తెలుగు న్యూస్ / ఫోటో /
TS Weather Updates : మళ్లీ ఎండల తీవ్రత..! ఆ తేదీ తర్వాత తెలంగాణలో తేలికపాటి వర్షాలు
- Telangana Weather Updates : గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఎండల తీవ్రత పెరుగుతోంది. రెండు మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వెదర్ రిపోర్ట్ వివరాలను ఇక్కడ చూడండి..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
ఏపీ, తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రత తగ్గింది. ఓ దశలో 45 డిగ్రీలకు వెళ్లిన ఎండలు… ఇప్పుడు 40 డిగ్రీలకు లోపునకు చేరాయి.(Photo Source From unsplash.com)
(2 / 6)
ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు తెలంగాణలో పొడి వాతవరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఎండల తీవ్రత కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.(Photo Source From unsplash.com)
(3 / 6)
ఇదిలా ఉంటే… ఏప్రిల్ 16 తర్వాత మళ్లీ తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. (Photo Source From unsplash.com)
(4 / 6)
ఏప్రిల్ 17, 18, 19 తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.(Photo Source From unsplash.com)
(5 / 6)
ఇక ఏపీలో చూస్తే ఎండల తీవ్రత పెరుగుతోంది. ఆదివారం(ఏప్రిల్ 14) 18 మండలాల్లో తీవ్రవడగాల్పులు,151 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.(Photo Source From unsplash.com)
(6 / 6)
ఏపీలో రేపు (సోమవారం) 33 మండలాల్లో తీవ్రవడగాల్పులు,135 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.(Photo Source From unsplash.com)
ఇతర గ్యాలరీలు