Telangana Tourism : బీచ్ పల్లి, జోగులాంబ దర్శనం - తుంగభద్ర, కృష్ణమ్మ పరవళ్లు చూడొచ్చు! ఇదిగో వన్ డే టూర్ ప్యాకేజీ
- తెలంగాణ టూరిజం నుంచి మరో అధ్యాత్మిక టూర్ ప్యాకేజీ వచ్చేసింది. దక్షిణ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జోగులాంబ, బీచ్ పల్లి ఆలయాలను చూపించనుంది. వీకెండ్ లో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. పెద్దలకు టికెట్ ధర రూ. 1500గా నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి…
- తెలంగాణ టూరిజం నుంచి మరో అధ్యాత్మిక టూర్ ప్యాకేజీ వచ్చేసింది. దక్షిణ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జోగులాంబ, బీచ్ పల్లి ఆలయాలను చూపించనుంది. వీకెండ్ లో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. పెద్దలకు టికెట్ ధర రూ. 1500గా నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి…
(1 / 6)
దక్షిణ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆలయాలను చూసేందుకు తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. వీకెండ్ లో ఈ టూర్ ను ఆపరేట్ చేస్తున్నారు. (Image Source TG Tourism)
(2 / 6)
‘BEECHPALLI-ALAMPUR TEMPLES & BACK’ పేరుతో తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. ప్రతి శనివారం, ఆదివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది.
(3 / 6)
ఒకే ఒక్క రోజులోనే ఈ ప్యాకేజీ ముగుస్తుంది. ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ లోని యాత్రి నివాస్ నుంచి బస్సు బయల్దేరుతుంది. ఉదయం 11. 30 గంటలకు బీచ్ పల్లికి చేరుకుంటారు. కృష్ణా నది పక్కన ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ గ్రామములో ప్రతి 12 సంవత్సరాలకు జరిగే కృష్ణానది పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తారు.కృష్ణానదిపై వంతెన దాటుతున్నప్పుడు ప్రకృతి అందాలు ఎంతో అనుభూతిని కలిగిస్తాయి. ప్రస్తుతం ఇక్కడ కృష్ణా నది దాటిగా ప్రవహిస్తోంది.
(4 / 6)
మధ్యాహ్నం 1 గంటలకు శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటారు. స్థానికంగా ఉన్న పలు ఆలయాలను చూస్తారు. హారిత హోటల్ లో లంచ్ ఉంటుంది. సాయంత్రం ఇక్కడే స్నాక్స్ ఇస్తారు. 04.30 PM - అలంపూర్ నుంచి హైదరాబాద్ కు బయల్దేరుతారు. 08.00 PM - హైదరాబాద్ కు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది
(5 / 6)
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు 1500, పిల్లలకు రూ. 1200గా నిర్ణయించారు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు