తెలుగు న్యూస్ / ఫోటో /
Prevent Bloating | కడుపు ఉబ్బరంగా ఉంటుందా? అయితే ఇవి ఫాలో అయిపోండి..
- భోజనం చేసిన తర్వాత మీ కడుపు బిగుతుగా, బరువుగా అనిపిస్తుందా? కొన్ని రకాల ఆహారం, ఎక్కువ ఉప్పు తీసుకోవడం, మరిన్ని తప్పిదాలతో మీరు ఉబ్బరానికి గురవుతారు. మీ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచి.. మీ సమస్యను నివారించడానికి తినేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

(1 / 7)
భోజనం తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడం చాలా సాధారణం. అయితే ఈ చిట్కాలతో ఆ సమస్యను దూరం చేసుకోవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు అవంతి దేశ్‌పాండే. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.(Shutterstock)
(2 / 7)
మీ ఆహారాన్ని నెమ్మదిగా నమలండి. వేగంగా తినడం వల్ల ఎక్కువ గాలిని మింగేస్తారు. దీని వల్ల కడుపు ఉబ్బరం వచ్చే ప్రమాదముంది. అంతేకాకుండా.. మీ ఆహారాన్ని సరిగ్గా నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.(Pixabay)
(3 / 7)
పచ్చి సలాడ్లు, ఉడికించిన కూరగాయలను కలిపి తినండి. పచ్చి సలాడ్‌ని ఎక్కువగా తినడం వల్ల కూడా కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది.(Pinterest)
(4 / 7)
FODMAP అంటే పులియబెట్టగల ఒలిగోశాకరైడ్‌లు, డైసాకరైడ్‌లు, మోనోశాకరైడ్‌లు, పాలియోల్స్. ఇవి జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలిగించే నిర్దిష్ట రకాల పిండి పదార్థాలు. వాటిని నివారించడం వల్ల కడుపు ఉబ్బరం అదుపులో ఉంటుంది.(Shutterstock)
(5 / 7)
బ్రేక్ఫాస్ట్, లంచ్ మధ్య ఎక్కువ నీరు తాగొద్దు. ఎందుకంటే మీరు భోజనం చేసిన తర్వాత కడుపు అధికంగా నిండినట్లు అనిపిస్తుంది.(Unsplash)
ఇతర గ్యాలరీలు