Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‍కు నిరాశ.. ఫలించని పతక పోరాటం.. అప్పీల్‍ను కొట్టేసిన సీఏఎస్
- Vinesh Phogat: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‍కు నిరాశ ఎదురైంది. పారిస్ ఒలింపిక్స్ 2024 ఫైనల్‍లో అనర్హతకు గురైన ఆమె.. రజతం పతకం ఇవ్వాలంటూ చేసిన అప్పీల్‍ను సీఏఎస్ తిరస్కరించింది. ఆ వివరాలివే..
- Vinesh Phogat: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‍కు నిరాశ ఎదురైంది. పారిస్ ఒలింపిక్స్ 2024 ఫైనల్‍లో అనర్హతకు గురైన ఆమె.. రజతం పతకం ఇవ్వాలంటూ చేసిన అప్పీల్‍ను సీఏఎస్ తిరస్కరించింది. ఆ వివరాలివే..
(1 / 5)
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పోరాటం ఫలించలేదు. పారిస్ ఒలింపిక్స్ 2024 మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‍లో అద్భుత ఆట తీరుతో ఆమె ఫైనల్ చేరింది. అయితే, ఫైనల్‍కు ముందు అనర్హత వేటు పడింది. అయితే, ఫైనల్‍కు అర్హత సాధించిన తనకు రజత పతకం ఇవ్వాలంటూ సీఏఎస్‍కు వినేశ్ అప్పీల్ చేశారు. అయితే, అప్పీల్ తిరస్కారానికి గురైంది. (HT_PRINT)
(2 / 5)
రజతం ఇవ్వాలంటూ వినేశ్ ఫొగాట్ చేసిన అప్పీల్‍ను కొట్టేస్తున్నట్టు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) నేడు (ఆగస్టు 14) తీర్పు వెలువరించింది. దీంతో న్యాయపోరాటం చేసిన వినేశ్‍కు నిరాశే ఎదురైంది. (HT_PRINT)
(3 / 5)
ఇప్పటికే వినేశ్ ఫొగాట్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ తరఫున వాదనలను సీఏఎస్ వినింది. అయితే, తీర్పు ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసింది. ఎట్టకేలకు నేడు తుది నిర్ణయాన్ని వెల్లడించింది.(AP)
(4 / 5)
అనర్హత వేటుకు గురైనా ఫైనల్ వరకు వచ్చినందుకు రజతం ఇవ్వాలని వినేశ్ చేసిన అభ్యర్థనను సీఏఎస్ తోసిపుచ్చింది. వినేశ్ విషయంలో సీఏఎస్ తీర్పు పట్ల భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రెసిడెంట్ పీటీ ఉష అసంతృప్తి వ్యక్తం చేశారు. (HT_PRINT)
(5 / 5)
పారిస్ ఒలింపిక్స్ 2024లో ఫైనల్ చేరి ఆగస్టు 6న వినేశ్ చరిత్ర సృష్టించారు. ఒలింపిక్ క్రీడల్లో రెజ్లింగ్ ఫైనల్ చేరిన తొలి భారత మహిళగా ఘనత దక్కించుకున్నారు. అయితే, మరుసటి రోజు ఫైనల్ ఆడే ముందు 50 కేజీల కంటే 100 గ్రాములు బరువు ఎక్కువ ఉండటంతో అనర్హతకు గురయ్యారు. పతకం దక్కలేదు. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఆరు పతకాలకే (ఒక రజతం, ఐదు కాంస్యాలు) పరిమితమైంది. (HT_PRINT)
ఇతర గ్యాలరీలు