తెలుగు న్యూస్ / ఫోటో /
South Korea Wildfire: భీకరంగా దావానలం.. తగలపడుతున్న అడవి: ఫొటోలు
South Korea Wildfire: దక్షిణ కొరియాలోని నైరుతి తీర నగరమైన గంగ్‍నంగ్ (Gangneung)లో దావానలం భీకరంగా వ్యాపిస్తోంది. చిన్నపాటి షార్ట్ సర్క్యూట్ వల్ల అడవిలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అక్కడి సహాయక సిబ్బంది.
(1 / 7)
బలమైన ఈదురు గాలుల వల్ల చిన్నపాటి అగ్నిప్రమాదం.. ఏకంగా భారీ దావానలం (Wildfire)గా మారింది. గంగ్‍నంగ్ సిటీ పరిధిలోని అడవిలో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. కిలోమీటర్ల దూరం నుంచి కూడా దట్టమైన పొగ కనిపిస్తోంది. (Twitter @125ingke via REUTERS)
(2 / 7)
వైల్డ్ ఫైర్ ఇంకా కొనసాగుతుంటంతో ప్రభావిత ప్రాంతాల్లో నివరిస్తున్న సుమారు 500 మందిని ఇప్పటి వరకు అక్కడి సహాయక సిబ్బంది తరలించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు గాయపడ్డారు. పదుల సంఖ్యలో ఇళ్లు దెబ్బ తిన్నాయి.(via REUTERS)
(3 / 7)
ఓ చెట్టు కాలిన తర్వాత.. అది పవర్ కేబుళ్ల మీద పడటంతో ఈ ప్రమాదం మొదలైంది. ఆ తర్వాత మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు పదుల సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. అయితే గాలులు విపరీతంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. (AP)
(4 / 7)
ఈ దావానలానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటికి వస్తున్నాయి. ఆ ప్రాంతమంతా పొగతో కమ్ముకుపోయిన దృశ్యమిది.(Twitter @125ingke via REUTERS)
(5 / 7)
వైల్డ్ ఫైర్ ధాటికి పూర్తిగా కాలిపోయిన ఓ ఇళ్లు ఇది. త్వరితగతిన మంటలను అదుపులోకి తీసుకురావాలని సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యెవోల్ ఆదేశాలు జారీ చేశారు. (via REUTERS)
(6 / 7)
అదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఈ దావానలం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. అయితే, భారీ సంఖ్యలో ఇళ్లు దెబ్బ తిన్నాయి. (AP)
ఇతర గ్యాలరీలు