తెలుగు న్యూస్ / ఫోటో /
Smartphones under 40K | రూ. 40 వేల బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు!
Smartphones under INR 40,000: మీరు మంచి ఫీచర్లు, మంచి పెర్ఫార్మెన్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ రూ. 40,000/- అయితే.. మీకు ఈ బడ్జెట్లో లభించే అత్యుత్తమమైన స్మార్ట్‌ఫోన్ మోడల్స్ మార్కెట్లో ఏమున్నాయో తెలుసుకోండి.
Smartphones under INR 40,000: మీరు మంచి ఫీచర్లు, మంచి పెర్ఫార్మెన్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ రూ. 40,000/- అయితే.. మీకు ఈ బడ్జెట్లో లభించే అత్యుత్తమమైన స్మార్ట్‌ఫోన్ మోడల్స్ మార్కెట్లో ఏమున్నాయో తెలుసుకోండి.
(1 / 6)
Realme GT Neo 3: ప్రస్తుతం ఈ ఫోన్ ధర Flipkartలో రూ. 36,999/- గా ఉంది. (8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం). Realme GT Neo 3 ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. Mediatek డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ (50MP + 8MP + 2MP) అలాగే 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఫోన్ 5000mAh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంది.(Amritanshu / HT Tech)
(2 / 6)
Vivo V23 Pro 5G: ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 38,990. ఇందులో 6.56 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ (108MP + 8MP + 2MP), డ్యూయల్ ఫ్రంట్ కెమెరా (50MP + 8MP) ఉన్నాయి. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1200 చిప్‌సెట్‌పై నడుస్తుంది. 4300mAh బ్యాటరీతో ప్యాక్ కలిగి ఉంది. ఈ ఫోన్ సన్‌షైన్ గోల్డ్, స్టార్‌డస్ట్ బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్లలో లభిస్తుంది.(Amritanshu / HT Tech)
(3 / 6)
Samsung Galaxy A53: ఈ ఫోన్ ప్రస్తుతం 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం ధర, రూ. 32,999/- గా ఉంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లే, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ (64MP + 12MP + 5MP + 5MP) , 32MP ఫ్రంట్ కెమెరా వంటి స్పెక్స్ ఉన్నాయి. ఇది ఎక్సినోస్ ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, 5000mAh బ్యాటరీతో శక్తిని పొందుతుంది.(Amritanshu / HT Tech)
(4 / 6)
Xiaomi 11T Pro 5G Hyperphone: 8GB RAM, 128GB స్టోరేజ్‌తో ఏకైక మెటోరైట్ బ్లాక్‌లో లభించే ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ. 37,999/- గా ఉంది. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల డిస్‌ప్లే, 108MP వెనుక కెమెరా, 5000 mAh బ్యాటరీ తదితర స్పెక్స్ ఉన్నాయి. ఫోన్ Snapdragon 888 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.(Amritanshu / HT Tech)
(5 / 6)
Oppo Reno 7 Pro 5G:మంచి కెమెరా పనితీరు మీ ప్రాధాన్యత అయితే, Oppo Reno7 Pro 5Gని ఎంచుకోవడం బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ (50MP + 8MP + 2MP) అలాగే 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో 12GB RAM, 256GB స్టోరేజ్, 6.5 అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లే అలాగే 65W SuperVOOC ఫాస్ట్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయగల 4500mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ ధర రూ. 39,999/-(Priya/HT Tech)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు