Lakshmi Devi: లక్ష్మీ దేవికి ఈ అలవాట్లు నచ్చవు, మీకు ఉంటే వెంటనే వదిలేయండి
- Lakshmi Devi: లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే కొన్ని రకాల అలవాట్లు ఉండకూడదు. ఆమెకు నచ్చని పనులు మీరు ఇంట్లో చేస్తే ఆమె మిమ్మల్ని కటాక్షించదు.
- Lakshmi Devi: లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే కొన్ని రకాల అలవాట్లు ఉండకూడదు. ఆమెకు నచ్చని పనులు మీరు ఇంట్లో చేస్తే ఆమె మిమ్మల్ని కటాక్షించదు.
(1 / 6)
లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఆమె కృప ఉండే ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. కానీ లక్ష్మీదేవికి కోపం వచ్చినప్పుడు మాత్రం ఇంట్లో మంచి జరుగదు.
(2 / 6)
లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలని, తన ఇల్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. కానీ లక్ష్మీదేవికి నచ్చని కొన్ని అలవాట్లు, పనులు ఉన్నాయి. వీటిని చేస్తే మీ ఇంటికి వచ్చిన లక్ష్మి కూడా తిరిగి వెళ్లిపోతుంది.
(3 / 6)
లక్ష్మి మాత ఎప్పుడూ శుభ్రంగా ఉండే ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రపరచండి.
(4 / 6)
డబ్బులు వృధా చేసే అలవాటు ఉన్నవారికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. ముఖ్యంగా జూదం, బెట్టింగ్ లకు పాల్పడి డబ్బును దుర్వినియోగం చేసే వారిని లక్ష్మీదేవి ఇష్టపడదు. అందువల్ల, మీరు కష్టపడి సంపాదించిన డబ్బును తెలివిగా ఖర్చు చేయండి.
(5 / 6)
ప్లేట్లలో ఆహారాన్ని విడిచిపెట్టడం, ఆహారాన్ని వేస్టు చేయడం వంటివారిపై లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదని, ఆ ఇంట్లో పేదరికం రాజ్యమేలుతుందంటారు. మీ కుటుంబానికి లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలంటే, ఆహారాన్ని వేస్టు చేయకండి.
ఇతర గ్యాలరీలు