తెలుగు న్యూస్ / ఫోటో /
Remedies for Bloating | తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ టిప్స్ పాటించండి!
- మీకు తిన్న వెంటనే కడుపు ఉబ్బనట్లుగా, మంటగా అనిపిస్తుందా? అది జీర్ణ సమస్య కావచ్చు. పేగుల్లో గ్యాస్ నిండితే ఇలా జరుగుతుంది. లేదా మీకు ఆహారం పడకపోవచ్చు. కడుపు ఉబ్బరం తగ్గించుకోవటానికి ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలు అందించాం.
- మీకు తిన్న వెంటనే కడుపు ఉబ్బనట్లుగా, మంటగా అనిపిస్తుందా? అది జీర్ణ సమస్య కావచ్చు. పేగుల్లో గ్యాస్ నిండితే ఇలా జరుగుతుంది. లేదా మీకు ఆహారం పడకపోవచ్చు. కడుపు ఉబ్బరం తగ్గించుకోవటానికి ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలు అందించాం.
(1 / 8)
కొంతమందికి భోజనం చేసిన వెంటనే పొట్ట గట్టిగా, ఉబ్బినట్లుగా అనిపిస్తుంది. అతిగా తినడం, మలబద్ధకం, త్వరగా తినడం, గాలిని మింగుతూ తినడం వంటి కారణాల వల్ల కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది. కొన్నిసార్లు రుతుక్రమం వలన, హార్మోన్ల అసమతుల్యత, ఆహారం పడకపోవడం, కొన్ని రకాల ఔషధాల వాడకం వలన కూడా ఉబ్బరం సమస్య కలుగుతుంది.(Unsplash)
(2 / 8)
పొటాషియం అధికంగా ఉండే ఆకు కూరలు, ఎండుద్రాక్ష, ఆప్రికాట్లు, పాలకూర, అవకాడో, అరటిపండ్లు వంటి వాటిని తినండి. ఉపశమనం లభిస్తుంది. మరోవైపు సోడియం ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం పెరుగుతుంది. కాబట్టి డెయిరీ ప్రొడక్ట్స్, చీజ్, పిజ్జా అలాంటివి తినొద్దు.(Pixabay)
(3 / 8)
సౌకర్యంగా కూర్చొని నెమ్మదిగా 3 సార్లు లోతైన శ్వాస తీసుకోండి. దీనిని బెల్లీ బ్రీత్ అంటారు. ఇలా చేస్తే కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది.(Pixabay)
(4 / 8)
ఉబ్బరం నుండి త్వరగా కోలుకోవాలనుకుంటే గ్లూటెన్, చక్కెర ఉన్న పదార్థాలు, ఇతర శుద్ధి చేసిన ఆహారాలను తినకుండా కాస్త విరామం ఇవ్వండి.(Pixabay)
(5 / 8)
మీకు ఉబ్బరం సమస్య ఉన్నప్పుడు ఆహారాన్ని వేగంగా తినకుండా.. నెమ్మదిగా, బాగా నములుకుంటూ తినండి.(Pexels)
(6 / 8)
కడుపు ఉబ్బరం ఉన్నప్పుడు భోజనం చేసిన తర్వాత అటూ ఇటూ తిరగకుండా ఒక 3-4 నిమిషాలు కూర్చుని విశ్రాంతి తీసుకోండి. ఉబ్బరం తగ్గుతుంది.(Pexels)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు