తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Updates : అల్పపీడనం, ఆవర్తనం ఎఫెక్ట్...! మరో 4 రోజులు వర్షాలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Telangana Weather News : ఉపరిత ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో మరో నాలుగైదు రోజులు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏపీలోని కోస్తా జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక సీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వానలు పడొచ్చని IMD అంచనా వేసింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 7)
నైరుతి బంగ్లాదేశ్, పొరుగు ప్రాంతంలో ఉన్న ఎగువ ఉపరితల ఆవర్తన ప్రభావంతో... ఉత్తర బంగాళాఖాతం అనుకుని ఉన్న తీర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరిత ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో నైరుతి వైపు వరకు వంగి ఉందని వివరించింది.
(2 / 7)
పశ్చిమ మధ్య మరియు దానిని అనుకున్న ఉన్న దక్షిణ బంగాళాఖాతం మీద ఎగువ ఉపరితల ఆవర్తనం విస్తరించింది ఉందని ఐఎండీ పేర్కొంది. సగటు సముద్ర మట్టానికి 1. 5 కి.మీ ఈ ఆవర్తనం విస్తరించి ఉందని అంచనా వేసింది.
(3 / 7)
ఏపీలోని ఉత్తర కోస్తా. దక్షిణ కోస్తా ప్రాంతంలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని తెలిపింది. సీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువొచ్చని అంచనా వేసింది.
(4 / 7)
ఇక శ్రీకాకుళం,విజయనగరం,కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల,పల్నాడు, నెల్లూరు,అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(5 / 7)
ఇక తెలంగాణలో (అక్టోబర్ 05) నిజామాబాజ్, సిరిసిల్ల, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(6 / 7)
రేపు(ఆదివారం) రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇతర గ్యాలరీలు