(1 / 5)
ఐఫోన్ 16 సిరీస్‍ను సెప్టెంబర్‌లో లాంచ్ చేసింది యాపిల్. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లు ఈ సిరీస్‍లో వచ్చాయి. బయోనిక్ ఏ18 సిరీస్ ప్రాసెసర్లు, యాపిల్ ఇంటెలిజెన్స్ ఐఏ ఫీచర్ల సపోర్టుతో ఈ మొబైల్స్ అడుగుపెట్టాయి. ఐఫోన్ 16 సిరీస్ మొబైళ్లకు కొత్త కెమెరా బటన్ కూడా ఉంది.
(Apple)(2 / 5)
సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్‍ఈ మొబైల్ సెప్టెంబర్‌లో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ ఎగ్జినోస్ 2400ఈ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్‍తో వచ్చింది. 4,700 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ మొబైల్ కలిగి ఉంది. గత మోడల్‍తో పోలిస్తే ఈ ఎస్24 ఎఫ్‍ఈ ధరను సామ్‍సంగ్ పెంచింది. రూ.59,999 రేట్‍తో ఈ ఫోన్ లాంచ్ అయింది.
(Samsung)(3 / 5)
మోటోరోలా రేజర్ 50 ఫోల్డబుల్ ఫోన్ కూడా లాంచ్ అయింది. రేజర్ 50 సిరీస్‍లో ఇది స్టాండర్డ్ మోడల్‍గా అడుగుపెట్టింది. ప్రీమియం, అడ్వాన్స్ ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. మీడియాటెక్ డైమన్సిటీ 7300ఎక్స్ ప్రాసెసర్‌పై ఈ మొబైల్ రన్ అవుతుంది. మెయిన్ స్క్రీన్‍తో పాటు కవర్ స్క్రీన్‍పై కూడా ఏఐ ఫీచర్లను వాడుకునే సదుపాయం ఉండడం ప్రత్యేకతగా ఉంది. రూ.64,999 ధరకు ఈ ఫోన్ అడుగుపెట్టింది.
(Aishwarya Panda/ HT Tech)(4 / 5)
వివో వీ40ఈ మొబైల్‍ను సెప్టెంబర్‌లోనే లాంచ్ చేసింది వివో సంస్థ. ఈ మిడ్ రేంజ్ మొబైల్ మీడియాటెక్ డైమన్సిటీ 7300 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్‍ప్లేతో వచ్చింది. ఈ ఫోన్ ప్రారంభ ధర ఫ్లిప్‍కార్ట్‌లో ప్రస్తుతం రూ.29,999గా ఉంది.
(Aishwarya Panda/ HT Tech)(5 / 5)
అక్టోబర్ నెలలోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోన్లు లాంచ్ అవనున్నాయి. ఒప్పో ఫైండ్ ఎక్స్8 సిరీస్, లావా అగ్ని 3, వివో ఎక్స్200, అందులో ప్రధానంగా ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు