AP TG Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం...! ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
- AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు కూడా వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు కూడా వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
(1 / 8)
(2 / 8)
మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది మే 24 నాటికి వాయుగుండంగా కేంద్రీకృతమై అవకాశం ఉందని అంచనా వేసింది.
(photo source https://unsplash.com)(3 / 8)
ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
(photo source https://unsplash.com)(4 / 8)
(5 / 8)
మే 19(ఇవాళ) శ్రీకాకుళం,అల్లూరి,మన్యం, అనకాపల్లి,కాకినాడ,ఉభయగోదావరి, కోనసీమ,ఏలూరు,కృష్ణా,నెల్లూరు, కర్నూలు,నంద్యాల,అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
(@APSDMA Twitter)(6 / 8)
అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీలోని కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
(photo source https://unsplash.com)(7 / 8)
మే 23వ తేదీ వరకు తెలంగాణ, ఏపీలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
(@APSDMA Twitter)ఇతర గ్యాలరీలు