Google Pixel 6a | తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కలిగిన పిక్సెల్ సిరీస్ ఫోన్‌!-google pixel 6a unveiled at affordable price ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Google Pixel 6a Unveiled At Affordable Price

Google Pixel 6a | తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కలిగిన పిక్సెల్ సిరీస్ ఫోన్‌!

May 12, 2022, 03:16 PM IST HT Telugu Desk
May 12, 2022, 03:16 PM , IST

టెక్ దిగ్గజం గూగుల్ తమ Google I/O 2022 ఈవెంట్‌లో అనేక గాడ్జెట్లను లాంచ్ చేసింది. ఆ ఈవెంట్ లోని ప్రధాన హైలైట్లలో Google Pixel 6a ఫోన్ కూడా ఒకటి. ఇది Google Pixel 6 సిరీస్‌లో అత్యంత సరసమైన ఫోన్‌గా ప్రచారం జరుగుతోంది. మరి దీని ధర, ఇతర విశేషాలను తెలుసుకోండి.. 

Google Pixel 6a ధర యూఎస్ మార్కెట్లో $449. మన భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ, 34,800/-. అయితే ఇది మార్కెట్లో అత్యంత చవకైన 'ప్రీమియం' స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా చెబుతున్నారు. ఈ ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి రాబోతుంది.

(1 / 5)

Google Pixel 6a ధర యూఎస్ మార్కెట్లో $449. మన భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ, 34,800/-. అయితే ఇది మార్కెట్లో అత్యంత చవకైన 'ప్రీమియం' స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా చెబుతున్నారు. ఈ ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి రాబోతుంది.(Google)

Google Pixel 6a స్మార్ట్‌ఫోన్‌లో 60Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.1-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను అమర్చారు. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కోటింగ్‌ను కలిగి ఉంది.

(2 / 5)

Google Pixel 6a స్మార్ట్‌ఫోన్‌లో 60Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.1-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను అమర్చారు. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కోటింగ్‌ను కలిగి ఉంది.(Google)

Google Pixel 6a ఫోన్ 6GB LPDDR5 RAM అలాగే 128GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఇది ఒక వేరియంట్‌లో లభించనుంది. ఇందులో అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, టైటాన్ M2 సెక్యూరిటీ చిప్ సహా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

(3 / 5)

Google Pixel 6a ఫోన్ 6GB LPDDR5 RAM అలాగే 128GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఇది ఒక వేరియంట్‌లో లభించనుంది. ఇందులో అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, టైటాన్ M2 సెక్యూరిటీ చిప్ సహా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.(Google)

ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా మరొక ప్రత్యేక ఆకర్షణ. వెనుక భాగంలో 12.2-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు Sony IMX363 సెన్సార్, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.

(4 / 5)

ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా మరొక ప్రత్యేక ఆకర్షణ. వెనుక భాగంలో 12.2-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు Sony IMX363 సెన్సార్, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.(Bloomberg)

Google Pixel 6aకి కంపెనీ 3 సంవత్సరాల పాటు OS అప్‌డేట్‌లు ఇంకా 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను కల్పిస్తామని హామి ఇచ్చింది.

(5 / 5)

Google Pixel 6aకి కంపెనీ 3 సంవత్సరాల పాటు OS అప్‌డేట్‌లు ఇంకా 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను కల్పిస్తామని హామి ఇచ్చింది.(Bloomberg)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు