షాకాలంలో స్మూతీలు కూడా తీసుకోవచ్చు.(Shutterstock)
ఇతర గ్యాలరీలు