Nothing Phone (1) | విడుదలకు ముందే ఫీచర్లు లీక్.. నథింగ్ ఫోన్‌లో అంతగా ఏముంది?-nothing phone 1 features and specifications leaked know price ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nothing Phone (1) | విడుదలకు ముందే ఫీచర్లు లీక్.. నథింగ్ ఫోన్‌లో అంతగా ఏముంది?

Nothing Phone (1) | విడుదలకు ముందే ఫీచర్లు లీక్.. నథింగ్ ఫోన్‌లో అంతగా ఏముంది?

Jun 15, 2022, 03:18 PM IST HT Telugu Desk
Jun 15, 2022, 03:18 PM , IST

ఐఫోన్‌కు మించిన ధరతో నథింగ్ ఫోన్ (1) వార్తల్లో నిలిచింది. వన్‌ప్లస్ మాజీ వ్యవస్థాపకుడు కార్ల్ పీకు చెందిన నథింగ్ బ్రాండ్ నుంచి ఈ ఫోన్ రాబోతుంది.  నథింగ్ స్మార్ట్‌ఫోన్ జూలై 12న లాంచ్ అవుతోంది. అయితే లాంచ్‌కు ముందే కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.

నథింగ్ ఇయర్ (1) ఇయర్‌బడ్స్‌ ఇప్పటికే భారత మార్కెట్లోకి వచ్చాయి. భారతీయ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ప్రకారం నథింగ్ ఫోన్ (1) కూడా నథింగ్ ఇయర్ (1) ఇయర్‌బడ్స్ లాంటి ట్రాన్స్పరెంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. రూ. 2,000 టోకెన్ ధరతో ఈ ఫోన్ ప్రీ-బుకింగ్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి.

(1 / 7)

నథింగ్ ఇయర్ (1) ఇయర్‌బడ్స్‌ ఇప్పటికే భారత మార్కెట్లోకి వచ్చాయి. భారతీయ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ప్రకారం నథింగ్ ఫోన్ (1) కూడా నథింగ్ ఇయర్ (1) ఇయర్‌బడ్స్ లాంటి ట్రాన్స్పరెంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. రూ. 2,000 టోకెన్ ధరతో ఈ ఫోన్ ప్రీ-బుకింగ్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి.(Nothing)

నథింగ్ ఫోన్ (1)లో 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉంటుంది. 1TB వరకు విస్తరించవచ్చు. అలాగే ఈ ఫోన్ Snapdragon 7 Gen 1 ప్రాసెసర్ తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

(2 / 7)

నథింగ్ ఫోన్ (1)లో 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉంటుంది. 1TB వరకు విస్తరించవచ్చు. అలాగే ఈ ఫోన్ Snapdragon 7 Gen 1 ప్రాసెసర్ తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.(Nothing)

నథింగ్ స్మార్ట్‌ఫోన్ 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.5 అంగుళాల పంచ్-హోల్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని, అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

(3 / 7)

నథింగ్ స్మార్ట్‌ఫోన్ 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.5 అంగుళాల పంచ్-హోల్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని, అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.(Nothing)

నథింగ్ ఫోన్ (1) 50 MP ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ బ్లోట్‌వేర్ లేని కస్టమ్ ఆండ్రాయిడ్ లాంచర్ అయిన నథింగ్ OS ఆధారంగా స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. దీనికి ధృవీకరణ అవసరం.

(4 / 7)

నథింగ్ ఫోన్ (1) 50 MP ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ బ్లోట్‌వేర్ లేని కస్టమ్ ఆండ్రాయిడ్ లాంచర్ అయిన నథింగ్ OS ఆధారంగా స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. దీనికి ధృవీకరణ అవసరం.(Nothing)

డిజైన్ పరంగా స్మార్ట్‌ఫోన్ దిగువ ఎడమ వైపున మెటల్ ఫ్రేమ్‌పై “నథింగ్” బ్రాండింగ్‌ను కలిగి ఉంది. వాల్యూమ్ టోగుల్‌ ఎడమవైపు, పవర్ టోగుల్ కుడి వైపున ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ వెనుక రెండు పెద్ద కెమెరా బంప్‌లు ఉన్నాయి. “పారదర్శక డిజైన్, సర్ఫేసింగ్ కర్వ్డ్ సర్క్యూట్‌లు" నాణ్యమైన మెటీరియల్ తో తయారు చేసిన ఫోన్ ఇది అని కంపెనీ నథింగ్ ఫోన్ (1) లాంచ్ పేజీలో పేర్కొంది.

(5 / 7)

డిజైన్ పరంగా స్మార్ట్‌ఫోన్ దిగువ ఎడమ వైపున మెటల్ ఫ్రేమ్‌పై “నథింగ్” బ్రాండింగ్‌ను కలిగి ఉంది. వాల్యూమ్ టోగుల్‌ ఎడమవైపు, పవర్ టోగుల్ కుడి వైపున ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ వెనుక రెండు పెద్ద కెమెరా బంప్‌లు ఉన్నాయి. “పారదర్శక డిజైన్, సర్ఫేసింగ్ కర్వ్డ్ సర్క్యూట్‌లు" నాణ్యమైన మెటీరియల్ తో తయారు చేసిన ఫోన్ ఇది అని కంపెనీ నథింగ్ ఫోన్ (1) లాంచ్ పేజీలో పేర్కొంది.(Nothing)

అయితే ఈ లీక్ అయిన ఫీచర్లు, ఇతర వివరాలు నథింగ్ ఫోన్ (1)లో నిజంగా ఉంటాయా లేదా అనేది ఫోన్ అధికారికంగా విడుదలయితే గానీ చెప్పలేం. అయినప్పటికీ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఫోన్ ఇక్కడ చెప్పిన వివరాలకు దగ్గరగానే ఉంటుందంటున్నారు.

(6 / 7)

అయితే ఈ లీక్ అయిన ఫీచర్లు, ఇతర వివరాలు నథింగ్ ఫోన్ (1)లో నిజంగా ఉంటాయా లేదా అనేది ఫోన్ అధికారికంగా విడుదలయితే గానీ చెప్పలేం. అయినప్పటికీ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఫోన్ ఇక్కడ చెప్పిన వివరాలకు దగ్గరగానే ఉంటుందంటున్నారు.(Nothing)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు