పాలకూరతో తేలికైన ఆహరం.. సులభంగా జీర్ణం-oats sesame spinach toast to fuel your body ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పాలకూరతో తేలికైన ఆహరం.. సులభంగా జీర్ణం

పాలకూరతో తేలికైన ఆహరం.. సులభంగా జీర్ణం

HT Telugu Desk HT Telugu
Mar 23, 2022 07:20 PM IST

తేలికైన ఆహరం అయి ఉండాలి, ఎనర్జీ రావాలనుకుంటే అందుకు పాలకూర, ఓట్స్, లేదా నువ్వులు కలిపిన పదార్థాలు తీసుకోవాలి.

Spinach Sesame Oat Meal
Spinach Sesame Oat Meal (Pixabay)

అన్నం వద్దనుకున్నప్పుడు రొట్టెలు చేసుకుంటాం. అయితే ఓట్స్‌లో సాధారణంగా మనం రొట్టెలు చేయడానికి ఉపయోగించే పిండి కంటే ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.

అలాగే పాలకూర ఆకుల్లో ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్, ఇతర మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పాలకూరలోని పోషకాలు కంటిచూపుకు, జుట్టు పెరుగుదలకు, చర్మకాంతికి అదేవిధంగా ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఇక నువ్వుల్లో మాంగనీస్, కాల్షియం ఉంటుంది ఇవి ఎముకల దృఢత్వానికి మంచిది. నువ్వులు ఆహారంలో తీసుకోవడం ద్వారా పాలిచ్చే తల్లులకు, పెరుగుతున్న పిల్లలకు అవసరమైన పోషణ లభిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. జీర్ణక్రియను మెరుగవుతుంది, ఉబ్బసం, అలెర్జీలు తగ్గుతాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపడుతుంది. శరీరంలో సత్తువ పెరుగుతుంది.

కాబట్టి చెప్పేదేంటంటే.. ఈ మూడు కలిపితీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ మూడింటిని కలిపి తేలికైన, శక్తివంతమైన ఆహారం ఎలా తయారుచేసుకోవచ్చు? అంటే ఇక్కడ ఒక రెసిపీ ఇస్తున్నాం. ఇది తినడానికి తేలికగా అనిపిస్తుంది. కానీ మంచి శక్తి లభిస్తుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి.

పాలకూర ఓట్స్ టోస్ట్ - కావాల్సినవి

ఓట్స్ ½ కప్పు (50గ్రా)

బ్రౌన్ బ్రెడ్ 4

సన్నగా తరిగిన పాలకూర 1 కప్పు (100గ్రా)

చిన్న ఉల్లిపాయ - తరిగినది

రుచికి సరిపడా ఉప్పు (మిరియాలు ఐచ్చికం)

మీగడలేని పాలు ½ కప్పు (100 గ్రా)

టొమాటో ప్యూరీ (మిక్సర్‌లో రుబ్బినది) 4 tsp

నువ్వులు 2 టీస్పూన్లు

టొమాటో ముక్కలు - కొన్ని ముక్కలను అలంకరించడానికి స్ట్రిప్స్‌గా కట్ చేసుకోండి

తయారీ విధానం

ఒక పాన్ వేడి చేయండి. అందులో ఓట్స్, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు పాలకూర, ఉప్పు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే మిరియాలు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు పాలు వేసి 2 నిమిషాల పాటు కలుపుతూనే ఉడికించాలి. అనంతరం స్టవ్ నుంచి తీసి పక్కనపెట్టుకోండి.

ఇప్పుడు బ్రెడ్ ముక్కలపై 1 టీస్పూన్ టొమాటో ప్యూరీని పూయండి, అలాగే ఇంతకుముందు తయారు చేసుకున్న పాలకూర మిశ్రమాన్ని కూడా బ్రెడ్ ముక్కలపై సమానంగా పరచండి. దీనిపైన కొన్ని నువ్వులు చల్లుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలను ఓవెన్‌లో 200 ° C వద్ద టోస్ట్ అయ్యేంతవరకు 7-8 నిమిషాలు బేక్ చేయండి. లేదా పెంకపైన కాల్చుకోవచ్చు. ఈ రెండు వద్దనుకుంటే నేరుగా తినేయచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం